మిథాలి రాజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మిథాలి రాజ్
Mithali Raj.png
వ్యక్తిగత సమాచారం
బ్యాటింగ్ శైలి కుడిచేతి వాతం
బౌలింగ్ శైలి లెగ్ బ్రేక్
కెరీర్ గణాంకాలు
TestsODIs
మ్యాచ్‌లు 12 232
పరుగులు 690 7805
బ్యాటింగ్ సగటు 43.68 50.68
100లు/50లు 1/4 7/64
అత్యుత్తమ స్కోరు 214 125*
ఓవర్లు 12 28.3
వికెట్లు 0 8
బౌలింగ్ సగటు 0 11.37
ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 0 0
ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు 0 n/a
అత్యుత్తమ బౌలింగ్ 0 3/12
క్యాచ్ లు/స్టంపింగులు 12/- 23/-

As of జూలై 1, 2022
Source: [1]

మిథాలి రాజ్ మాజీ భారత మహిళా క్రికెట్ క్రీడాకారిణి. 1999లో తొలిసారిగా అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో ప్రవేశించి ఐర్లాండ్ పై 114 పరుగులు సాధించి నాటౌట్ గా నిల్చింది. 2001-02 లో మొదటి టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండుపై లక్నోలో ఆడింది. ఇంగ్లాండ్ పై టాంటన్‌లో జరిగిన టెస్టు మ్యాచ్ లో 264 పరుగులు సాధించి మహిళా క్రికెట్ లో ప్రపంచ రికార్డు సృష్టించింది. 2005 మహిళా ప్రపంచ కప్ ఫైనల్స్ లో ఆమె భారత జట్టుకు నేతృత్వం వహించింది. స్వతహాగా బ్యాటర్ అయిన మిథాలి అప్పుడప్పుడు బౌలింగ్ కూడా వేసేది. 2003లో ఆమెకు అర్జున అవార్డు లభించింది.[1]

ఆమె చిన్నప్పుడు భారత సాంప్రదాయ నృత్యం అయిన భరత నాట్యంలో శిక్షణ పొంది వేదికలపై నాట్యం చేసేది. ప్రస్తుతం మిథాలి భారతీయ రైల్వేల్లో ఉద్యోగం చేస్తున్నది. మిథాలీ రాజ్‌ 2022లో ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో పాల్గొని అత్యధిక వన్డే ప్రపంచకప్‌లు ఆడిన తొలి మహిళా క్రీడాకారిణిగా రికార్డును సృష్టించింది.[2] 2022 జూన్ 8న అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుండి మిథాలి రాజ్ రిటైర్మెంట్ ప్రకటించింది.[3][4]

జీవిత విశేషాలు[మార్చు]

మిథాలీ రాజ్ 1982 డిసెంబరు 3 న రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఒక తమిళ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి దొరై రాజ్, భారత వైమానిక దళంలో ఎయిర్‌మెన్ (వారెంట్ ఆఫీసర్), తల్లి లీలా రాజ్. మిథాలీ 10 సంవత్సరాల వయస్సులో క్రికెట్ ఆడటం ప్రారంభించింది. ఆమె హైదరాబాద్‌లోని కీస్ హైస్కూల్ ఫర్ గర్ల్స్ చదివింది. సికింద్రాబాద్‌లోని కస్తూర్బా గాంధీ మహిళా జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివింది. చదువుకునే రోజుల్లో అన్నయ్యతో కలిసి క్రికెట్ కోచింగ్ తీసుకోడం ప్రారంభించింది.[5][6]

క్రీడా జీవితం[మార్చు]

మిథాలి 1999లో తన పదహారేళ్ల ప్రాయంలో ఐర్లండ్‌తో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి మొత్తం 12 టెస్టులు, 232 వన్డేలు, 89 టీ-20లు ఆడింది. ఆమె 12 టెస్టుల్లో 699 పరుగులు, 232 వన్డేల్లో 7805 పరుగులు, 89 టీ-20ల్లో 2364 పరుగులు చేసింది. మిథాలీ వన్డేల్లో ఇన్ని పరుగుల మైలురాయిని అధిగమించిన ఏకైక మహిళా క్రికెటర్‌. వన్డేలలో ఆమె అత్యధిక స్కోరు 114 నాటౌట్, టెస్టుల్లో అత్యధిక స్కోరు 214 పరుగులు, టీ-20ల్లో 97 నాటౌట్.[7]

రికార్డులు[మార్చు]

పద్మశ్రీ పురస్కారం అందుకుంటున్న మిథాలి రాజ్
 • వన్డేల్లో అత్యధిక పరుగులు (7805) సాధించిన మహిళా క్రికెటర్‌గా రికార్డు[8]
 • వన్డే క్రికెట్‌లో అత్యధిక అర్ధ శతకాలు సాధించిన మహిళా క్రికెటర్‌
 • మహిళా వరల్డ్‌కప్‌ ఈవెంట్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌ జాబితాలో రెండో స్థానం (1321 పరుగులు)
 • వన్డేల్లో అత్యధిక సెంచరీలు (7) సాధించిన భారత మహిళా క్రికెటర్‌
 • టీ20 ఫార్మాట్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో మిథాలీ సాధించిన పరుగులు 2364. టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన భారత మహిళా క్రికెటర్‌ (రిటైర్మెంట్ నాటికీ)
 • మహిళా క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి ఆమె చేసిన పరుగులు 10868. ఆమె (రిటైర్మెంట్ నాటికీ) 10 వేల కంటే ఎక్కువ పరుగులు సాధించిన బ్యాటర్‌.
 • మహిళా ప్రపంచకప్‌ ఈవెంట్‌లో ఏకంగా ఆరుసార్లు (2000, 2005, 2009, 2013, 2017, 2022) పాల్గొన్న క్రికెటర్‌గా గుర్తింపు.
 • మహిళా టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 214 పరుగులు చేసి అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా గుర్తింపు.
 • మహిళా వన్డే క్రికెట్‌లో అతి పిన్న (16 ఏళ్ల 205 రోజులు) వయసులో సెంచరీ సాధించిన బ్యాటర్‌
 • మహిళా క్రికెట్‌లో సుదీర్ఘ కాలం (22 ఏళ్ల 274 రోజుల) పాటు కొనసాగిన క్రికెటర్‌గా రికార్డు.
 • మహిళా ప్రపంచకప్‌ టోర్నీలో అత్యధిక సార్లు (12) హాఫ్‌ సెంచరీ ప్లస్‌ స్కోరు చేసిన క్రికెటర్‌గా (న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ డెబీ హాక్లేతో కలిసి సంయుక్తంగా మొదటి స్థానం).
 • మహిళా ప్రపంచకప్‌ టోర్నీలో కెప్టెన్‌గానూ యాభై కంటే ఎక్కువ పరుగులు ఎనిమిది సార్లు చేసింది.
 • వన్డే ప్రపంచకప్‌ టోర్నీలో అత్యధిక మ్యాచ్‌లకు సారథ్యం వహించిన మహిళా కెప్టెన్‌గా రికార్డు.
 • మహిళల క్రికెట్‌లోనే కాకుండా పురుషుల క్రికెట్‌లోనూ ఎవ్వరికీ సాధ్యం కాని అత్యంత అరుదైన రికార్డు మిథాలీ సొంతం. అదేమిటంటే.. ​​​తన కంటే 21 ఏళ్ల చిన్నదైన, తన అంతర్జాతీయ అరంగ్రేటం తర్వాత నాలుగేళ్లకు పుట్టిన రిచా ఘోష్‌తో కలిసి మిథాలీ వరల్డ్‌కప్‌-2022లో సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పింది.

అవార్డులు[మార్చు]

తొమ్మిదేళ్ల వయసులో ఆటలో అడుగుపెట్టిన ఆమె ప్రపంచ మహిళల క్రికెట్లో తన సత్తా చాటారు. తన 23 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో ఘనతలు, మరెన్నో రికార్డులు ఆమె సొంతం చేసుకున్నారు. భారత క్రీడారంగంలో అత్యున్నతమైన అర్జున అవార్డు 2003లొ మిథాలి రాజ్ కు ప్రధానం చేయబడింది. మిథాలీ రాజ్ 13 నవంబర్ 2021న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతులమీదుగా ‘మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న’ అవార్డును అందుకుంది.[9]

మూలాలు[మార్చు]

 1. Eenadu (8 June 2022). "అందుకే డాక్టర్‌తో పెళ్లి వద్దంది". Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.
 2. TV9 Telugu (6 March 2022). "ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన మిథాలీ రాజ్.. ఆ రికార్డులో సచిన్‌తో సమానం." Archived from the original on 6 March 2022. Retrieved 6 March 2022.
 3. Andhra Jyothy (8 June 2022). "క్రికెట్‌కు మిథాలీరాజ్ గుడ్‌బై" (in ఇంగ్లీష్). Retrieved 8 June 2022.
 4. NTV (8 June 2022). "అంతర్జాతీయ క్రికెట్‌కు మిథాలీరాజ్ గుడ్‌బై". Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.
 5. "Mithali Raj at India Speakers Bureau". India Speakers Bureau.
 6. "मैंने वास्तव में भविष्य के बारे में नहीं सोचा है : मिताली राज". Niharika Times.
 7. Sakshi (9 June 2022). "అందని ద్రాక్ష.. అవమానం భరించి.. ఫేర్‌వెల్‌ మ్యాచ్‌?!". Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.
 8. Eenadu (9 June 2022). "అతివల క్రికెట్‌ను అందలమెక్కించి". Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.
 9. Andrajyothy (14 November 2021). "'ఖేల్‌రత్న'లు నీరజ్‌, మిథాలీ". Archived from the original on 14 November 2021. Retrieved 14 November 2021.

బయటి లింకులు[మార్చు]