మిష్టీ దోయి
| ఇతర పేర్లు | మిష్టీ దోయ్, మితా దోయి (అస్సామీ), మీఠీ దహి (హిందీ), మిఠా దహి (ఒడియా) |
|---|---|
| రకం | పెరుగు (yogurt) |
| Course | డెజర్ట్ |
| మూల స్థానం | భారత ఉపఖండం |
| రాష్ట్రం | బెంగాల్ |
| Associated cuisine | భారతీయ వంటకాలు, బంగ్లాదేశీ వంటకాలు |
| ప్రధాన అనుఘటకాలు | పాలు, పెరుగు, చక్కెర, బెల్లం |
| Variations | నబద్విప్-ఎర్ లాల్ దోయి, బోగ్రార్ మిష్టి దోయి |
మిష్టి దోయి అనేది భారత ఉపఖండంలోని బెంగాల్ ప్రాంతం నుండి ఉద్భవించిన పులియబెట్టిన తీపి పెరుగు, ఇది ఒక వంటకం.[1] భారతదేశంలోని పశ్చిమ బెంగాల్, త్రిపుర, అస్సాంలోని బరాక్ లోయ, [2]బంగ్లాదేశ్ దేశంలోనూ ఇది సాధారణ డెజర్ట్.[3] [4] దీనిని పాలు, పెరుగు, చక్కెర, లేదా బెల్లం తో తయారు చేస్తారు. తయారీ విధానం కారణంగా ఇది సాదా పెరుగు నుండి భిన్నంగా ఉంటుంది. వాటి ప్రజాదరణ ప్రకారం మిష్టి దోయిలో అనేక వైవిధ్యాలు ఉన్నాయి. నబద్విప్, కోల్‌కతా, బోగ్రా మొదలైన వాటి మిష్టీ దోయి చాలా ప్రాచుర్యం పొందింది.[5]
మిష్టీ దోయి అనేది పాలు కొద్దిగా చిక్కబడే వరకు మరిగించి, గురా (సేంద్రియ చక్కెర) కాని, ఖేజుర్ గురా (ఖర్జూర మొలాసిస్) కాని సరిపడా కలిపి, పాలను రాత్రంతా పులియబెట్టాలి.[6] మట్టి పాత్రలను మాత్రమే మిఠా దహి తయారీకి ఉపయోగిస్తారు. దీనికి, కారణం వాటి గోడల సూక్ష్మరంధ్రాల ద్వారా నీరు క్రమంగా పోయి పెరుగు మరింత చిక్కబడతుంది,[7] అలాగే, సరైన ఉష్ణోగ్రతను కూడా ఉత్పత్తి చేస్తుంది. సువాసన కోసం చిటికెడు ఏలకుల పొడి చేర్చుకోవచ్చు. పశ్చిమ దేశాలలో లభించే బేక్ యోగార్ట్ ఇలాంటి తయారీనే.
దేశంలో టైఫాయిడ్ మందులను కనుగొనే ముందు, డాక్టర్ బిసి రాయ్, కల్నల్ డెన్హామ్ వైట్, నిల్రతన్ సిర్కార్ వంటి ప్రసిద్ధ అలోపతి వైద్యులు వారి రోగులకు మిష్టీ దోయిని సూచించేవారు, ఇందులో సమృద్ధిగా లభించే విటమిన్ బి దీనికి ప్రధాన కారణం.[8]
మూలాలు
[మార్చు]- ↑ Tamang, Jyoti Prakash (2016-08-05). Ethnic Fermented Foods and Alcoholic Beverages of Asia (in ఇంగ్లీష్). Springer. p. 20. ISBN 978-81-322-2800-4.
- ↑ Mudgil, D.; Mudgil, S. B. (2015-01-01). Glossary of Dairy Technology (in ఇంగ్లీష్). Scientific Publishers. p. 84. ISBN 978-93-86102-32-4.
- ↑ Tamang, Jyoti Prakash; Kailasapathy, Kasipathy (2010-07-01). Fermented Foods and Beverages of the World (in ఇంగ్లీష్). Boca Raton, Florida: CRC Press: Taylor & Francis Group. p. 17. ISBN 978-1-4200-9496-1.
- ↑ Whyte, Mariam; Lin, Yong Jui (2010). Bangladesh. New York: Marshall Cavendish Benchmark. p. 144. ISBN 9780761444756.
- ↑ Ruj, Subrata (2019). Mistanno Mitare: A Collection of Prose (in Bengali). Howrah: Sristisukh Prokashan LLP. p. 88. ISBN 978-93-88887-73-1.
- ↑ Brien, Charmaine O' (2013-12-15). The Penguin Food Guide to India (in ఇంగ్లీష్). Penguin UK. ISBN 978-93-5118-575-8.
- ↑ Krondl, Michael (2011-10-01). Sweet Invention: A History of Dessert (in ఇంగ్లీష్). Chicago: Chicago Review Press. pp. 59–60. ISBN 978-1-56976-954-6.
- ↑ Dasgupta, M. (2000-10-14). Calcutta Cookbook: A Treasury of Recipes From Pavement to Place (in ఇంగ్లీష్). Penguin UK. ISBN 978-93-5118-149-1.