మాల్గుడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మాల్గుడి అనేది భారతదేశంలోని ఒక కల్పిత పట్టణం. తన నవలలు మరియు లఘు కథల్లో భాగంగా ఆర్.కె. నారాయణ్ దీన్ని సృష్టించారు. నారాయణ్ రచనల్లో భాగంగా ఈ పట్టణం రూపాన్ని సంతరించుకుంది. ఆయన మొదటి నవల స్వామి అండ్ ఫ్రెండ్స్‌తో ప్రారంభించి, ఆయన రచించిన పదిహేను నవలల్లో ఒక్కదానిలో మినహా మరియు ఆయన రచించిన లఘు కథల్లో చాలావరకు ఈ పట్టణంలో జరిగినట్టుగానే రచింపబడ్డాయి. భారతదేశంలోని ఒక సూక్ష్మభాగంగా గుర్తించే స్థాయిలో నారాయణ్ అత్యంత విజయవంతంగా తన రచనల్లో మాల్గుడిని ప్రవేశపెట్టారు.

భౌగోళిక స్థితి[మార్చు]

మాల్గుడి అనేది దక్షిణ భారతదేశంలో ఏదో ఒక మూల ఉండే ఒక చిన్న పట్టణం. మద్రాస్ నుంచి కేవలం కొన్ని గంటల ప్రయాణంలో ఈ పట్టణానికి చేరుకోవచ్చు. కల్పిత నది అయిన సరయు ఒడ్డున ఈ పట్టణం కొలువుదీరి ఉంటుంది. దీనికి సమీపంలో మెంపి ఫారెస్ట్ ఉంటుంది.

మాల్గుడి అనేది ఒక కల్పిత పట్టణమనే విషయాన్ని నారాయణ్ తరచూ నొక్కి చెప్పేవారు. అయినప్పటికీ, ఈ పట్టణానికి సంబంధించిన వాస్తవ స్థానం గురించి ఊహలు చేసే అభిమానుల్ని మాత్రం నారాయణ్ చెప్పిన మాటలు ఎంతమాత్రమూ నిరుత్సాహపర్చలేదు. అయితే, ఒక ఇంటర్వ్యూలో నారాయణ్ చెప్పిన ప్రకారం, ఈ పట్టణం దక్షిణ భారతదేశంలోనే ఉందనే విషయం మాత్రం స్పష్టమైంది:

"నేను సృష్టించే పాత్ర మనస్తత్వం గురించి నేను తప్పకుండా పూర్తి నిర్దిష్టత కలిగి ఉండడంతో పాటు అంతే సమానంగా ఆ పాత్ర నేపథ్యం గురించి కూడా నేను నిర్దిష్టత కలిగి ఉంటాను. తమిళం మరియు కన్నడం మాట్లాడే ప్రజల గురించి నాకు చక్కగా తెలుసు. అలాగే వారి నేపథ్యం గురించి కూడా నాకు తెలుసు. వారి మనసులు ఏవిధంగా ఆలోచిస్తాయనే విషయం కూడా నాకు తెలుసు. అలాగే నా విషయంలో జరిగిన విధంగానే, నిర్దిష్ట పరిస్థితుల్లో వారికి ఏం జరుగుతుందనే విషయం నాకు కచ్చితంగా తెలుసు. అలాగే ఆయా పరిస్థితుల్లో వారు ఏవిధంగా ప్రతిస్పందిస్తారనే విషయం కూడా నాకు తెలుసు" అని ఆయన తెలిపారు.

అయినప్పటికీ, మాల్గుడికి సంబంధించిన కచ్చితమైన ప్రదేశం విషయంలో ఊహాగానాలు మాత్రం ఆగలేదు. చాలామంది భావన ప్రకారం, ఆ పట్టణం కోయంబత్తూర్ కావచ్చు. ఒకవైపు నది, మరోవైపు అడవితో పాటు మాల్గుడిలో ఉన్నట్టుగానే చాలా భవనాలు మరియు వీధులు కోయంబత్తూర్‌లో ఉండడమే అందుకు కారణం. మరోవైపు గతంలో మైసూర్ రాష్ట్రంలో ఉండే కావేరీ లేదా యాదవ్‌గిరి అనే నది సమీపంలో ఉండే లాల్గుడి అనేది మాల్గుడి కావచ్చనే ఊహాగానాలు కూడా ప్రచారంలో ఉన్నాయి.

మరోవైపు నారాయణ్ రచనల ఆధారంగా రూపొందిన మాల్గుడి డేస్ అనే TV సీరియల్‌లోని చాలా ఎపిసోడ్లలో మాత్రం పశ్చిమ కనుమలులో ఉండే అగుంబె అనే చిన్న గ్రామం మాల్గుడిగా చిత్రించబడింది. ఇక నారాయణ్ నవల ఆధారంగా, నవల పేరుతోనే రూపొందిన గైడ్ చిత్రం మాత్రం దక్షిణ భారతదేశానికి బదులుగా రాజస్థాన్‌లో చిత్రీకరణ జరుపుకుంది. అయితే, ఇందుకు నారాయణ్ మాత్రం పెద్దగా సంతోషించలేదన్నది వాస్తవం.

పరిసరాలు మరియు ప్రఖ్యాత ప్రదేశాలు[మార్చు]

సరయు నది[మార్చు]

మాల్గుడి అనేది సరయు నదికి దగ్గర్లో కొలువై ఉంటుంది. స్వామి అండ్ ఫ్రెండ్స్ నవలలో స్వామి, మణి, రాజాలు చాలా వరకు సాయంత్రాల వేళ తమ ఆటలు లేదా కబుర్లను ఈ నది ఒడ్డునే సాగిస్తుంటారు. ఇక ది గైడ్‌లో పవిత్ర వ్యక్తి అయిన రాజు సరయు నది ఎండిపోయిన సమయంలో వర్షాలు రావాలని ప్రార్థిస్తూ నది ఒడ్డునే కూర్చుని ఉపవాస దీక్ష చేస్తాడు. అలాగే మహాత్మా గాంధీ మాల్గుడిని సందర్శించిన సమయంలో, సమావేశాలు మరియు ప్రసంగాలు మొత్తం సరయు నది తీరంలోనే జరుగుతాయి.

వీధులు మరియు పరిసరాలు[మార్చు]

మార్కెట్ స్ట్రీట్ అనేది మాల్గుడిలోని ప్రధాన వీధి. బాంబే ఆనంద్ భవన్ మరియు ట్రూత్ ప్రింటింగ్ వర్క్స్‌తో సహా అనేక పెద్ద దుకాణాలు ఈ వీధిలో కొలువుదీరి ఉంటాయి. కబీర్ స్ట్రీట్ అనేది మాల్గుడిలోని ఉన్నత వర్గం వారు నివసించే వీధి. అదేసమయంలో లాలే ఎక్స్‌టెన్షన్ అనేది ధనిక మరియు పలుకుబడి కలిగివారి ఇళ్ల కోసం రూపుదిద్దుకుంటున్న ఒక కొత్త వీధి. ఎల్లమన్ స్ట్రీట్ అనేది, నూనె అమ్మేవారి ఇళ్లు ఉండే వీధి. ఇది మాల్గుడిలో చివరి ఉండే వీధి మాత్రమే కాకుండా సరయు నదికి పక్కనే ఉంటుంది. గ్రోవ్ స్ట్రీట్ మరియు కాళీఘాట్ లేన్‌తో సహా ఇతర వీధులు కూడా ఇందులో ఉన్నాయి.

ఎల్లమన్ స్ట్రీట్ మరియు నది ఉండే నల్లప్పాస్ గ్రోవ్ మరియు దహన వాటిక మధ్య ఈ ఇతర వీధులు ఉంటాయి. ఇక మాల్గుడిలో ఉండే అంటరానివారు మరియు పారిశుద్ధ్య కార్మికులు నదికి దగ్గర్లో జీవిస్తుంటారు.

భవనాలు[మార్చు]

ఇక్కడి ప్యాలెస్ టాకీస్ అనేది 1935లో నిర్మించబడింది. పురాతన వెరైటీ హాల్‌ స్థానంలో దీన్ని నిర్మించారు. ఆల్బర్ట్ మిషన్ స్కూల్ మరియు ఆల్బర్ట్ మిషన్ కాలేజ్ లాంటివి ఇందులోని ప్రఖ్యాత విద్యా సంస్థలు. ఇందులో బోర్డ్ స్కూల్ మరియు పట్టణ ప్రాథమిక పాఠశాలలు కూడా ఉంటాయి.

ఇతర ప్రఖ్యాత ప్రదేశాలు[మార్చు]

మాల్గుడిలో చిన్నపాటి రైల్వే స్టేషను‌ కూడా ఉంది. అలాగే గుర్రం మీద కూర్చుని ఉండే Mr లాలే విగ్రహం సైతం మరో ప్రఖ్యాత ప్రదేశంగా విలసిల్లుతుంటుంది. కనీసం బోర్డు కూడా ఉండని ఒక చిన్న రెస్టారెంట్ అయిన 'ది బోర్డ్‌లెస్' సైతం మరో ముఖ్యమైన ప్రదేశంగా ఉంటుంది. మాల్గుడిలోని తాజా సంఘటలని చర్చించుకునేందుకు బోర్డ్‌లెస్ ఒక కేంద్రం.

భావగ్రహణం[మార్చు]

మాల్గుడిని ఏవిధంగా భావగ్రహణం చేశారనే విషయం గురించి వర్ణించే సందర్భంలో నారాయణ్ కింది విధంగా చెప్పారు:

"మాల్గుడి అనేది నా కోసం నేను ఆవిష్కరించిన ఒక భూ ప్రదేశం, ఎందుకంటే, ఆవిధమైన యదార్థాలు మరియు పరిస్థితుల గురించి నాకెప్పుడూ తెలియదు, మాల్గుడి లేదా ఇతర ఏదేని యధార్థ ప్రదేశం గురించి రాసేటప్పుడు అలాంటి ఒక ప్రదేశం తప్పకుండా అవసరం. నేను మొదట చిత్రించింది కేవలం రైల్వే స్టేషను‌నే తప్ప పట్టణాన్ని కాదు, సదరు రైల్వే స్టేషను అనేది మర్రిచెట్టుతో పాటుగా ఉండే ఒక చిన్నపాటి ప్లాట్‌ఫాంని కలిగి ఉంటుంది, దానికి ఒక స్టేషను మాస్టర్‌తో పాటు ఒకటి వచ్చే మరియు ఒకటి వెళ్లేటటువంటి రెండు రైళ్లు మాత్రమే అక్కడ కనిపిస్తాయి. విజయదశమి రోజున కూర్చుని నేను నా పట్టణం గురించి మొదటి వాక్యం రాశాను: మాల్గుడి స్టేషను‌లోని కొద్దిసేపటి క్రితమే రైలు వచ్చింది."

చాలామంది విమర్శకులు నారాయణ్ సృష్టించిన మాల్గుడిని థామస్ హార్డే సృష్టించిన వెస్సెక్స్ లేదా విలియం ఫాల్క్‌నర్ సృష్టించిన యోక్‌నపటవ్‌ఫాలతో పోల్చారు. అయితే, నారాయణ్ సృష్టించిన ప్రదేశం మాత్రం ఆయన సొంత పరిజ్ఞానం, ఆయన బాల్యం, ఆయన కలిసిమెలిసి పెరిగిన వాతావరణం నుంచి ఊపిరిపోసుకుంది. ఆ కల్పిత ప్రదేశంలో ఉండే ప్రజలంతా ప్రతిరోజూ ఆయన కలుసుకునే ప్రజలకు ప్రతిరూపాల వంటివారే. ఆవిధంగా ఆయన ప్రతి భారతీయుడు తనను తాను పోల్చుకునే ప్రదేశాన్ని ఆయన సృష్టించారు. గ్రాహం గ్రీన్ మాటల్లో సదరు ప్రదేశం గురించి చెప్పాలంటే (ది ఫైనాన్షియల్ ఎక్స్‌ఫెర్ట్‌కు రాసిన పరిచయ వాక్యాల నుంచి), "ప్రేమతో నిండిన మరియు అందమైనటువంటి వీధుల్లోకి మీరు అడుగుపెట్టడంతో పాటు ఆనందం యొక్క ఉద్వేగాన్ని మరియు ఒక అనిశ్చితిని మీరు అక్కడ దర్శిస్తారు, బ్యాంక్, సినిమా, జట్టు కత్తరించే సెలూన్‌లను దాటివెళ్లే ఒక అపరిచితుడు మీకు అక్కడ కనిపిస్తాడు, అకస్మాత్తుగా ఒక అపరిచితుడు మిమ్మల్ని పలకరిస్తాడు, ఆవిధంగా కొంతమేర ఊహించని దాని గురించి మనం తెలుసుకోవడంతో పాటు అక్కడ కనిపించే పదసమూహం మరో మానవ నివాసం వైపుగా ద్వారాలు తెరుస్తాయి."

సమకాలీన సంస్కృతిలో[మార్చు]

మాల్గుడి భావన అనేది ప్రసిద్ధ ఊహాకల్పనలో భాగంగా "దక్షిణ భారతదేశంలో కొలువుండే ఒక ఆహ్లాదకరమైన ప్రదేశంగా ఉంటోంది". కొన్ని రెస్టారెంట్లు దక్షిణ భారత వంటకాలను "మాల్గుడి" పేరుతో లేదా విస్తరణల రూపంలో అందిస్తుంటాయి. ఇక శ్యామ్ గ్రూప్ సంస్థ చెన్నై, బెంగుళూరు మరియు హైదరాబాద్‌లలో మాల్గుడి రెస్టారెంట్లను నిర్వహిస్తోంది [1], [2]. అలాగే "మాల్గుడి జంక్షన్" అనే పేరు కలిగిన రెస్టారెంట్ ఒకటి కోల్‌కతాలో ఉంది [3].

సూచనలు[మార్చు]

బాహ్య లింకులు[మార్చు]

వీటిని కూడా చూడండి[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మాల్గుడి&oldid=2826153" నుండి వెలికితీశారు