మిమీ రైన్‌హాట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మిమీ రైన్‌హాట్
జననం
కార్మెన్ కొప్పెల్

(1915-01-15)1915 జనవరి 15
మరణం2022 ఏప్రిల్ 8(2022-04-08) (వయసు 107)
విద్యాసంస్థవియెనా విశ్వవిద్యాలయం
వృత్తికార్యదర్శి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
Author of Schindler's list
పిల్లలు2
మిమీ రైన్‌హాట్ వ్రాసిన జాబితా. ఆమె క్రమసంఖ్య 279. కార్మెన్ వైట్‌మన్ అనే పేరుతో నమోదు చేసుకుంది.

మిమీ రైన్‌హాట్ (అసలు పేరు: కార్మెన్ కొప్పెల్; మొదటి పెళ్ళి తరువాత: కార్మెన్ వైట్‌మన్ (సుమారు 1936 – 1950 వరకు;), జీవితకాలం: 15 జనవరి 1915 – 8 ఏప్రిల్ 2022) ఒక ఆస్ట్రియ యూదు స్త్రీ. ఆమె ఆస్కర్ షిండ్లర్‌కు కార్యదర్శిగా పని చేసింది. అతని పరిశ్రమలో చేర్చుకోవలసిన యూదు కార్మికుల జాబితాను ఈమె తయారు చేసింది (ముద్రాలిఖించింది). [1] [2]

షిండ్లర్ దగ్గర చేరక మునుపు[మార్చు]

కార్మెన్ కొప్పెల్ ఆస్ట్రియా-హంగరీలోని వీనర్ నోయ్స్టాడ్ట్‌లో ఎమిల్, ఫ్రీడా కొప్పెల్‌ దంపతులకు పుట్టింది. [3] ఆమె వియెనా విశ్వవిద్యాలయంలో తన భాషా అధ్యయనము చదువుతున్న రోజుల్లో నోట్స్ వ్రాసుకునేందుకు సంక్షిప్త లిపిని నేర్చుకుంది. వియెనాలో ఆమె తన కాబోయే భర్తను కలుసుకుంది. 1936లో పెళ్ళయ్యాక అతనితో పోలాండ్‌లోని క్రకౌలో ఉండేది. అక్కడ వాళ్ళకు జూన్ 1939లో ఒక కొడుకు పుట్టగా, తనకు సాస్చా వైట్‌మన్, అని పేరు పెట్టుకున్నారు.[4]

ఆస్కర్ షిండ్లర్[మార్చు]

నాౙీలు పోలండ్‌ను ఆక్రమించుకున్నప్పుడు వైట్‌మన్ దంపతులు వారి బిడ్డనూ, కార్మెన్ వాళ్ళ అవ్వనూ హంగెరీకి తీసుకువచ్చారు. తరువాత దంపతులిద్దరినీ నాౙీలు పట్టుకోగా, ఆమె భర్త తప్పించుకుని పారిపోబోయాడు. పారిపోతున్న అతన్ని నాౙీలు క్రకౌ గెట్టో వద్ద కాల్చి చంపారు. అప్పటికి కార్మెన్ వయసు 30 ఏళ్ళు. గెట్టోని మూసేసాక, ఆమెను ఇతర యూదులతో పాటు ప్లాస్ౙోకు తరలించారు. సంక్షిప్త లిపి తెలిసినందున ఆమె చేత శిబిర నిర్వహణకు కావలసిన కొన్ని పనులు చేయించేవారు. అప్పుడే ఆమెకు ఆస్కర్ షిండ్లర్‌తో పరిచయము ఏర్పడింది. షిండ్లర్ తన కింద ఉన్న యూదులను మంచిగా చూసుకోవడము గమనించి, ఈమె అతని కార్యదర్శిగా చేరింది. షిండ్లర్ ఎస్ఎస్ శిబిర అధికారి అమొన్ గూట్‌ను, తన కింద పనిచేయడానికి మరికొందరు యూదులు కావాలని కోరినప్పుడు, అందుకు గానూ ఆమె షిండ్లర్ పరిశ్రమ ఉన్న బ్రూన్లిట్ౙ్ ఉపశిబిరానికి బదిలీ చేయవలసిన యూదుల పేర్లతో ఒక జాబితాను తయారు చేసింది. ఇందులో క్రకౌ గెట్టోలో తనకు తెలిసిన అనేక మంది యూదుల పేర్లు చేర్చింది.[4][5]

1944లో జాబితాలో ఉన్న యూదులను ప్లాస్ౙో నుండి బ్రూన్లిట్ౙ్‌కు తీసుకువెళ్ళాల్సిన రైలు ఔష్విట్ౙ్‌కు మళ్ళించబడింది. మిమీ, ఇంకా ఇతర "షిండ్లెర్జుడెన్" (అర్థము: షిండ్లర్ యొక్క యూదులు) దాదాపు రెండు వారాల పాటు అక్కడ ఉన్నారు. వారు అక్కడ తమ అనుభవాలను అచ్చం డాంటే రచన ఇన్ఫర్నో లోలా ఉన్నాయి" అని వర్ణించారు. ఆ సమయంలో, షిండ్లర్ "తన" యూదులను ఔష్విట్జ్ నుండి బ్రున్లిట్ౙ్‌కి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు. అతని సహాయం కారణంగా, 1,200 మంది యూదులు మే 1945 [4] లో విడుదల వరకు అక్కడ ఉండగలిగారు.

విడుదల తరువాతి జీవితం[మార్చు]

యుద్ధం తర్వాత, వైట్‌మన్ తన హంగరీలో ఉన్న తన కొడుకు ఆచూకీ కనుగొని, ఆ తరువాత అతనితో కలిసి మొరాకోలోని టాంజియర్ అంతరజాతీయ క్షేత్రములో స్థిరపడ్డారు. అక్కడ ఆమె తన రెండవ భర్తను కలుసుకుంది. అతను రైన్‌హాట్ అనే హోటల్ మేనేజర్‌. 1957 లో వివాహము తరువాత రైన్‌హాట్ కుటుంబం యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్లి న్యూయార్క్‌లో స్థిరపడ్డారు. [6] తన రెండవ భర్తతో ఆమెకు ఒక కూతురు ఉంది. ఆ కూతురు 49 సంవత్సరాల వయస్సులో అనారోగ్యంతో మరణించింది. 2007లో 92 సంవత్సరాల రైన్‌హాట్, టెల్ అవీవ్ విశ్వవిద్యాలయంలో సోషియాలజీ ప్రొఫెసర్‌గా ఉన్న, తన కొడుకు సచా వీట్‌మాన్‌ దగ్గర శేషజీవితము గడపడానికి ఇౙ్రాయెల్‌లోని హెర్ౙ్లీయాకు వెళ్లారు. [7] [1] అక్కడ ఆమె 2022లో 107 సంవత్సరాల వయస్సులో తన విశ్రాంత గృహములో మరణించింది. [8]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Oskar Schindler's Jewish secretary, who drew up his worker lists, dies at age 107". timesofisrael.com. 8 ఏప్రిల్ 2022. Archived from the original on 8 ఏప్రిల్ 2022. Retrieved 9 ఏప్రిల్ 2022.
  2. "Schindler's Secretary Mimi Reinhardt Dies Aged 107". www.i24news.tv. 8 ఏప్రిల్ 2022. Archived from the original on 9 ఏప్రిల్ 2022. Retrieved 9 ఏప్రిల్ 2022.
  3. Sulzgruber, Werner. "Follow the Codes – ab- und zugewandt". zeitgeschichte-wn.at (in జర్మన్). Archived from the original on 8 ఏప్రిల్ 2022. Retrieved 9 ఏప్రిల్ 2022.
  4. 4.0 4.1 4.2 Schwartz, Adi (20 డిసెంబరు 2007). "1944: Die Frau, die Schindlers Liste schrieb". Welt Online (in జర్మన్). Hamburg. Archived from the original on 25 సెప్టెంబరు 2013. Retrieved 8 ఏప్రిల్ 2022.
  5. AFP. "Oskar Schindler's Jewish secretary, who drew up his worker lists, dies at age 107". www.timesofisrael.com (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 10 ఏప్రిల్ 2022. Retrieved 15 ఏప్రిల్ 2022.
  6. Schmitz, Thorsten (12 జనవరి 2008). "Mimi Reinhardt im Porträt: Die Frau, die Schindlers Liste schrieb" (in జర్మన్). hagalil.com. Archived from the original on 8 ఏప్రిల్ 2022. Retrieved 8 ఏప్రిల్ 2022.
  7. Yael Branovsky and AFP (4 డిసెంబరు 2007). "Schindler's secretary moves to Israel at 92". Ynetnews (in ఇంగ్లీష్). Archived from the original on 9 ఏప్రిల్ 2022. Retrieved 10 ఏప్రిల్ 2022.
  8. "Sekretärin von Oskar Schindler im Alter von 107 Jahren gestorben" (in జర్మన్). 8 ఏప్రిల్ 2022. Archived from the original on 9 ఏప్రిల్ 2022. Retrieved 9 ఏప్రిల్ 2022.

వెలుపలి లంకెలు[మార్చు]