మిత్రనికేతన్ కె. విశ్వనాథన్
| Mitraniketan K. Viswanathan | |
|---|---|
| జననం | 1928 ఫిబ్రవరి 8 Vellanad, Thiruvananthapuram, Kerala, India |
| మరణం | 2014 ఏప్రిల్ 28 (వయసు: 86) Thiruvananthapuram |
| వృత్తి | Social reformer, Philanthropist, Environmentalist |
| భార్య / భర్త | Sethulaxmi |
| పిల్లలు | Asha, Chithra, Beena |
| తల్లిదండ్రులు | R. Krishna Panickar G. Karthyayani |
| పురస్కారాలు | Padma Shri K. P. Goenka Award for Environment Platinum Jubilee Endowment Trust Award Jamnalal Bajaj Award Rabindra Puraskar Henry Dunant Red Cross Award |
మిత్రనికేతన్ కె. విశ్వనాథన్ (8 ఫిబ్రవరి 1928 - 28 ఏప్రిల్ 2014) భారతదేశంలోని కేరళకు చెందిన ఒక భారతీయ సామాజిక సంస్కర్త, పరోపకారి, పర్యావరణవేత్త. ఇతడు 1956లో తిరువనంతపురంలోని వెల్లనాడులో మిత్రనికేతన్ అనే ప్రభుత్వేతర సంస్థను స్థాపించాడు.
జీవిత విశేషాలు
[మార్చు]విశ్వనాథన్ 1928 ఫిబ్రవరి 8న కేరళలోని తిరువనంతపురం జిల్లా వెల్లనాడులో జన్మించాడు. ఇతడు తిరువనంతపురంలో పాఠశాల విద్యను పూర్తి చేసి, రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన విశ్వభారతి విశ్వవిద్యాలయంలో చేరి, 1953లో శిక్షా భావన డిగ్రీని పూర్తి చేశాడు. తరువాత అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్, స్కాండినేవియాలలో తన చదువును కొనసాగించాడు. ఇతడు అమెరికాలో ఉన్న సమయంలోనే ఇతనికి ఆర్థర్ ఇ. మోర్గాన్‌తో పరిచయం ఏర్పడింది. అతని ప్రభావం విశ్వనాథన్ తరువాతి జీవితాన్ని రూపొందించడంలో గణనీయమైన పాత్ర పోషించింది.[1]
భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, ఇతడు 1955లో మిత్రనికేతన్, ది హోమ్ ఆఫ్ ఫ్రెండ్స్ అనే సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ సమాజ అభివృద్ధి, పర్యావరణం, సైన్స్, విద్య, సాంకేతికత రంగాలలో ఆవిష్కరణ, శిక్షణ , అభివృద్ధులపై దృష్టి పెట్టింది.[2] కాలక్రమేణా, ఈ సంస్థ 60 ఎకరాల స్థలాన్ని కలిగి, అందులో మిత్రనికేతన్ పీపుల్స్ కాలేజ్,[3] మహిళల శిక్షణ కోసం కృషి విజ్ఞాన కేంద్రం (KVK), కేంద్రం, అన్ని హంగులతో కూడిన బేకరీ, కుమ్మరి కేంద్రం, సాంకేతిక బదిలీ కార్యక్రమం వంటివి ఏర్పాటు చేసింది.[4]
ఇతడు ప్రభుత్వేతర సంస్థల నెట్‌వర్క్ అయిన కేరళ వాలంటరీ యాక్షన్ లీగ్ (KAVAL) కు ప్యాట్రన్‌గా వ్యవహరించాడు.[5] అంతే కాకుండా ఇతడు అనేక సంస్థలకు అధ్యక్షునిగా ఉంటూ భారతదేశంలోనూ, విదేశాలలోనూ అనేక సమావేశాలకు హాజరయ్యాడు.[1] ప్రభుత్వం ఏర్పరచిన అనేక సంఘాలలో సభ్యుడిగా ఉన్నాడు.
గాంధీజీ మాదిరి విశ్వనాథన్ నిరాడంబరతతో, పేదల పట్ల నిబద్ధతతో చాలా మందికి స్ఫూర్తినిచ్చాడు. 1990-91లో డేనియేల్ గియోవన్నూచి, ప్రొఫెసర్ విల్ అలెగ్జాండర్‌తో కలిసి మిత్రనికేతన్‌లో పనిచేశారు. వారు నిరుపేదతనం, అద్భుతమైన మానవాభివృద్ధి స్థాయిల మధ్య ఉన్న తారతమ్యాన్ని అధ్యయనం చేశారు. ఈ అనుభవం గియోవన్నూచి, అలెగ్జాండర్, అక్కడ వారు కలుసుకున్న ఇతర పరిశోధకులకు సార్వత్రిక విద్య, అక్షరాస్యతల ప్రాముఖ్యతను, మాతృస్వామ్య సమాజంలోని సాపేక్ష లింగ సమానత్వాన్ని, సరళమైన, ప్రభావవంతమైన సాంకేతిక పరిజ్ఞానాల సహకార వినియోగాన్ని నొక్కి చెప్పింది. గియోవన్నూచి తరువాత కమిటీ ఆన్ సస్టైనబిలిటీ అసెస్‌మెంట్ (COSA)ను స్థాపించాడు.[6]
పురస్కారాలు
[మార్చు]- భారత ప్రభుత్వం చే పద్మశ్రీ పురస్కారం - 2009
- సేవనరత్నం అవార్డ్ – 2002
- ఉత్తమ కృషి విజ్ఞాన కేంద్రం అవార్డ్ - 1998-99
- ఆర్చ్ బిషప్ మార్ గ్రెగొరియస్ మెమోరియల్ అవార్డ్ - 1997
- ఎం.కె.కె.నాయర్ అవార్డ్ ఫర్ ఎక్సెలెన్స్ ఇన్ సోషియల్ వర్క్ - 1997
- చెల్లయ్యన్ నాడార్ అవార్డ్ ఫర్ ఎక్సెలెన్స్ ఇన్ సోషియల్ వర్క్ - 1996
- త్రివేండ్రం సోషియల్ సర్వీస్ సొసైటీ (TRASS) అవార్డ్ ఫర్ ఎక్సెలెన్స్ ఇన్ సోషియల్ వర్క్ - 1994
- జమ్నాలాల్ బజాజ్ అవార్డు - 1992
- శాస్త్ర వినియోగం ద్వారా గ్రామీణాభివృద్ధికి విశ్వభారతి విశ్వవిద్యాలయం వారిచే రతీంద్ర పురస్కారం- 1991
- కె.పి.గోయెంకా అవార్డ్ - 1987
- ఇండియన్ మర్చెంట్స్ ఛాంబర్ వారి ప్లాటినం జూబిలీ ఎండోమెంట్ ట్రస్ట్ అవార్డ్ - 1986
- సహోదరన్ సేవారత్న పురస్కార్
- హెన్రీ డ్యూనాంట్ రెడ్ క్రాస్ అవార్డ్
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Blog Archive » BIODATA of K. Viswanathan". Santhigram. Archived from the original on 2 May 2014. Retrieved 2014-05-01.
- ↑ "Mitraniketan Viswanathan Passes Away". The New Indian Express. Archived from the original on 11 January 2015. Retrieved 2014-05-01.
- ↑ "Mitraniketan Peoples College | NGOPost". Archived from the original on 29 May 2014. Retrieved 2014-05-29.
- ↑ "'Mitraniketan' Vishwanathan dead". The Hindu. 2014-04-27. Retrieved 2014-05-01.
- ↑ "Blog Archive » Mitraniketan Viswanathan Passed away". Santhigram. Archived from the original on 2014-05-02. Retrieved 2014-05-01.
- ↑ "The Enigma of Kerala".