Jump to content

మాసబ్ ట్యాంక్

అక్షాంశ రేఖాంశాలు: 17°24′04″N 78°27′22″E / 17.401°N 78.456°E / 17.401; 78.456
వికీపీడియా నుండి
మాసబ్ ట్యాంక్
నగరంలోని ప్రాంతం
మాసబ్ ట్యాంక్ is located in Telangana
మాసబ్ ట్యాంక్
మాసబ్ ట్యాంక్
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
Coordinates: 17°24′04″N 78°27′22″E / 17.401°N 78.456°E / 17.401; 78.456
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500 028
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంనాంపల్లి శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

మాసబ్ ట్యాంక్ (మా-సాహిబా ట్యాంక్), తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం.[1] మా-సాహిబా అనేది కుతుబ్ షాహి VI భార్య హయాత్ బక్షీ బేగంకు ఇవ్వబడిన బిరుదు. 'తలాబ్' (ట్యాంక్‌)ను కుతుబ్ షా V తల్లి ఖానుమ్ ఆఘా నిర్మించింది. కాని, అతని భార్య తర్వాత ఈ ప్రాంతం 'తలాబ్-ఎ-మా-సాహిబా' గా పేరొందింది. 'మా సాహిబా తలాబ్' తరువాతికాంలో మాసబ్ ట్యాంక్‌గా ప్రాచూర్యం పొందింది.[2]

సమీప ప్రాంతాలు

[మార్చు]

బంజారా హిల్స్ రోడ్ నెం 1, హుమాయున్ నగర్, లక్డికాపూల్ ప్రాంతాలు కలిసే రహదారిలో ఈ మాసబ్ ట్యాంక్‌ ఉంది. ఇక్కడికి సమీపంలో అమృతా ఎస్టేట్, అంబేద్కర్ నగర్, శ్రీరామ్ నగర్ కాలనీ, ఎసి గార్డ్స్, మహాత్మాగాంధీ కాలనీ, ఓవైసి పురా, పొట్టి శ్రీరాములు నగర్, శాంతినగర్ కాలనీ, వెంకటాద్రి కాలనీ, సయ్యద్ అజం కాలనీ, చాచా నెహ్రూ పార్క్ రోడ్, పోచమ్మ బస్తీ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.

వాణిజ్య ప్రాంతం

[మార్చు]

ఈ ప్రాంతంలో హైదరాబాద్ బిజినెస్ సెంటర్, జెఎన్‌టియు ఫైన్ ఆర్ట్స్ కళాశాల, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎస్బిటిఇటి),[3] ఆదాయపు పన్ను శాఖకు చెందిన 10 అంతస్తుల ఆదాయపు పన్ను భవనాలు ఉన్నాయి. మాసబ్ ట్యాంక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల రెండు రాష్ట్రాల్లోని పాలిటెక్నిక్ కళాశాలల్లో మొదటిస్థానంలో ఉంది.

రవాణా

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో మాసబ్ ట్యాంక్ మీదుగా లక్డికాపూల్, టోలీచౌకీ, సికింద్రాబాద్, మెహదీపట్నం, బాపు ఘాట్ మొదలైన ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి.[4] ఇక్కడికి సమీపంలోని లక్డికాపూల్ లో ఎంఎంటిఎస్ రైలు స్టేషను ఉంది.

ఇతర వివరాలు

[మార్చు]

ఇక్కడ చాచా నెహ్రూ పార్కు కూడా ఉంది.

మూలాలు

[మార్చు]
  1. "Masab Tank Locality". www.onefivenine.com. Retrieved 2021-02-04.
  2. India, The Hans (2015-01-15). "Hyderabad Masab Tank". www.thehansindia.com. Retrieved 2021-02-04.
  3. "Archived copy". Archived from the original on 16 August 2016. Retrieved 2021-02-04.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  4. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-02-04.