మిలోస్ ఫోర్‌మన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మిలోస్ ఫోర్‌మన్
మిలోస్ ఫోర్‌మన్ (2009)
జననం(1932-02-18)1932 ఫిబ్రవరి 18
చెకోస్లోవేకియా
మరణం2018 ఏప్రిల్ 13(2018-04-13) (వయసు 86)
డాన్‌బరీ హాస్పిటల్‌, యుఎస్
జాతీయత
  • అమెరికన్ (1977 నుండి)
  • చెక్
వృత్తి
క్రియాశీల సంవత్సరాలు1953–2011
జీవిత భాగస్వామి
  • జానా బ్రెజ్చోవా
    (m. 1958; div. 1962)
  • వేరా క్రేసాద్లోవా
    (m. 1964; div. 1999)
  • మార్టినా జ్బోరిలోవా
    (m. 1999)
పిల్లలు4
సంతకం

మిలోస్ ఫోర్‌మన్ (1932, ఫిబ్రవరి 18 - 2018, ఏప్రిల్ 13) చెక్-అమెరికన్ నాటకరంగ, టివి, సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, నటుడు, ప్రొఫెసర్. 1968లో యునైటెడ్ స్టేట్స్‌కు వలస వెళ్ళేముందు తన స్వస్థలమైన చెకోస్లోవేకియాలో పేరు గడించాడు.

జననం[మార్చు]

మిలోస్ 1932, ఫిబ్రవరి 18న రుడాల్ఫ్ ఫోర్‌మన్ - అన్నా ఫోర్‌మనోవా దంపతులకు చెకోస్లోవేకియాలో జన్మించాడు. ఇతని తల్లి 1943లో ఆష్విట్జ్ నిర్బంధ శిబిరంలోనూ, తండ్రి 1944లో మిట్టెల్‌బౌ-డోరా నిర్బంధ శిబిరంలో హత్య చేయబడ్డారు.[1] దాంతో ఇతని తల్లిదండ్రుల దగ్గరి బంధువులు, స్నేహితుల దగ్గర పెరిగాడు.[2]

సినిమారంగం[మార్చు]

1967లో తీసిన ది ఫైర్‌మెన్స్ బాల్‌ను అనే సినిమాను చెకోస్లోవాక్ అధికారులు తూర్పు యూరోపియన్ కమ్యూనిజంపై తీసిన సినిమాగా భావించారు. ఈ సినిమా మొదట్లో ప్రేగ్ స్ప్రింగ్సంస్కరణవాద వాతావరణంలో అతని స్వదేశంలోని థియేటర్లలో ప్రదర్శించబడింది. అయితే, 1968లో వార్సా ఒప్పంద దేశాల దాడి తర్వాత కమ్యూనిస్ట్ ప్రభుత్వంచే నిషేధించబడింది.[3]

ఆ తరువాత చెకోస్లోవేకియాను విడిచి యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్ళి, అక్కడ సినిమాలు తీసి విజయాన్ని సాధించాడు. 1975లో వన్ ఫ్లూ ఓవర్ ది కోకిల నెస్ట్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఉత్తమ చిత్రం, దర్శకుడు, స్క్రీన్‌ప్లే, ప్రధాన పాత్రలో నటుడు, ప్రధాన పాత్రలో నటి మొదలైన ఐదు ప్రధాన అకాడమీ అవార్డులను గెలుచుకొని, ఇన్ని అవార్డులు గెలుచుకున్న రెండవ సినిమాగా నిలిచింది.

1978లో హెయిర్‌ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇది 1979 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. 1981లో రాగ్‌టైమ్‌ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఎనిమిది విభాగాల్లో అకాడమీ అవార్డుకు నామినేట్ అయింది. 1984లో ప్రఖ్యాత శాస్త్రీయ సంగీత విద్వాంసుడు వోల్ఫ్‌గ్యాంగ్ అమేడియస్ మొజార్ట్ జీవితం ఆధారంగా అమేడియస్ అనే సినిమాను తీశాడు. ఈ సినిమా పదకొండు విభాగాల్లో నామినేషన్ పొంది ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడితోపాటు ఎనిమిది విభాగాల్లో అవార్డులు అందుకుంది. 1996లో ది పీపుల్ వర్సెస్ లారీ ఫ్లైంట్ సినిమాకు ఉత్తమ దర్శకుడిగా మరోసారి అకాడమీ అవార్డు నామినేట్ అయ్యాడు.

దర్శకత్వం[మార్చు]

సినిమాలు[మార్చు]

సంవత్సరం పేరు[4] దర్శకుడు రచయిత మూలాలు
1955 లీవ్ ఇట్ టు మీ కాదు అవును [5]
1964 బ్లాక్ పీటర్ అవును అవును [6]
1964 ఆడిషన్ అవును అవును
1965 లవ్స్ ఆఫ్ ఏ బ్లోండే అవును అవును
1967 ఫైర్‌మెన్స్ బాల్ అవును అవును [7]
1971 టేకింగ్ ఆఫ్ అవును అవును
1975 వన్ ప్లెవ్ ఓవర్ ది కుకూస్ నెస్ట్ అవును కాదు
1979 హెయిర్ అవును కాదు
1981 రాగ్‌టైమ్ అవును కాదు
1984 అమేడియస్ అవును కాదు
1989 వాల్మాంట్ అవును అవును
1996 ద పీపుల్ వర్సెస్ లారీ ఫ్లింట్ అవును కాదు
1999 మ్యాన్ ఆన్ ది మూన్ అవును కాదు
2006 గోయాస్ గోస్ట్స్ అవును అవును

డాక్యుమెంటరీ[మార్చు]

సంవత్సరం పేరు దర్శకుడు రచయిత మూలాలు
1960 మేజిక్ లాంటెర్న్ II అవును అవును
1964 ఇఫ్ ఓన్లీ దే ఎయింట్ హాడ్ దెమ్ బ్యాండ్స్ అవును అవును [8]
ఆడిషన్ అవును అవును
1973 విజన్స్ ఆఫ్ ఐట్ అవును కాదు [6]

షార్ట్ ఫిల్మ్స్[మార్చు]

సంవత్సరం పేరు దర్శకుడు రచయిత మూలాలు
1971 ఐ మిస్ సోనియా హెనీ అవును కాదు [9]

టెలివిజన్[మార్చు]

సంవత్సరం పేరు దర్శకుడు రచయిత మూలాలు
1966 ఎ వెట్ పెయిడ్ వాక్ అవును కాదు [10]

నటించినవి[మార్చు]

సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా మూలాలు
1953 ఎ వుమెన్ ఆజ్ గుడ్ ఆజ్ హర్ వర్డ్
1954 సిల్వర్ విండ్
1986 హార్ట్ బర్న్
1989 న్యూ ఇయర్స్ డే
2000 కీపింగ్ ది ఫెయిత్
2008 చెల్సియా ఆన్ ది రాక్స్
2009 హెల్ విత్ ఎ ప్రిన్సెస్
2011 బిలవుడ్

నాటకాలు[మార్చు]

సంవత్సరం పేరు దర్శకుడు రచయిత మూలాలు
1958 లేటర్నా మాజికా కాదు అవును [11]
1960 లాటర్నా మాజికా II కాదు అవును [11]
1972 ది లిటిల్ బ్లాక్ బుక్ అవును కాదు [11]
2007 ఎ వాక్ వర్త్ వైట్ అవును కాదు [11]

అవార్డులు, నామినేషన్లు[మార్చు]

ఇతడు తన సినీ జీవితంలో రెండు అకాడమీ అవార్డులు, మూడు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గ్రాండ్ ప్రిక్స్, బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గోల్డెన్ బేర్, బ్రిటీష్ అకాడమీ ఫిల్మ్ అవార్డు, సీజర్ అవార్డు, డేవిడ్ డి డోనాటెల్లో అవార్డు, చెక్ లయన్‌లను గెలుచుకున్నాడు.[12]

సంవత్సరం అవార్డు విభాగం పేరు ఫలితం మూలాలు
1976 అకాడమీ అవార్డులు ఉత్తమ దర్శకుడు వన్ ప్లెవ్ ఓవర్ ది కుకూస్ నెస్ట్ విజేత [13]
1985 అమేడియస్ విజేత
1997 ది పీపుల్ వర్సెస్ లారీ ఫ్లింట్ నామినేట్
1972 బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ ఉత్తమ దర్శకత్వం టేకింగ్ ఆఫ్ నామినేట్ [14]
ఉత్తమ చిత్రం నామినేట్ [14]
ఉత్తమ స్క్రీన్ ప్లే నామినేట్ [14]
1977 ఉత్తమ దర్శకత్వం వన్ ప్లెవ్ ఓవర్ ది కుకూస్ నెస్ట్ విజేత [14]
1986 ఉత్తమ చిత్రం అమేడియస్ నామినేట్ [14]
1976 గోల్డెన్ గ్లోబ్ అవార్డులు ఉత్తమ దర్శకుడు వన్ ప్లెవ్ ఓవర్ ది కుకూస్ నెస్ట్ విజేత [15]
1982 రాగ్‌టైమ్ నామినేట్ [15]
1985 అమేడియస్ విజేత [15]
1997 ది పీపుల్ వర్సెస్ లారీ ఫ్లింట్ విజేత [15]
1971 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ గ్రాండ్ ప్రిక్స్ టేకింగ్ ఆఫ్ విజేత [16]
పామ్ డి ఓర్ నామినేట్ [16]
1997 బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ గోల్డెన్ బెర్లిన్ బేర్ ది పీపుల్ వర్సెస్ లారీ ఫ్లింట్ విజేత [17]
2000 మ్యాన్ ఆన్ ది మూన్ నామినేట్ [18]
సిల్వర్ బేర్ ఉత్తమ దర్శకుడు విజేత [18]
1977 సీజర్ అవార్డులు ఉత్తమ విదేశి చిత్రం వన్ ప్లెవ్ ఓవర్ ది కుకూస్ నెస్ట్ నామినేట్ [19]
1980 హెయిర్ నామినేట్ [19]
1985 అమేడియస్ విజేత [19]
1990 ఉత్తమ దర్శకుడు వాల్మాంట్ నామినేట్ [19]
1976 డేవిడ్ డి డోనాటెల్లో అవార్డులు ఉత్తమ విదేశి దర్శకుడు వన్ ప్లెవ్ ఓవర్ ది కుకూస్ నెస్ట్ విజేత [20]
1980 హెయిర్ విజేత [21]
1985 అమేడియస్ విజేత [22]
ఉత్తమ విదేశి చిత్రం విజేత [22]

ఇతర సినిమాల అవార్డులు[మార్చు]

ఫోర్‌మన్ సినిమాలకు వచ్చిన అవార్డులు, నామినేషన్లు
సంవత్సరం శీర్షిక అకాడమీ అవార్డులు బ్రిటీష్ అవార్డులు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు
నామినేషన్ విజేత నామినేషన్ విజేత నామినేషన్ విజేత
1965 లవ్స్ ఆఫ్ ఎ బ్లోండే 1 1
1967 ది ఫైర్‌మెన్స్ బాల్ 1
1971 టేకింగ్ ఆఫ్ 6
1973 విజన్స్ ఆఫ్ ఐట్ 1 1
1975 వన్ ప్లెవ్ ఓవర్ ది కుకూస్ నెస్ట్ 9 5 10 6 6 6
1979 హెయిర్ 2
1981 రాగ్‌టైమ్ 8 1 7
1984 అమేడియస్ 11 8 9 4 6 4
1989 వాల్మాంట్ 1 1
1996 ది పీపుల్ వర్సెస్ లారీ ఫ్లింట్ 2 5 2
1999 మ్యాన్ ఆన్ ది మూన్ 2 1
మొత్తం 33 13 27 10 30 14

గౌరవాలు[మార్చు]

1977లో ఇతనికి యునైటెడ్ స్టేట్స్ పౌరసత్వం వచ్చింది.[23] 1985, 2000 సంవత్సరాలలో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు నాయకత్వం వహించాడు. 1988లో సీజర్ అవార్డు వేడుకకు అధ్యక్షత వహించాడు.[24] 2007 ఏప్రిల్ లో జాజ్ ఒపెరా డోబ్రే ప్లేస్నా ప్రోచాజ్కాలో పాల్గొన్నాడు. 1966లో రూపొందించిన టివి సినిమాకు ప్రేగ్ నేషనల్ థియేటర్‌లో ప్రదర్శించబడింది. దీనికి ఇతని కుమారుడు కుమారుడు పీటర్ దర్శకత్వం వహించాడు.

  • 1965: లవ్స్ ఆఫ్ ఎ బ్లోండ్[25] కొరకు క్లెమెంట్ గాట్‌వాల్డ్ రాష్ట్ర బహుమతి
  • 1997: కార్లోవీ వేరీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రపంచ సినిమాకి అత్యుత్తమ కళాత్మక సహకారం అందించినందుకు క్రిస్టల్ గ్లోబ్ అవార్డు[26]
  • 1998: చెక్ సినిమాకి చేసిన సేవలకు చెక్ లయన్ అవార్డ్స్ ద్వారా జీవితకాల సాఫల్య పురస్కారం[27]
  • 1995: చెక్ మెడల్ ఆఫ్ మెరిట్[27]
  • 2006: హన్నో ఆర్. ఎలెన్‌బోజెన్ పౌరసత్వ పురస్కారం
  • 2009: యుఎస్ లోని మసాచుసెట్స్‌లోని బోస్టన్‌లోని ఎమర్సన్ కాలేజీ నుండి గౌరవ డిగ్రీ[28]
  • 2015: కొలంబియా విశ్వవిద్యాలయంచే గౌరవ డాక్టర్ ఆఫ్ హ్యూమన్ లెటర్స్ డిగ్రీ[29]

ఇతర వివరాలు[మార్చు]

మిలోస్ ఫోర్‌మన్ కొలంబియా విశ్వవిద్యాలయంలో ఎమెరిటస్ ఫిల్మ్ ప్రొఫెసర్ గా పనిచేవాడు.[30] 1996లో గ్రహశకలానికి 11333 ఫోర్‌మన్ అని ఇతని పేరు పెట్టారు.[31] కవితలు వ్రాసాడు, 1994లో టర్నరౌండ్ అనే ఆత్మకథను ప్రచురించాడు.[31]

మరణం[మార్చు]

మిలోస్ ఫోర్‌మన్ తన 86 సంవత్సరాల వయస్సులో 2018, ఏప్రిల్ 13న కనెక్టికట్‌లోని వారెన్‌లోని తన ఇంటికి సమీపంలోని డాన్‌బరీ హాస్పిటల్‌లో మరణించాడు.[32][33][34][35] అతను కనెక్టికట్‌లోని వారెన్‌లోని న్యూ వారెన్ స్మశానవాటికలో ఖననం చేయబడ్డాడు.

మూలాలు[మార్చు]

ది మిలోస్ ఫార్మన్ స్టోరీస్ వాన్ ఆంటోనిన్ జె. లిహెమ్ (ISBN 978-1-138-65829-5)

  1. Eintrag Rudolf Forman im Gedenkbuch KZ Mittelbau-Dora
  2. Náchod to krásné město Kostelec.
  3. Hoberman, J. "The Firemen's Ball". The Criterion Collection (in ఇంగ్లీష్). Retrieved 2023-06-01.
  4. "Miloš Forman". Česko-Slovenská filmová databáze. Retrieved 2023-06-01.
  5. "Filmography". MilosForman.com. Retrieved 2023-06-01.
  6. 6.0 6.1 "Milos Forman". BFI. Retrieved 2023-06-01.
  7. "Festival de Cannes: The Fireman's Ball". festival-cannes.com. Archived from the original on 2015-01-20. Retrieved 2023-06-01.
  8. "Kdyby ty muziky nebyly". Zurich Film Festival. Retrieved 2023-06-01.
  9. "I Miss Sonia Henie". MilosForman.com. Retrieved 2023-06-01.
  10. "A Walk Worthwhile". MilosForman.com. Retrieved 2023-06-01.
  11. 11.0 11.1 11.2 11.3 "Theatre Projects". MilosForman.com. Retrieved 2023-06-01.
  12. List of Milos Forman nominations Archived 11 జనవరి 2012 at the Wayback Machine.
  13. "Milos Forman, Oscar-Winning Director of 'One Flew Over the Cuckoo's Nest,' Dies at 86". Variety. Retrieved 2023-06-01.
  14. 14.0 14.1 14.2 14.3 14.4 "BAFTA Awards Search". BAFTA. Retrieved 2023-06-01.
  15. 15.0 15.1 15.2 15.3 "Milos Forman". Golden Globes. Retrieved 2023-06-01.
  16. 16.0 16.1 "Milos FORMAN -Festival de Cannes 2018". Cannes Festival. Retrieved 2023-06-01.
  17. "Berlinale: 1997 Prize Winners". berlinale.de. Retrieved 2023-06-01.
  18. 18.0 18.1 "PRIZES & HONOURS 2000". berlinale.de. Archived from the original on 15 October 2013. Retrieved 2023-06-01.
  19. 19.0 19.1 19.2 19.3 "Results Milos Forman". Academie des Arted de Cinema. Archived from the original on 2018-04-15. Retrieved 2023-06-01.
  20. "One Flew over the Cuckoo's Nest Awards: List of Awards won by English movie One Flew over the Cuckoo's Nest". The Times of India.
  21. "Hair". MilosForman.com. Retrieved 2023-06-01.
  22. 22.0 22.1 "Amadeus". MilosForman.com. Retrieved 2023-06-01.
  23. "The Story of Famed Czech Director Miloš Forman (Part II)". CitySpy. 6 September 2017. Archived from the original on 2020-08-04. Retrieved 2023-06-01.
  24. "Présidences de Cérémonie". Academie des Arts et Techniques du Cinema. Archived from the original on 2017-05-22. Retrieved 2023-06-01.
  25. "Loves of a Blonde". MilosForman.com. Retrieved 2023-06-01.
  26. "KVIFF History". KVIFF.com. Retrieved 2023-06-01.
  27. 27.0 27.1 "Milos Forman named honorary citizen". Prague.tv. Archived from the original on 2020-08-04. Retrieved 2023-06-01.
  28. "News Articles in 2009". Emerson College.
  29. "University Commencement, Morningside Campus". columbia.edu. Archived from the original on 12 March 2016. Retrieved 2023-06-01.
  30. Milos Forman page at Columbia University.
  31. 31.0 31.1 "Milos Forman's Masterclass". Grapevine. 6 October 2009. Retrieved 2023-06-01.
  32. "Forman, Oscar-winning director of 'Cuckoo's Nest' and 'Amadeus', dies at 86". Reuters. 2023-06-01. Retrieved 2023-06-01.
  33. "Milos Forman, Oscar-winning director, dies at 86". The Boston Globe. 2023-06-01. Retrieved 2023-06-01.
  34. Piccalo, Gina (2023-06-01). "Miloš Forman, Oscar-winning Czech director of 'One Flew Over the Cuckoo's Nest,' dies at 86". Los Angeles Times.
  35. "Forman, Oscar-winning director of "Cuckoo's Nest" and "Amadeus",..." Reuters. 2023-06-01 – via uk.reuters.com.

బయటి లింకులు[మార్చు]

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.