మిచెల్లీ బచెలేట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మిచెల్లీ బచెలేట్
Portrait Michelle Bachelet.jpg
చిలీ దేశాధ్యక్షురాలు
Preceded byసెబస్టైన్ పినేరా
Succeeded byసెబస్టైన్ పినేరా
Preceded byరికర్డో లాగోస్
Succeeded byసెబస్టైన్ పినేరా
యు.ఎన్ మహిళా విభాగానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
Succeeded byలక్ష్మి పూరి
వ్యక్తిగత వివరాలు
జననం
వెరోనికా మిచెల్లీ బచెలేట్ జెరియా

(1951-09-29) 1951 సెప్టెంబరు 29 (వయస్సు 70)
సాంటైగో, చిలీ
రాజకీయ పార్టీసోషలిస్ట్ పార్టీ ఆఫ్ చిలీ
ఇతర రాజకీయ
పదవులు
కాన్సన్ట్రేషన్ (1988–2013)
న్యూ మెజారిటీ (2013–present)
జీవిత భాగస్వామిజార్జ్ డేవలస్ కార్టస్ (1979–1984)
సంతానం3
తల్లిఏంజెలా జెరియా గోమెజ్
తండ్రిబ్రిగేడ్ జనరల్ ఆల్బర్టో బచెలేట్ మర్టినెజ్
కళాశాలయూనివర్శిటీ ఆఫ్ చిలీ
కార్ల్ మార్క్స్ యూనివర్శిటీ, లైప్జిగ్
ఇంటర్-అమెరికన్ డిఫెన్స్ కళాశాల
సంతకం

వెరోనికా మిచెల్లీ బచెలేట్ జెరియా (జననం 1951 సెప్టెంబరు 29) చిలీ దేశానికి చెందిన ప్రముఖ రాజకీయవేత్త. ఆమె ఆ దేశానికి 2006-2010, 2014-2018 సంవత్సరాల కాలంలో రెండుసార్లు అధ్యక్షురాలిగా కూడా ఎన్నికయ్యారు. ఆమె చిలీ దేశానికి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా పనిచేసి, చరిత్ర సృష్టించారు. 2010లో దేశాధ్యక్ష పదవికాలం పూర్తయిన తరువాత అప్పుడే కొత్తగా స్థాపించబడిన యు.ఎన్ మహిళా విభాగానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేశారు. ఈ విభాగం స్త్రీ, పురుషుల మధ్య అసమానతలు, మహిళా సాధికారతల సాధించడం కోసం ఏర్పాటు చేయబడింది. 2013 డిసెంబరులో, ఆమె చిలీ దేశాధ్యక్షురాలిగా రెండోసారి గెలిచారు. మొదటిసారి 2006లో 53.5% ఓట్లు సంపాదించిన ఆమె, రెండోసారి 62% ఓట్లు గెలుచుకోవడం విశేషం. చిలీలో 1932 తరువాత రెండోసారి దేశాధ్యక్ష పదవికి ఎన్నికైన రెండో వ్యక్తి మిచెల్లీనే.[1]

వృత్తిపరంగా డాక్టర్ అయిన మిచెల్లీ, ఆరోగ్య, రక్షణ శాఖల మంత్రిగా కూడా పనిచేసింది. మిచెల్లీ, ఆమె భర్త విడాకులు తీసుకున్నారు. ఆమెకు ముగ్గురు పిల్లలు. తనను తాను నాస్తికురాలిగా ప్రకటించుకుంది మిచెల్లీ.[2] ఆమె మాతృభాష అయిన స్పానిష్ మాత్రమే కాక, ఆంగ్లం, జర్మన్, పోర్చుగీసు, ఫ్రెంచి, ఇటాలియన్ భాషలు కూడా అనర్గళంగా మాట్లాడగలదు.[3][4] ఆమె సోషలిస్ట్ పార్టీ ఆఫ్ చిలీలో సభ్యురాలు.

తొలినాళ్ళ జీవితం, కెరీర్[మార్చు]

చిన్ననాటి విశేషాలు[మార్చు]

మిచెల్లీ చిలీలోని సాంటైగోకు చెందిన లా కిస్టెర్నా అనే ప్రదేశంలో జన్మించింది.[5] ప్రముఖ ప్రెంచి నటి మిచెల్లీ మార్గన్ పేరును ఈమెకు పెట్టారు ఆమె తల్లిదండ్రులు.[6] మిచెల్లీ చిన్నతనం అంతా కుటుంబంతో కలసి ఒక మిలటరీ బేస్ నుంచీ మరో బేస్ కు మకాంలు మార్చడంతోనే సరిపోయింది. అలా ఆమె చిలీలోని ఎన్నో ప్రదేశాల్లో పెరిగింది. ఆమె ప్రాథమిక విద్య అంతా క్వింటెరో, సెర్రో మొరెనో, ఏంటోఫగస్తా, సాన్ బెర్నార్డో తదితర ప్రదేశాల్లో గడిచింది. 1962లో, మిచెల్లీ తండ్రికి వాషింగ్టన్లోని చిలీ ఎంబసీలో సైనిక మిషన్ లో పనిచేయవలసి రావడంతో, వారి కుటుంబం అమెరికాకు మకాం వెళ్ళింది. ఆమె కుటుంబం బెతెస్డా, మేరీల్యాండ్ లలో దాదాపు రెండేళ్ళు ఉన్నారు. అక్కడ ఆమె వెస్ట్ ల్యాండ్ జూనియర్ ఉన్నత పాఠశాలలో చదువుకుంది. ఆ సమయంలోనే, మిచెల్లీ ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడటం నేర్చుకుంది.[7]

1964లో మిచెల్లీ కుటుంబం తిరిగి చిలీ చేరుకున్నారు. 1969లో, లికెయో జవైరా కర్రెరా అనే ప్రఖ్యాత బాలికల పాఠశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తరగతిలో ఆమె ప్రథమస్థానంలో నిలిచింది. ఆ పాఠశాలలో ఆమె, తరగతి ప్రెసిడెంట్ గాను, ప్రార్థనా గాయక బృందంలో సభ్యురాలు గాను, వాలీబాల్ టీంలోనూ ఉండేది. మిచెల్లీ ఒక నాటకం గ్రూపు, లాస్ క్లాప్ క్లాప్ అనే బ్యాండ్ కు సహ వ్యవస్థాపకురాలు. వివిధ పాఠశాలల ఉత్సవాలలో ఈ బ్యాండ్ ద్వారా ఎన్నో ప్రదర్శనలు కూడా ఇచ్చింది. 1970లో, విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలో దాదాపుగా అత్యున్నత స్కోరు సంపాదించిన మిచెల్లీ, చిలీ విశ్వవిద్యాలయంలో వైద్య విద్యలో చేరింది. నిజానికి మిచెల్లీకి సామాజిక శాస్త్రం గానీ, ఆర్థిక శాస్త్రంలో చదవాలని ఉండేది. కానీ ఆమె తండ్రి కోరిక ప్రకారం వైద్య విద్య అభ్యసించింది.[8] బాధలో ఉన్న రోగికి నేరుగా సహాయం చేయగలగడం ద్వారా వారి నొప్పిని తగ్గించడమే కాక, తనకూ మానసిక తృప్తి కలుగుతుంది కాబట్టే తాను వైద్య వృత్తిని చేపట్టానని చెబుతుంది ఆమె. అంతేకాక, ఈ రకంగా చిలీని ఆరోగ్యవంతమైన దేశంగా తీర్చిదిద్దడంలో తనదైన కృషి కూడా ఉంటుంది అంటుంది మిచెల్లీ.[3]

మూలాలు[మార్చు]

  1. "Michelle Bachelet: primera mujer presidenta y primer presidente reelecto desde 1932". Facebook. Retrieved 11 March 2016.
  2. "Bachelet critica a la derecha por descalificarla por ser agnóstica" [Bachelet criticises the political right for discounting her because of her agnosticism] (in Spanish). El Mercurio. 30 December 2005. Archived from the original on 25 డిసెంబర్ 2014. Retrieved 25 November 2014. {{cite news}}: Check date values in: |archive-date= (help)CS1 maint: unrecognized language (link)
  3. 3.0 3.1 "Biografía Michelle Bachelet". Gobierno de Chile (in Spanish). Archived from the original on 12 మార్చి 2008. Retrieved 7 మే 2018. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (help); More than one of |accessdate= and |access-date= specified (help); More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)CS1 maint: unrecognized language (link)
  4. "Biographical Sketch: Michelle Bachelet". UN Women. Archived from the original on 28 ఏప్రిల్ 2012. Retrieved 7 మే 2018. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (help); More than one of |accessdate= and |access-date= specified (help); More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  5. Fernando Jimenez. "La vida de Bachelet, la historia de Chile en sus espaldas". 24horas.cl. Retrieved 11 March 2016.
  6. "Michelle Bachelet, présidente du Chili - ICI.Radio-Canada.ca". Radio-Canada.ca. Retrieved 11 March 2016.
  7. Rohter, Larry (16 January 2006). "Woman in the News; A Leader Making Peace With Chile's Past". The New York Times. Retrieved 16 January 2006.
  8. "Biografía de Michelle Bachelet". La Nación (in Spanish). Archived from the original on 4 ఆగస్టు 2012. Retrieved 7 మే 2018. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (help); More than one of |accessdate= and |access-date= specified (help); More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)CS1 maint: unrecognized language (link)