Jump to content

మాలిని గౌర్

వికీపీడియా నుండి
మాలిని గౌర్
మాలిని గౌర్


ప్రస్తుత పదవిలో
అధికార కాలం
డిసెంబర్ 2008
ముందు లక్ష్మణ్ సింగ్ గౌర్
నియోజకవర్గం ఇండోర్-4

ఇండోర్ మేయర్
పదవీ కాలం
ఫిబ్రవరి 2015 – 2020
ముందు కృష్ణ మురారి మోఘే
తరువాత పుష్యమిత్ర భార్గవ్

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి
లక్ష్మణ్ సింగ్ గౌర్
(m. 1983⁠–⁠2008)
నివాసం ఇండోర్
వృత్తి రాజకీయ నాయకురాలు

మాలిని గౌర్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె మధ్యప్రదేశ్ శాసనసభకు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఫిబ్రవరి 2015 నుండి 2020 వరకు ఇండోర్ మేయర్‌గా పని చేసింది.

రాజకీయ జీవితం

[మార్చు]

మాలిని గౌర్ తన భర్త మాజీ మంత్రి లక్ష్మణ్ సింగ్ గౌర్ మరణాంతరం భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2008 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఇండోర్-4 శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి గోవింద్ మంఘానిపై 28043 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1] ఆమె 2013 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ మిండాపై 33823 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[2] |-

మాలిని గౌర్ ఫిబ్రవరి 2015 నుండి 2020 వరకు ఇండోర్ మేయర్‌గా పని చేసింది. ఆమె 2018 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఇండోర్-4 శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సుర్జీత్ సింగ్ ఉజాగర్ సింగ్ చద్దాపై 43090 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[3] ఆమె 2023 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి పిఎల్ రాజా మంధ్వనిపై 69837 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[4][5]

మూలాలు

[మార్చు]
  1. "Madhya Pradesh Vidhan Sabha General Elections - 2008 (in Hindi)" (PDF). Chief Electoral Officer, Madhya Pradesh website. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 March 2011.
  2. CEO Madhyapradesh (2013). "Madhya Pradesh Assembly Election Results 2013 Complete Winners List" (PDF). the original (PDF) నుండి 17 February 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 February 2023.
  3. India Today (12 December 2018). "Madhya Pradesh election results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 17 February 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 February 2023.
  4. "Indore-4 Constituency Election Results 2023" (in ఇంగ్లీష్). The Times of India. 3 December 2023. the original నుండి 27 February 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 27 February 2025.
  5. "Madhya Pradesh Assembly Election Results 2023 - Indore-4". Election Commission of India. 3 December 2023. the original నుండి 27 February 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 27 February 2025.