మిరపగింజల నూనె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మిరప మొక్క-పండినకాయలు
పువ్వు
కాయఅడ్డుకోత-గింజలు

మిరప మొక్క సొలనేసి కుటుంబం, సొలనేలిస్ వర్గం, 'కాప్సికం'ప్రజాతికి చెందినది. జాతులు 40కి పైగా ఉన్నాయి. మిరప వృక్షశాస్త నామం:కాప్సికం అన్నమ్ (capsicum annum). మిరపమొక్క మెక్సికోప్రాంతానికి చెందినమొక్క. క్రీ.పూ.7వేల సంవత్సరాలనాటిదని భావిస్తున్నారు. మిక్సికోలో క్రీ.పూ.3550 నాటికే పెంచబడినట్లుగా తెలుస్తున్నది.[1] క్రిస్టోఫర్ కొలంబస్ స్పైయిన్ నుండి సముద్ర మార్గాన ఇండియాకు మార్గం కనిపెట్టుటకై బయలు దేరి, మెక్సికో ప్రాంతాన్ని ఇండియాగా పొరబడి, అక్కడ చూచిన మిరప మొక్కను మిరియపు (black pepper) మొక్కగా పొరబడి, స్పైయిన్ (chilli pepper) కు పరిచయం చేసాడు. అక్కడి నుండి మిరప ఇతరదేశాలకు వ్యాపించింది.

నూనె

[మార్చు]

మిరపకాయలో గింజశాతం 45% వరకుండును. గింజలో నూనెశాతం25-27% వరకు గింజరకంను, క్వాలిటిని బట్టివుండును.

నూనె ఎర్రగా, చిక్కగా (viscous), ఘాటుగా (pungent like chilli) వుండును. నూనెను ఆల్కలి రిఫైనరి చేసినప్పుడు ఈఘాటైన వాసన తొలగింప బడును. మిరపగింజల నూనెలో 70%కు మించి లినొలిక్ కొవ్వు ఆమ్లం ఉంది.

మిరపగింజల నూనె భౌతికలక్షణాల పట్టిక[2]

భౌతిక లక్షణాలు మితి
వక్రీభవన సూచిక 400Cవద్ద 1.468-1.474
ఐయోడిన్ విలువ 130-143
సపనిఫికెసను విలువ 185-200
అన్‍ సఫొనిపియబుల్ పదార్థం 2.0 గరిష్ఠం
ఆమ్ల విలువ 10.0గరిష్ఠం
విశిష్ట గురుత్వం 30/300Cవద్ద 0.9180-.9231
రంగు 1/4" 30.0

మిరపగింజలోని నూనెలోని కొవ్వు ఆమ్లంలశాతం[2]

కొవ్వు ఆమ్లాలు శాతం
స్టియరిక్ ఆమ్లం (C18:0) 19
ఒలిక్ ఆమ్లం (C18:1) 8
లినొలిక్ ఆమ్లం (C18:2) 73.0

నూనె ఉపయోగాలు

[మార్చు]
  • ఈనూనె ఉత్పత్తి ఇంకను ప్రయోగ దశలోనే ఉంది.పారిశ్రామికంగా అధికమొత్తంలో ఉత్పత్తి అయ్యినప్పుడు ఈ నూనెను రంగుల (paints), ఉపరితల కోటింగ్ రసాయనాలలో కలిపి ఉపయోగించ వీలున్నది.
  • అలాగే బయోడిసెల్ ఉత్పత్తిలో కూడా వాడవచ్చును.

ఇవికూడా చూడండి

[మార్చు]

ఉల్లేఖనలు/మూలాలు

[మార్చు]
  1. "Origin of Chili". chilly.in. Retrieved 2015-03-09.
  2. 2.0 2.1 "Chilli Seed". crirec.com. Archived from the original on 2011-06-25. Retrieved 2015-03-09.