మిస్టర్ భరత్
స్వరూపం
| మిస్టర్ భరత్ (1986 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | రాజాచంద్ర |
|---|---|
| తారాగణం | శోభన్ బాబు , సుహాసిని , శారద, డా.రాజశేఖర్ |
| సంగీతం | ఇళయరాజా |
| నిర్మాణ సంస్థ | ముద్దు ఆర్ట్ మూవీస్ |
| భాష | తెలుగు |
మిస్టర్ భరత్ హిందీ లో బాగా హిట్టైన 'త్రిశూల్' సినిమా ఆధారంగా రూపొందిన తెలుగు చిత్రమిది. రాజాచంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం లో శోభన్ బాబు ,సుహాసిని, శారద, రాజశేఖర్ , రజని ముఖ్య పాత్రలు పోషించారు. ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు. ముద్దు ఆర్టు మూవీస్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం,1986 లో విడుదలైనది.[1]
తారాగణం
[మార్చు]- శోభన్ బాబు
- సుహాసిని
- శారద
- డాక్టరు రాజశేఖర్
- రజని
- చరణ్ రాజ్
- గొల్లపూడి మారుతీరావు
- రంగనాథ్
- సాయికుమార్
- పి.జె.శర్మ
- హేమసుందర్
- కె.కె.శర్మ
- భీమేశ్వరరావు
- మదన్ మోహన్
- వీరభద్రరావు
- రాఘవయ్య
- ఏచూరి
- కె.విజయ
- అనురాధ
- సింధూరి .
- కైకాల సత్యనారాయణ
సాంకేతిక వర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాజాచంద్ర
- సంగీతం: ఇళయరాజా
- గీత రచయితలు: వేటూరి సుందర రామమూర్తి, రాజశ్రీ
- నేపథ్య గానం:శిష్ట్లా జానకి, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం
- మాటలు: గణేష్ పాత్రో
- కళ: చలం
- నృత్యాలు: చిన్ని ప్రకాష్
- కూర్పు: డి.రాజగోపాల్
- ఫైట్స్: జూడొరత్నం
- నిర్మాత: జయకృష్ణ
- నిర్మాణ సంస్థ: ముద్దు ఆర్ట్ మూవీస్
- విడుదల:1986.
పాటల జాబితా
[మార్చు]- కన్నతండ్రి నీవే రేపు అమ్మ కథకు నీవే తీర్పు, రచన: వేటూరి, గానం.ఎస్.జానకి
- మహారాజ యువరాజ మహారాజ రవితేజా తమ తేజం చూసి, రచన: వేటూరి, గానం. ఎస్ . పి బాలసుబ్రహ్మణ్యం
- సరాసరి ఇలా వచ్చి ప్రేమించకు పదేపదే, రచన: వేటూరి, గానం.ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్ .జానకి
- ఇరువయసుల అల మలుపుల కురిసిన, రచన: రాజశ్రీ, గానం.ఎస్. జానకి, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
- పచ్చిమిరప అయ్యో కారంలేదా మామగారికి మంచిమనసే లేదా, రచన: వేటూరి, గానం.వాణి జయరాం, ఎస్ .పి. బాలసుబ్రహ్మణ్యం
- ఏరా చిట్టికన్నా రారా పిచ్చికన్నా ఓరి పిచ్చికన్నా తెలుసుకో, రచన: వేటూరి, గానం.ఎస్ . జానకి
- చెల్లిస్తా తల్లిమాట చేసుకొన్న శపథం, రచన: వేటూరి, గానం.ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం .
మూలాలు
[మార్చు]- ↑ "Mr Bharat (1986)". Indiancine.ma. Retrieved 2025-08-22.