మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే
స్వరూపం
| మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే | |
|---|---|
| దర్శకత్వం | అషిమా చిబ్బర్ |
| రచన | సమీర్ సతీజ అషిమా చిబ్బర్ రాహుల్ హండా |
| నిర్మాత | మోనిషా అద్వానీ మధు భోజ్వానీ నిక్కిల్ అద్వానీ |
| తారాగణం | రాణీ ముఖర్జీ అనిర్బన్ భట్టాచార్య నీనా గుప్తా జిమ్ సర్భ్ |
| ఛాయాగ్రహణం | అల్వార్ కోయ్ |
| కూర్పు | నమ్రతా రావు |
| సంగీతం | పాటలు: అమిత్ త్రివేది బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: హితేష్ సోనిక్ |
నిర్మాణ సంస్థలు | ఎమ్మే ఎంటర్‌టైన్‌మెంట్ జీ స్టూడియోస్ |
| పంపిణీదార్లు | జీ స్టూడియోస్ |
విడుదల తేదీ | 2023 మార్చి 17 |
సినిమా నిడివి | 144 నిమిషాలు [1] |
| దేశం | భారతదేశం |
| భాష | హిందీ |
| బడ్జెట్ | ₹ 29 కోట్లు[2] |
| బాక్సాఫీసు | ₹ 36.53 కోట్లు[3] |
మిసెస్ ఛటర్జీ vs నార్వే 2023లో విడుదలైన భారతీయ హిందీ -భాషా లీగల్ డ్రామా సినిమా. ఆషిమా చిబ్బర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాణి ముఖర్జీ , అనిర్బన్ భట్టాచార్య, నీనా గుప్తా & జిమ్ సర్భ్ నటించారు. ఈ సినిమా అనురూప్ భట్టాచార్య & సాగరికా చక్రవర్తి అనే భారతీయ వలస దంపతుల నిజ జీవిత కథ నుండి ప్రేరణ పొందింది.
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 17 మార్చి 2023న థియేటర్లలో విడుదలై సానుకూల సమీక్షలు & ప్రశంసలు అందుకున్నాయి. ఈ సినిమాలో నటనకుగాను రాణి ముఖర్జీ 2025లో భారత ప్రభుత్వంచే 71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ నటిగా ఎంపికైంది.[4][5]
నటీనటులు
[మార్చు]- దేబికా ఛటర్జీగా రాణీ ముఖర్జీ
- అనిరుద్ధ "అనిరుధ్" ఛటర్జీగా అనిర్బన్ భట్టాచార్య, దేబికా భర్త
- నార్వే న్యాయవాది డేనియల్ సింగ్ సియుపెక్ గా జిమ్ సర్భ్
- వసుధా కామత్‌గా నీనా గుప్తా, భారత విదేశాంగ మంత్రి (సుష్మా స్వరాజ్ పాత్ర)
- Kärt Tammjärv సియాగా, వెల్ఫ్రెడ్‌లో అధికారి
- మటిల్డా మాగ్నస్‌గా బ్రిట్టా సోల్, వెల్ఫ్రెడ్ అధికారి
- అభిజీత్ దత్తా, కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తిగా బరున్ చందా
- న్యాయవాది సునైనా ప్రతాప్‌గా బాలాజీ గౌరి
- అనిరుధ్ తల్లిగా మిథు చక్రబర్తి
- అనిరుద్ధ సోదరుడు అనురాగ్ ఛటర్జీగా సౌమ్య ముఖర్జీ
- దేబికా తండ్రిగా బోధిసత్వ మజుందార్
- దేబికా తల్లిగా శాశ్వతి గుహా ఠాకుర్తా
- బిశ్వజీత్ సర్కార్‌గా వరుణ్ వజీర్
- నందినిగా చారు శంకర్
- రాబియాగా రూపంగి వాన్వారి
- వెల్‌ఫ్రెడ్‌లో కిండర్ గార్టెన్ టీచర్ బెరిట్ హాన్సెన్‌గా సారా సౌలీ
- యువన్ వన్వారి శుభా ఛటర్జీ, దేబికా & అనిరుద్ధ కొడుకుగా
- సుచి ఛటర్జీ, దేబికా మరియు అనిరుద్ధ కుమార్తెగా ఇర్హా అలీ
- లార్స్ క్రిస్టియాన్‌సెన్‌గా క్రిస్జాన్ సర్వ్ (వెల్ఫ్రెడ్ నుండి అధికారి)
పాటలు
[మార్చు]ఈ సినిమాకి అమిత్ త్రివేది సంగీతం సమకూర్చారు. కౌసర్ మునీర్ సాహిత్యం రాశారు.
| సం. | పాట | గాయకులు | పాట నిడివి |
|---|---|---|---|
| 1. | "శుభో శుభో" | అల్తమాష్ ఫరీది | 2:56 |
| 2. | "మా కే దిల్ సే" | జావేద్ అలీ , దీపాక్షి కలిత | 3:33 |
| 3. | "ఆమి జానీ రే" | మధుబంటి బాగ్చి | 4:04 |
| మొత్తం నిడివి: | 10:50 | ||
మూలాలు
[మార్చు]- ↑ "Mrs Chatterjee vs Norway". British Board of Film Classification. Archived from the original on 12 March 2023. Retrieved 12 March 2022.
- ↑ "Mrs Chatterjee vs Norway - Movie". Box Office India. Archived from the original on 21 July 2023. Retrieved 21 July 2023.
- ↑ "Mrs. Chatterjee vs Norway Box Office". Bollywood Hungama. 17 March 2023. Archived from the original on 20 March 2023. Retrieved 21 March 2023.
- ↑ "Rani Mukerji dedicates her 1st National Film Award in 30 years for Mrs Chatterjee vs Norway to mothers" (in ఇంగ్లీష్). Hindustan Times. 1 August 2025. Archived from the original on 2 August 2025. Retrieved 2 August 2025.
- ↑ "The real life story of Mrs Chatterjee from "Mrs Chatterjee Vs Norway"". The Times of India. 20 May 2023. Archived from the original on 2 August 2025. Retrieved 2 August 2025.