Coordinates: 15°10′59″N 79°16′59″E / 15.183°N 79.283°E / 15.183; 79.283

మిట్టపాలెం (చంద్రశేఖరపురం మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్రామం
పటం
Coordinates: 15°10′59″N 79°16′59″E / 15.183°N 79.283°E / 15.183; 79.283
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంచంద్రశేఖరపురం మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్523108 Edit this on Wikidata


మిట్టపాలెం, ప్రకాశం జిల్లా, చంద్రశేఖరపురం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.పటం

గ్రామ భౌగోళికం[మార్చు]

మిట్టపాలెం గ్రామం, మండల కేంద్రమైన చంద్రశేఖరపురం నకు 3 కి.మీ. దూరంలో ఉంది.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

మిట్టపాలెం నారాయణ స్వామి దేవాలయం (కోవిలంపాడు)[మార్చు]

ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. నారాయణస్వామి ఆలయం ప్రతి ఆదివారం వేలాదిమంది భక్తులతో కళకళలాడుతుంటుంది. వివిధ మతాలకు చెందిన అన్నివర్గాల ప్రజలు ఈ ఆలయానికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈ క్షేత్రం ఒక సర్వసంగ పరిత్యాగి సమాధిపైన నిర్మించినది కావటం విశేషం.

  • మిట్టపాలెంలోని కొమ్మినేని వంశానికి చెందిన నారాయణస్వామి అసలు పేరు కొండయ్య. ఈయన మిట్టపాలెంలో నివసించుచున్న కొమ్మినేని మహాలక్షమ్మ, వెంకట్రామయ్య దంపతులకు జన్మించాడు. పరధ్యానంగా ఉంటూ పిచ్చి కొండయ్యగా పేరుపొందిన ఈయన బాల్యములోనే సన్యాసులతో కలసి గ్రామం విడిచివెళ్లి కొన్నేళ్ల తర్వాత తిరిగివచ్చి నారకొండ గుహల్లో నివాసం ఏర్పరచుకొన్నాడు. మన్నేట స్నానం చేస్తూ, నారకొండలో దొరికే ముష్టిపండ్లను బొమ్మ జెముడు పాలను త్రాగుచూ జీవం సాగించుచుండెను. ఒకనాడు ఒక మహనీయుడు ఆయనను దగ్గరకు చేరదీసి మంత్రోదేశము గావించి ఇక ముందు "నారాయణ స్వామి"గా విలసిల్లి గలవని దీవించి అంతర్ధానమయ్యెను. అప్పటి నుండి ఆయన నారాయణ స్వామిగా ప్రసిద్ధిగాంచాడు. రైతులకు ఆర్థిక సహాయం చేయని రాజులకు పన్ను వసూలు చేసే హక్కు లేదని, ప్రభువులకు కప్పం చెల్లించవద్దని ఆయన ప్రచారం చేశాడు. ప్రభువులను ఎదిరించగా ఆయనను నిర్భంధించారు. అయితే ఆయన నిర్భంధం నుంచి తప్పుకొని ప్రభువు వద్దకు వెళ్ళాడు. మానవాతీత శక్తులున్నందువల్లనే నారాయణ స్వామి నిర్భంధం నుంచి బయటపడ్డాడని భావించిన రాజు ఆయనను గౌరవించాడు. ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని పాలించాలని రాజుకు హితబోధ చేశాడు.సమాధిరూపంలో నుండి భక్తులను అనుగ్రహించాలని మహా శివరాత్రి ఆదివారం సజీవ సమాధి అయ్యారు అప్పటినుండి భక్తులను సమాధిలోనుంచే అనుగ్రహిస్తున్నారు
  • సమతా, మమతా పెంపొందించుకొని సామరస్యంగా జీవించాలని ప్రచారం చేసిన మానవతావాది ఆయన. మానసిక రుగ్మతలను, దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తూ రోగులకు స్వస్థత చేకూర్చిన సేవా నిరతుడు ఆయన సంతానము, ఐశ్వర్యము, సురూపము, ఆయురారోగ్యాలములు కోరివచ్చినను, వ్యాధిగ్రస్థులు, గ్రహపీడితులు, ఇతర కష్టములలో నున్న వారెవరైనా ఆదివారమున జపించుకొని, ఆరాత్రికి దేవాలయ ప్రాంగణంలో నిద్ర జేసినను వారి బాధలు నివారింపబడునని భక్తుల నమ్మకం. ఈ నమ్మకముతో ప్రతి ఆదివారము వేలాది మంది భక్తులు నారాయణ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.మహాశివరాత్రి మహోత్సవాలు భారీస్థాయిలో జరుగుతాయి. వారం రోజులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు నారాయణ స్వామిని దర్శించుకుంటారు.
  • శ్రీ నారాయణస్వామివారికి ప్రతి సంవత్సరం సప్తాహ్నిక దీక్షతో మహాశివరాత్రి మహోత్సవములు జరుగుతాయి. వారం రోజుల పాటు శ్రీ స్వామి వారికి ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహిస్తారు రోజూ సాయంత్రం వివిధ వాహనాల్లో శ్రీ స్వామివారికి కోవిలంపాడు-మిట్టపాలెం గ్రామాలలో ఉత్సవం జరుగుతుంది

స్వామివారి ఆరాధనోత్సవాలు[మార్చు]

ఈ ఆలయంలో స్వామివారి ఆరాధనోత్సవాలు ప్రతి సంవత్సరం, ఆషాఢ మాసంలో బహుళ సప్తమినాడు వైభవంగా నిర్వహిస్తారు ఈ ఉత్సవాలకు భక్తులు అధికసంఖ్యలో విచ్చేస్తారు. ఈ సందర్భంగా మూలవిరాట్టు విశేషాలంకారణతో దర్శనమిస్తారు. ఆరోజు ఆలయంలో పంచామృతాభిషేకం, శాంతిహోమం నిర్వహించడం జరుగుతుందిఆలయంలో ప్రతి ఆదివారం ఉదయం శ్రీ స్వామివారికి పంచామృత అభిషేకం మధ్యాహ్నం మహానివేదన, సాయంత్రం శ్రీ నారాయణస్వామివారికి పల్లకీసేవ రథోత్సవం, పంచ,రథ, కుంభహారతులు భక్తిప్రపత్తులతో నిర్వహిస్తారు.మహిళలు పెద్ద ఎత్తున పొంగళ్ళు సమర్పిస్తారు.ఆలయంలో ప్రతి నిత్యం వేదపారాయణ జరుగుతుందివేదపండితుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.ఈ ఆలయంలో ప్రతి ఆదివారం భక్తుల సహకారంతో అన్నదాన పథకం అమలుచేస్తున్నారు.

కె.పి.వి.ప్రసాద్, పాలక మండలి "'ఛైర్మన్"' గా పాములపాటి మాధవప్రసాద్ సేవలను అందిస్తున్నారు.

ఈ ఆలయంలో వేదపండితులుగా శ్రీ "'వంగల వెంకట సీతారామాంజనేయ అవధాని"' సేవ చేస్తున్నారు వారికి నవ్యాంధ్ర రాజధాని అయిన గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలోని అనంతవరం గ్రామంలో, 2015,మార్చి-21వ తేదీ శనివారం నాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ఉగాది వేడుకల సందర్భంగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతులమీదుగా ఉగాది పురస్కారం అందజేసి సత్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా, వేదం అభివృద్ధికి కృషిచేసిన ప్రముఖులకు ఈ పురస్కారాన్ని అందజేశారు.

నారకొండ నారాయణస్వామి ఆలయం[మార్చు]

చంద్రశేఖరపురం మండలంలోని ఆర్.కే.పల్లి గ్రామ సమీపంలో ఈ ఆలయం ఉంది.

ఈ కొండ శ్రీ నారాయణస్వామివారు తపస్సు చేసుకున్న పవిత్ర పుణ్య ప్రదేశం ఇక్కడ కూడా ఆలయం నిర్మించారు

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]