Jump to content

మాల రాజ్య లక్ష్మీ షా

వికీపీడియా నుండి
మాల రాజ్య లక్ష్మీ షా

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2012 అక్టోబర్ 13
ముందు విజయ్ బహుగుణ
నియోజకవర్గం తెహ్రీ గర్వాల్

వ్యక్తిగత వివరాలు

జననం (1950-08-23) 1950 ఆగస్టు 23 (వయసు: 75)
ఖాట్మండు, నేపాల్
జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి మనుజేంద్ర షా సాహిబ్ బహదూర్
సంతానం 1
నివాసం డెహ్రాడూన్
వృత్తి రాజకీయ నాయకురాలు

మాలా రాజ్య లక్ష్మీ షా (జననం 23 ఆగస్టు 1950) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె తెహ్రీ గర్వాల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

మాల రాజ్య లక్ష్మీ షా భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయలోకి వచ్చి 2012లో తెహ్రీ గర్వాల్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది. ఆమె 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి సాకేత్ బహుగుణపై 1,92,503 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.

మాల రాజ్య లక్ష్మీ షా 2019 ఎన్నికలలో తెహ్రీ గర్వాల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి ప్రీతమ్ సింగ్‌పై 3,00,586 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[2] ఆమె 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి జోత్ సింగ్ గున్సోలాపై 2,72,493 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[3][4]

మూలాలు

[మార్చు]
  1. "Tehri Garhwal Constituency Lok Sabha Election Results 2014 - 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 22 June 2025. Retrieved 22 June 2025.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  3. "2024 Loksabha Elections Results - Tehri Garhwal". Election Commission of India. 4 June 2024. Archived from the original on 22 June 2025. Retrieved 22 June 2025.
  4. The Indian Express (4 June 2024). "Lok Sabha Elections 2024 Results: Full List of winners on all 543 seats" (in ఇంగ్లీష్). Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.