మిథు అలూర్
| డాక్టర్ మిథు అలూర్ | |
|---|---|
ఫిబ్రవరి, 2012లో గోవాలో జరిగిన ఉత్తర-దక్షిణ సంభాషణ IVలో అలూర్ | |
| జననం | షోమా బోస్ 1943 మార్చి 27 కోల్‌కతా, భారతదేశం |
| వృత్తి | విద్యావేత్త, వికలాంగుల హక్కుల కార్యకర్త, పరిశోధకురాలు, రచయిత్రి |
| క్రియాశీలక సంవత్సరాలు | 1972–ప్రస్తుతం |
| సంస్థ | ఏబుల్ డిజబుల్ ఆల్ పీపుల్ టుగెదర్ (Able, Disable, All People Together) |
| ప్రసిద్ధి | దివ్యాంగుల సేవ |
| భార్య / భర్త | సతి అలూర్ |
| పిల్లలు | మాలిని చిబ్, నిఖిల్ చిబ్ |
మిథు అలూర్ (జననం 1943 మార్చి 27), ది స్పాస్టిక్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఇప్పుడు ADAPT-Able Disable All People Together అని పేరు మార్చబడింది.) వ్యవస్థాపక చైర్పర్సన్. ఆమె విద్యావేత్త, వికలాంగుల హక్కుల కార్యకర్త, పరిశోధకురాలు, రచయిత్రి, భారతదేశంలో వికలాంగులకు సంబంధించిన సమస్యలపై కలం కదిపిన రచయిత్రి.
సెరిబ్రల్ పాల్సీ, ఆటిజం, డౌన్ సిండ్రోమ్, మేధో వైకల్యాలు వంటి న్యూరో-మస్క్యులర్, డెవలప్మెంటల్ డిసెబిలిటీస్ ఉన్న వ్యక్తుల సంరక్షణ, విద్యలో ఆమె ఒక మార్గదర్శకురాలు.[1]
ప్రారంభ జీవితం
[మార్చు]మిథు అలూర్ కోల్‌కతాలో పుట్టి పెరిగింది. ఆమె ఢిల్లీలోని మిరాండా హౌస్‌లో ఉన్నత విద్యను అభ్యసించింది. 1963లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పొందింది. 1965లో, ఆమె రంజిత్ చిబ్‌ను వివాహం చేసుకున్నది. ఒక సంవత్సరం తర్వాత మాలినీ చిబ్ జన్మించింది.
మాలినికి సెరిబ్రల్ పాల్సీ (మస్తిష్క పక్షవాతం) ఉన్నట్లు నిర్ధారణ అయింది. భారతదేశంలో దివ్యాంగుల పిల్లల కోసం సరైన పాఠశాల ఏదీ లేదని తెలుసుకుని, ఆమె 1968లో లండన్ విశ్వవిద్యాలయంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (IOE)లో ప్రత్యేక విద్యా రంగంలో ఉపాధ్యాయురాలిగా శిక్షణ పొందింది.
పురస్కారాలు
[మార్చు]- 1989: పద్మశ్రీ పురస్కారం [2]
- 2003: మార్తా ఫారెస్ట్ రోజ్ క్వార్ట్జ్ వారియర్ అవార్డు
- 2006: పాల్ హారిస్ ఫెలో అవార్డు రోటరీ ఇంటర్నేషనల్, అమెరికా.
- 2009: ఇఎమ్పిఐ-ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఇండియన్ ఇన్నోవేషన్ అవార్డు.[3][4]
- 2009: ముంబై ఇండియన్ మర్చంట్ ఛాంబర్ అత్యుత్తమ మహిళగా ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు.[5]
- 2010: ఉమెన్ ఆఫ్ ది ఇయర్-సిఎన్ఎన్ ఐబిఎన్ సూపర్ ఐడల్ అవార్డు.
మూలాలు
[మార్చు]- ↑ Spastics Society, Bandra, Mumbai - Profile Archived 4 డిసెంబరు 2008 at the Wayback Machine Tata, http://www.tatainternational.com.
- ↑ "Padma Awards Directory (1954-2017)" (PDF). Ministry of Home Affairs. Archived from the original (PDF) on 9 February 2018. Retrieved 28 January 2023.
- ↑ "Indian Innovation Awards". empi.in. Archived from the original on 2022-10-16. Retrieved 2026-05-08.
- ↑ empibschool (31 October 2011). "EMPI IE 2009 Panel Discussion Innovation Journeys". YouTube. Retrieved 28 January 2023.
- ↑ "Indian Volunteer Awards". Retrieved 2026-05-08.
{{cite web}}: CS1 maint: deprecated archival service (link)