మిసొఫోనియా
ఈ పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
మిసొఫోనియా (లేదా సెలెక్టివ్ సౌండ్ సెన్సిటివిటీ సిండ్రోమ్, సౌండ్-రేజ్ ) అనేది నిర్దిష్ట శబ్దాలు లేదా వాటి సంబంధిత ఉద్దీపనలు లేదా సూచనలకు సహనం తగ్గడం. "ట్రిగ్గర్స్" అని పిలిచే ఈ సూచనలు అసహ్యకరమైనవిగా, అప్రియంగా అనిపిస్తాయి. సహజంగా ఇతరుల్లో కనిపించని బలమైన ప్రతికూల భావోద్వేగ, ప్రవర్తనా ప్రతిస్పందనలను రేకెత్తిస్తాయి. (2022). "Consensus Definition of Misophonia: A Delphi Study". మిసొఫోనియాతో పాటు దాంతో బాధపడేవారు దాన్ని భరించేందుకు ఉపయోగించే పద్ధతులు కూడా (అసహ్య భావనను రేకెత్తించే పరిస్థితులకు దూరంగా ఉండడం, వినికిడి తగ్గించే సాధనాలు ఉపయోగించడం) జీవిత లక్ష్యాలను సాధించడంలో, సామాజిక పరిస్థితులను అనుభవించడంలో ప్రతికూల ప్రభావం చూపుతాయి.[1] ఆడియాలజీలో 2001లో ఈ స్థితి గురించి మొదటి సారి చర్చించారు.[2] అయితే, 2013 దాకా దీనికి వైద్య, వైజ్ఞానిక సాహిత్యంలో చోటు దక్కలేదు. 2013లో ఆంస్టర్‌డ్యాం యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌కు చెందిన మానసిక వైద్యుల బృందం మిసొఫోనియా కేస్ సీరీస్ గురించి విపులంగా ప్రచురించి దీన్ని నిర్ణీత వ్యాధి నిర్ధారక లక్షణాలు ఉన్న ఒక కొత్త మానసిక వ్యాధిగా పరిగణించాలని సూచించారు.[3] ప్రస్తుతం మిసొఫోనియాకు ఒక నిర్ధారించగల వ్యాధిగా డీఎస్‌ఎమ్-5-టీఆర్, ఐసీడీ-11 వంటి యే వివరణ పత్రాల్లోనూ[4][5][6][7] స్థానం లేదు. ఇందువల్ల ఈ వ్యాధితో బాధపడే వారికి వ్యాధి నిర్ధారణ జరగడం, వైద్య సహాయం అందడం లేదు. 2022లో మిసొఫోనియా నిపుణుల అంతర్జాతీయ మండలి మిసొఫోనియాను ఒక ఒక వ్యాధిగా గుర్తిస్తూ[4] దానికి ఏకాభిప్రాయంతో ఒక నిర్వచనాన్ని స్థిరపర్చారు. అప్పట్నుంచి వైద్యులూ, పరిశోధకులూ ఈ నిర్వచనాన్నే స్వీకరించారు.[8][9]
నిర్దిష్ట "ట్రిగ్గర్" ఉద్దీపనలను ఎదుర్కొన్నప్పుడు, మిసోఫోనియా ఉన్న వ్యక్తులకు కోపం (కొన్ని సార్లు విపరీతంగా), చికాకు, అసహ్యం, ఆందోళన వంటి అనేక రకాల ప్రతికూల భావోద్వేగాలు కలుగుతాయి.[4] భావోద్వేగాలతో పాటు తరచుగా అనేక రకాల శారీరక లక్షణాలు కూడా కనిపిస్తాయి (ఉదాహరణకు, కండరాల్లో ఒత్తిడి, గుండె వేగంగా కొట్టుకోవడం, చెమట పట్టడం). ఇవి ఫైట్ ఆర్ ఫ్లైట్ ప్రతిస్పందనను ప్రేరేపిస్తాయి.[4] పెద్ద ద్వనుల వల్ల ఇబ్బంది కలిగే హైపర్‌ఆక్యుసిస్‌లా కాక మిసొఫోనియాలో ద్వని రకం, సదరు వ్యక్తికి దానితో ఉన్న సంబంధం ప్రాముఖ్యత కలిగి ఉంటాయి.[10][11][12] మిసోఫోనియా ఉన్న చాలా మంది వ్యక్తులు స్వీయ-ఉత్పన్న శబ్దాల వల్ల ప్రభావితం అవ్వరు. ఒకవేళ అయినా, వాటి ప్రభావం బలహీనంగా ఉంటుంది.[4]
మిసొఫోనిక్ ప్రతిచర్యలు అనేక విభిన్న శ్రవణ, దృశ్య, ఆడియోవిజువల్ ఉద్దీపనల వల్ల ప్రేరేపితం అవుతాయి. సాధారణంగా నోరు/ముక్కు/గొంతు నుంచి వెలువడే శబ్దాలు (ముఖ్యంగా నమిలే, తినే, తాగే శబ్దాలు), ఇతర వ్యక్తులు లేదా వస్తువులు ఉత్పత్తి చేసే పునరావృత శబ్దాలు, జంతువులు ఉత్పత్తి చేసే శబ్దాలు ట్రిగ్గర్లుగా ఉంటాయి.[4] దృశ్య ఉద్దీపనలకు, ప్రముఖంగా ఇతరులు చేసే పునరావృత కదలికలకు, జరిగే మిసొఫోనిక్ ప్రతిస్పందనలను సూచించేందుకు మిసోకైనీసియా అనే పదాన్ని ప్రతిపాదించారు.[13][14] ఒకసారి ఒక ఉద్దీపన వల్ల ప్రభావితం అయిన తరువాత మిసొఫోనియా ఉన్న వ్యక్తులు దాన్నుంచి తమ దృష్టి తాము మరల్చుకోవడంలో ఇబ్బంది పడవచ్చు, సామాజిక, వృత్తిపరమైన లేదా విద్యాపరమైన పనితీరులోనూ ఇబ్బందులు అనుభవించవచ్చు.[4] మిసొఫోనియా ఉన్న చాలా మందికి మిసొఫోనిక్ ట్రిగ్గర్లకు వారి ప్రతిచర్యలు మితిమీరి ఉంటాయని తెలిసినా, వాటికి తమ ప్రతిస్పందనలను నియంత్రించడంలో విఫలం అవుతారు. ఇది సిగ్గు, అపరాధ భావన, ఒంటరితనం, స్వీయ-ద్వేషానికి దారితీస్తుంది. అంతే కాకుండా ట్రిగ్గర్లు, ఆందోళన, నిరాశల గురించి అతిగా ఆలోచించడం, అతిగా ప్రమత్తంగా ఉండడం చేస్తారు.[4][15][16][17] మిసొఫోనియా వల్ల చదువు, పని, సామాజిక జీవితం, కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయని అధ్యయనాలు చూపించాయి.[18] అమెరికాలో, వ్యక్తిగత విద్యా ప్రణాళిక అర్హత కలిగిన వికలాంగుల విద్యా చట్టం (ఐడీఈఏ) కింద గుర్తింపు పొందిన 13 వైకల్యాలలో మిసొఫోనియా లేదు, కానీ మిసొఫోనియా ఉన్న పిల్లలకు 504 ప్లాన్ కింద పాఠశాల ఆధారిత వైకల్య వసతులు కల్పించవచ్చు.[19][20]
మిసొఫోనియా లక్షణాల వ్యక్తీకరణ, తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి.[4][21] అధ్యయనాలు వేర్వేరు జనాభాలపై చేయడం, వేర్వేరు పద్ధతుల్లో చేయడం వల్ల మిసొఫోనియా వ్యాప్తి ఒక్కో అధ్యయనం ఒక్కోలా నివేదించాయి.[22] అయితే, ప్రాబబిలిటీ-బేస్డ్ స్యాంప్లింగ్ పద్ధతులను ఉపయోగించిన మూడు అధ్యయనాల ప్రకారం 4.6-12.8% పెద్దవారిలో వైద్య పరీక్షలూ, ప్రమేయమూ అవసరం అయ్యే స్థాయిలో ఉండవచ్చని తేలింది.[23][24][25] మిసొఫోనియా లక్షణాలు సాధారణంగా బాల్యంలో లేదా కౌమారదశలో మొదటిసారిగా బయట పడతాయి, అయితే ఈ పరిస్థితి ఏ వయసులోనైనా రావచ్చు.[4] చికిత్సలో ప్రధానంగా ప్రత్యేకిత కాగ్నిటివ్-బిహేవియరల్ తెరపీని వాడినా, యే ఒక్క పద్ధతీ మిగతా వాటి కంటే ఎక్కువ ప్రభావశీలంగా ఉంటుందని చెప్పడానికి ఆధారాలు తక్కువగానే ఉన్నాయి. అయితే, కొన్ని అధ్యయనాల్లో కాగ్నిటివ్-బిహేవియరల్ తెరపీ, సైకోట్రోపిక్ మెడికేషన్ వంటి పద్ధతుల వల్ల మిసొఫోనియా లక్షణాల నుంచి పాక్షిక, లేదా పూర్తి ఉపశమనం లభించడం కనిపించింది.
మిసొఫోనియా ట్రిగర్లు
[మార్చు]మిసొఫోనియాను ప్రేరేపించే ట్రిగర్ ఉద్దీపనలు చాలా వైవిధ్యంగా, విలక్షణంగా ఉంటాయి. అయితే, నమలడం వంటి ముక్కు, నోరు సంబంధ శబ్దాలు అత్యంత సామాన్య ట్రిగర్లు.[4] మిసొఫోనియా లక్షణాలను కొలిచేందుకు ప్రముఖంగా వాడే డ్యూక్ మిసొఫోనియా ప్రశ్నావళి, ట్రిగర్లను క్రింది వర్గాలుగా విభజిస్తుంది:[26]
- వ్యక్తులు తినే, త్రాగే సమయంలో నోటితో చేసే శబ్దాలు (ఉదా., నమలడం, కరకరలాడించడం, చప్పుడు చేస్తూ తాగడం).
- వ్యక్తులు చేసే నాసిక/గొంతు సంబంధ శబ్దాలు (ఉదా., గట్టిగా గాలి పీల్చడం, తుమ్మడం, ముక్కు-ఈలలు, దగ్గడం, గొంతు సవరించడం).
- తింటున్నప్పుడు కాక ఇతర సమయాల్లో వ్యక్తులు నోటితో చేసే శబ్దాలు (ఉదా., "ౘ ౘ" శబ్దం చేయడం, ఎగశ్వాస తీసుకోవడం, గురక పెట్టడం, ఈల వేయడం).
- వ్యక్తులు చేసే పునరావృత శబ్దాలు (ఉదా., టైప్ చేయడం, టేబుల్‌పై గోళ్ళతో పదే పదే తట్టడం, పెన్ క్లిక్ చేయడం, రాయడం, నిర్మాణ పని, యంత్రాలను ఉపయోగించడం).
- వస్తువులను చటచటమనిపించడం లేదా చింపివేయడం (ఉదా., కాగితం, ప్లాస్టిక్)
- ఉచ్చారణ శబ్దాలు (ఉదా., "ప్" శబ్దాలు, 'హుస్స'మన్నట్టుండే "స్" శబ్దాలు, అస్పష్టంగా మాట్లాడటం, ఉచ్చస్వరంలో మాట్లాడటం).
- శరీర లేదా కీళ్ల శబ్దాలు (ఉదా., వేళ్లు నొక్కడం, కీళ్ళు పటపటలాడించడం, దవడ నొక్కడం).
- రుద్దే శబ్దాలు (ఉదా., ప్యాంటు మీద చేతులతో రుద్దడం, చేతులు రుద్దుకోడం, స్టైరోఫోం ముక్కలు రుద్దుకోవడం).
- చిందులు తొక్కడం లేద శబ్దం చేస్తూ నడవడం (ఉదా., హీల్స్ క్లిక్ చేయడం, చెప్పులు టపటపలాడించడం)
- ముసుగు పెట్టినట్టు ఉండే శబ్దాలు (ఉదా., గోడ అవతలి నుంచి వచ్చే శబ్దాలు, వేరే గదిలో ఉన్న టీవీ/సంగీతం శబ్దాలు).
- వ్యక్తులు నేపథ్యంలో మాట్లాడటం (ఉదా., బహిరంగంగా ఫోన్ కాల్స్ మాట్లాడటం, చాలా మంది ఒకేసారి మాట్లాడటం)
- ఒక వ్యక్తి చేయని పునరావృత లేదా నిరంతర శబ్దాలు (ఉదా., గడియారం శబ్దం, ఎయిర్ కండీషనర్ శబ్దం, నీరు పారే శబ్దం).
- జంతువులు చేసే పునరావృత శబ్దాలు (ఉదా., నాకడం, కిలకిలారావాలు చేయడం, మొరగడం, తినడం, తాగడం).
- ఆ శబ్దం వినపడకపోయినప్పటికీ, ఎవరైనా ఇబ్బంది పెట్టే శబ్దం చేయడాన్ని లేదా చేయబోవడాన్ని చూడటం (ఉదా., ఎవరైనా చిప్స్ సంచిలోకి చేయి పెట్టడం, మ్యూట్‌లో ఉన్న టీవీలో ఎవరైనా తినడం చూడటం).
- నచ్చని వ్యక్తులు, లేదా నిర్దిష్ట జాతుల వారు చేసే ఏదైనా శబ్దం (ఉదా., నచ్చని ఇరుగుపొరుగు వారి సంభాషణ వినడం).
మిసొకైనీషియా ట్రిగర్లపై తగినంత పరిశోధన జరగనప్పటికీ, వీటిలో కొన్ని - వ్యక్తులు చేసే పునరావృత కదలికలు (కాళ్ళు/చేతులు ఊపడం, చేతులు రుద్దుకోవడం, చేత్తో జుట్టు తిప్పడం, తత్తరపాటుగా/చంచలంగా ఉండడం), ట్రిగర్ శబ్దాలు వినపడకపోయినా ఆ శబ్దాలు చేసేప్పుడు చూడటం (ఎవరైనా నోరు తెరిచి నమలడం లేదా డెస్క్ మీద వారి వేళ్లను నొక్కడం వంటివి).[4][27]
ట్రిగ్గర్లకు ప్రతిస్పందనలు తేలికపాటి (తీవ్ర చికాకు, ఆందోళన, అసహ్యం లేదా శారీరక అసౌకర్యం) నుండి తీవ్రంగా (విపరీతమైన కోపం, ద్వేషం, భయం, భయాందోళన లేదా లోతైన భావోద్వేగ బాధ) ఉంటాయి.[4] కండరాల ఒత్తిడి, పెరిగిన హృదయ స్పందన రేటు, చెమట పట్టడం, శరీరంలో ఒత్తిడి వంటి అనేక శారీరక లక్షణాలు కూడా మిసొఫోనిక్ ప్రతిస్పందనతో పాటు ఉండవచ్చు.[4][18]
యూకేలో మిసొఫోనియా పరిశొధన కోసం ఉపయోగించిన ఎస్-ఫైవ్ మిసొఫోనియా ప్రశ్నావళి నుంచి లభించిన డేటాను పరిశీలించిన తరివాత, ట్రిగర్లకు అయిదు రకాల కాగ్నిటివ్-బిహేవియరల్ ప్రతిస్పందనలు ఉండవచ్చునని గుర్తించారు.[28][29][30] అవి:
- అంతర్గత మదింపులు - స్వీయ-విమర్శనాత్మక ఆలోచనలు కలిగి ఉండడం, ట్రిగర్లకు తమ ప్రతిస్పందనల గురించి అపరాధ భావన కలిగి ఉండడం, సిగ్గుపడటం
- బాహ్యీకరించే మదింపులు - ప్రేరేపించే శబ్దాలు చేసినందుకు ఇతరులను నిందించడం, ఇతరులు స్వార్థపూరితంగా లేదా అగౌరవంగా ఉన్నారని భావించడం, కొన్ని శబ్దాలు "చేయడమే అమర్యాదపూర్వకం" అనీ, వాటిని ఎవరూ చేయకూడదు అనీ నమ్మడం.
- ఆందోళన/ఎగవేత ప్రతిస్పందనలు - తమను తాము వేరుచేసుకోవడం, ట్రిగర్ శబ్దం నుండి దూరంగా వెళ్లడం, లేదా ట్రిగ్గర్ల సంభావ్యత ఉండే పరిస్థితులను తప్పించుకోవడం
- బెదిరిపోవడం, ఆలోచనల్లో కూరుకుపోవడం - చిక్కుకున్నట్లు అనిపించడం, నిస్సహాయత ఆలోచనలు రావడం లేదా ఒక ట్రిగ్గర్ నుండి తప్పించుకోలేనప్పుడు భయాందోళన చెందడం
- విపరీత ధోరణులు - గట్టిగా అరవడం, నెట్టెయ్యడం, కొట్టడం, వస్తువులను విసిరేయడం లేదా (అరుదుగా పెద్దవారిలో) హింసాత్మకంగా మారడం
మూలాలు
[మార్చు]- ↑ Palumbo DB, Alsalman O, De Ridder D, Song JJ, Vanneste S (2018-06-29). "Misophonia and Potential Underlying Mechanisms: A Perspective". Frontiers in Psychology. 9: 953. doi:10.3389/fpsyg.2018.00953. PMC 6034066. PMID 30008683.
- ↑ Jastreboff MM, Jastreboff PJ (2001). "Components of decreased sound tolerance: hyperacusis, misophonia, phonophobia" (PDF). ITHS News: 5–7. Archived (PDF) from the original on 16 February 2023.
- ↑ Schröder A, Vulink N, Denys D (23 January 2013). "Misophonia: diagnostic criteria for a new psychiatric disorder". PLOS ONE. 8 (1): e54706. Bibcode:2013PLoSO...854706S. doi:10.1371/journal.pone.0054706. PMC 3553052. PMID 23372758.
- ↑ 4.00 4.01 4.02 4.03 4.04 4.05 4.06 4.07 4.08 4.09 4.10 4.11 4.12 4.13 (2022). "Consensus Definition of Misophonia: A Delphi Study".Swedo SE, Baguley DM, Denys D, Dixon LJ, Erfanian M, Fioretti A, et al. (2022).
- ↑ Swedo SE, Baguley DM, Denys D, Dixon LJ, Erfanian M, Fioretti A, Jastreboff PJ, Kumar S, Rosenthal MZ, Rouw R, Schiller D, Simner J, Storch EA, Taylor S, Werff KR, Altimus CM, Raver SM (2022). "Consensus Definition of Misophonia: A Delphi Study". Frontiers in Neuroscience. 16: 841816. doi:10.3389/fnins.2022.841816. PMC 8969743. PMID 35368272.
- ↑ Taylor S (June 2017). "Misophonia: A new mental disorder?". Medical Hypotheses. 103: 109–117. doi:10.1016/j.mehy.2017.05.003. PMID 28571795.
- ↑ Brout JJ, Edelstein M, Erfanian M, Mannino M, Miller LJ, Rouw R, Kumar S, Rosenthal MZ (2018). "Investigating Misophonia: A Review of the Empirical Literature, Clinical Implications, and a Research Agenda". Frontiers in Neuroscience (in English). 12: 36. doi:10.3389/fnins.2018.00036. PMC 5808324. PMID 29467604.
{{cite journal}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Ferrer-Torres A, Giménez-Llort L (June 2022). "Misophonia: A Systematic Review of Current and Future Trends in This Emerging Clinical Field". International Journal of Environmental Research and Public Health. 19 (11): 6790. doi:10.3390/ijerph19116790. PMC 9180704. PMID 35682372.
- ↑ Henry JA, Theodoroff SM, Edmonds C, Martinez I, Myers PJ, Zaugg TL, Goodworth MC (September 2022). "Sound Tolerance Conditions (Hyperacusis, Misophonia, Noise Sensitivity, and Phonophobia): Definitions and Clinical Management". American Journal of Audiology. 31 (3): 513–527. doi:10.1044/2022_AJA-22-00035. PMID 35858241.
- ↑ (August 2024). "A social cognition perspective on misophonia".
- ↑ Jacquemin L, Schecklmann M, Baguley DM (2024). "Hypersensitivity to Sounds". In Schlee W, Langguth B, De Ridder D, Vanneste S, Kleinjung T, Møller AR (eds.). Textbook of Tinnitus (in ఇంగ్లీష్). Cham: Springer International Publishing. pp. 25–34. doi:10.1007/978-3-031-35647-6_3. ISBN 978-3-031-35647-6.
- ↑ Jastreboff PJ (2024). "The Neurophysiological Model of Tinnitus and Decreased Sound Tolerance". In Schlee W, Langguth B, De Ridder D, Vanneste S (eds.). Textbook of Tinnitus (in ఇంగ్లీష్). Cham: Springer International Publishing. pp. 231–249. doi:10.1007/978-3-031-35647-6_20. ISBN 978-3-031-35647-6.
- ↑ (23 January 2013). "Misophonia: diagnostic criteria for a new psychiatric disorder".Schröder A, Vulink N, Denys D (23 January 2013).
- ↑ (August 2021). "Misokinesia is a sensitivity to seeing others fidget that is prevalent in the general population".
- ↑ (September 2023). "Misophonia: A Review of the Literature and Its Implications for the Social Work Profession".
- ↑ (2024-07-02). "For Whom the Bell Tolls: Misophonia as a complex experience of hope and dread in self-with-other regulation".
- ↑ (October 2024). ""How Can I Get Out of This?": A Qualitative Study of the Phenomenology and Functional Impact of Misophonia in Youth and Families".
- ↑ 18.0 18.1 (June 2022). "Misophonia: A Systematic Review of Current and Future Trends in This Emerging Clinical Field".Ferrer-Torres A, Giménez-Llort L (June 2022).
- ↑ "Going to School with Misophonia: Some schooling on a rare disorder". Psychology Today. 2013-09-09. Retrieved 2024-11-10.
- ↑ "Misophonia at School: Disability Accommodations". SoQuiet. Retrieved 2024-11-10.
- ↑ (2023-03-28). "The central role of symptom severity and associated characteristics for functional impairment in misophonia".
- ↑ (October 2024). "Prevalence of Misophonia in Adolescents and Adults Across the Globe: A Systematic Review".
- ↑ (July 2024). "Prevalence, phenomenology, and impact of misophonia in a nationally representative sample of U.S. adults".
- ↑ (2022-11-21). "Prevalence and clinical correlates of misophonia symptoms in the general population of Germany".
- ↑ (August 2021). "The prevalence and characteristics of misophonia in Ankara, Turkey: population-based study".
- ↑ (2021-09-29). "Development and Initial Validation of the Duke Misophonia Questionnaire".
- ↑ (August 2021). "Misokinesia is a sensitivity to seeing others fidget that is prevalent in the general population".Jaswal SM, De Bleser AK, Handy TC (August 2021).
- ↑ Vitoratou, Silia; Uglik-Marucha, Nora; Hayes, Chloe; Gregory, Jane (2021-10-28). "Listening to People with Misophonia: Exploring the Multiple Dimensions of Sound Intolerance Using a New Psychometric Tool, the S-Five, in a Large Sample of Individuals Identifying with the Condition". Psych (in ఇంగ్లీష్). 3 (4): 639–662. doi:10.3390/psych3040041. ISSN 2624-8611.
- ↑ Vitoratou, Silia (2023-01-04). "Misophonia in the UK: Prevalence and Norms for the S-Five in a UK Representative Sample, 2020-2022". [Data Collection]. Colchester, Essex: UK Data Service. doi:10.5255/UKDA-SN-856149.
- ↑ Vitoratou S, Hayes C, Uglik-Marucha N, Pearson O, Graham T, Gregory J (2023-03-22). "Misophonia in the UK: Prevalence and norms from the S-Five in a UK representative sample". PLOS ONE. 18 (3): e0282777. Bibcode:2023PLoSO..1882777V. doi:10.1371/journal.pone.0282777. PMC 10032546. PMID 36947525.