మినిష్టర్ రోడ్డు (హైదరాబాదు)

వికీపీడియా నుండి
(మినిష్టర్ రోడ్, హైదరాబాద్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మినిష్టర్ రోడ్డు
సమీపప్రాంతం
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500 003
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

మినిష్టర్ రోడ్డు, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక శివారు ప్రాంతం.[1] ఈ ప్రాంతం హుసేన్ సాగర్ చెరువుకు చాలా దగ్గరగా ఉంది.

సమీప ప్రాంతాలు

[మార్చు]

ఇక్కడికి సమీపంలో రామ్‌గోపాల్‌పేట్, ప్రేందర్‌ఘాస్ట్ రోడ్, జవహర్ నగర్ కాలనీ, కృష్ణ నగర్ కాలనీ, జోగాని మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.

వాణిజ్య ప్రాంతం

[మార్చు]

సికింద్రాబాదులో ఆటోమొబైల్ విడిభాగాలు, అనుబంధ వస్తువులు లభించే మార్కెట్లో ఇదీ ఒకటి. ఈ ప్రాంతంలో అనేక చిన్నచిన్న దుకాణాలు ఉన్నాయి.

ప్రార్థనా స్థలాలు

[మార్చు]

ఇక్కడికి సమీపంలో కనకదుర్గ దేవాలయం, హనుమాన్ దేవాలయం, సాయిబాబా దేవాలయం, శ్రీ స్వామినారాయణ మందిరం, షియా ఇమామి ఇస్మాయిలీ జమత్ఖానా, మసీదు ఇ నజీరియా మొదలైన ప్రార్థనా స్థలాలు ఉన్నాయి.

రవాణా

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో మినిష్టర్ రోడ్డు మీదుగా సికింద్రాబాద్, మెహదీపట్నం, బాపు ఘాట్, టోలీచౌకీ మొదలైన ప్రాంతాలకు సిటీ బస్సు సర్వీసులు నడుపబడుతున్నాయి.[2] ఇక్కడికి సమీపంలోని జేమ్స్ స్ట్రీట్ లో ఎంఎంటిఎస్ రైలు స్టేషను ఉంది.

మూలాలు

[మార్చు]
  1. "Minister Road Locality". www.onefivenine.com. Retrieved 2021-02-04.
  2. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-02-04.{{cite web}}: CS1 maint: url-status (link)