మీడియావికీ చర్చ:Anonnotice

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గ్రామం పేజీలగురించి సైట్ నోటీస్ పై అభిప్రాయాలు[మార్చు]

వాడుకరి:రహ్మానుద్దీన్ గారు ప్రవేశ పెట్టిన ప్రకటన వికీపై దురభిప్రాయం కలిగించగలదు. ఎందుకంటే సాధారణంగా వికీలో ప్రకటనలు కనబడవు. మొదటి పేజీ లో స్వాగతం లింకు ద్వారా గ్రామపు పేజీలకు సంబంధించిన వివరానికి సులభంగా చేరుకోవచ్చు. గ్రామపు వివరాలు ఎవరైనా చేర్చినా వాటికి ఆధారాలు అంత సులభంగా దొరకవు. మన భావోద్వేగాలను సంతృప్తిపరుస్తుంది తప్పితే దీనివలన అంత ఉపయోగంలేదు కావున దీనిని తొలగించాలని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 07:59, 14 అక్టోబర్ 2013 (UTC)

పురస్కార ప్రకటన[మార్చు]

ప్రవేశించిన సభ్యులకు కనబడే ప్రకటన ను ఒక వారం పొడిగించినందున. ఇక్కడ కూడా పొడిగించుతున్నాము.--అర్జున (చర్చ) 11:07, 9 డిసెంబర్ 2013 (UTC)

మొబైల్ వాడుకరులను దృష్టిలో పెట్టుకొని సందేశాలుండాలి.[మార్చు]

టేబ్లెట్ వాడేవారికి తెలుగు కీబోర్డు సంబంధించిన సందేశాలు ప్రత్యేకంగా వుండాలి. మీడియావికీ:Anonnotice లో CTRL+M నొక్కి తెలుగు టైపుచేయండి లాంటి సందేశాలు సరికాదు. అటువంటి వాటిని డెస్క్టాప్ వాడుకరులకి మాత్రమే పరిమితంచేయాలి.--అర్జున (చర్చ) 06:20, 2 ఏప్రిల్ 2015 (UTC)

కొత్త ప్రతిపాదన (ఖాతా లో ప్రవేశించని వారికి)[మార్చు]

సహాయం కావాలి.
దీనిని ఉపయోగించటానికి తగిన చర్చా పేజీలో, తగు శీర్షికతో కొత్త విభాగం ప్రారంభించి దానిలో {{సహాయం కావాలి}} ముూస చేర్చి ఆతరువాత మీ సందేహాన్ని లేక సమస్యను వివరించండి. ఒకవేళ కొంతమంది సభ్యులకు (ఉదాహరణకు మీకు సందేహమున్న పేజీలో చర్చావిషయమైన మార్పుని చేర్చినవారు, లేక మీ దృష్టిలో విషయంపై నైపుణ్యం కలవారు) ప్రత్యేకంగా తెలియచేయదలచుకుంటే వివరణలో ఆ సభ్యుల పేర్లకు వికీలింకులు చేర్చటం ద్వారా వారికి వికీ సూచనల వ్యవస్థ(ఎకో) ద్వారా సందేశాలు పంప వీలుంది.
ఈ లోపల సహాయ సూచికను , సహాయం చేయబడిన పేజీలను , సహాయం కొరకు ప్రయత్నించి విఫలం అయిన పేజీలను, తరచూ అడిగే ప్రశ్నలను చూడండి.

  • సహాయపడే వారికి గమనిక: మీరు నిర్వాహకులు కాకపోతే సహాయం చేసిన తరువాత {{సహాయం కావాలి}} మూసను మార్చవద్దు. సహాయం కోరిన వ్యక్తి గాని, స్పందన తరువాత నిర్వాహకులు మూసను {{సహాయం చేయబడింది}} తో మార్చవలెను. వారం రోజులలోగా స్పందనలు లేకపోతే {{సహాయం కావాలి-విఫలం}} తో మార్చి అలా మార్చినట్లు వ్యాఖ్య చేర్చండి.
ప్రస్తుత ప్రకటన

వికీపీడియాలో మీరు కూడా రాయొచ్చు! రాయండి!!

తెలుగులో టైపుచెయ్యడం తెలీదా? టైపింగు సహాయం చూడండి.

ప్రతిపాదిత ప్రకటన
తెలివైన కీ బోర్డు కొరకు ఏ వ్యవస్థలోనైనా గూగుల్ క్రోమ్ విహరిణి వాడుకరుల పద్ధతి, విండోస్ వాడుకరుల పద్ధతి చూడండి.
ఎందుకు మార్చాలి?
  • ప్రస్తుత ప్రకటన ఎక్కువ స్థలం ఆక్రమిస్తున్నది. పాత కఠినమైన పద్ధతికి సంబంధించినది.
  • తెలివైన కీ బోర్డు ల గురించి తెలియచేస్తుంది.

వ్యతిరేకత ఏమైనా వుంటే, లేక ప్రతిపాదన మెరుగుచేయటానికి ఒక వారంలోగా సహకరించండి. --అర్జున (చర్చ) 22:35, 4 సెప్టెంబరు 2019 (UTC)

రాసిన ప్రకటన పాఠ్యం అర్థం కావట్లేదు, మార్చాలి. ముందు సందర్భం చెప్పాలి. తరువాత లింకుల గురించి సూటిగా అర్థమయ్యేలా చెప్పాలి.__చదువరి (చర్చరచనలు) 04:46, 5 సెప్టెంబరు 2019 (UTC)
చదువరి గారికి, మీ స్పందనకు ధన్యవాదాలు. వాక్యం ఈ క్రింద విధంగా మారిస్తే అర్ధమవుతుందా?
సులభంగా ఆంగ్లాక్షరాలు వాడి తెలుగు టైపు చెయ్యుటకు ఏ కంప్యూటర్ వ్యవస్థలోనైనా గూగుల్ క్రోమ్ విహరిణి వాడుకరులకు పద్ధతి, లేక విండోస్ లో వాడుకరుల పద్ధతి.
ఇది ప్రకటన కాబట్టి మరింతగా తెలుసుకొనటానికి వీక్షకులు లింకులు చూస్తారు, మొదటి లింకులో వీడియో కూడా చేర్చబడినది. మీరు ఇంకొంత మెరుగుచేసే ప్రయత్నం చెయ్యమని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 05:41, 5 సెప్టెంబరు 2019 (UTC)
"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, విండోస్ కంప్యూటరులో ఈ పద్ధతిని వాడవచ్చు. విండోస్‌తో సహా కంప్యూటరు ఏదైనా సరే, మీ క్రోమ్ బ్రౌజరులో ఈ పద్ధతిని వాడవచ్చు." అర్జున గారూ, దీన్ని పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 09:49, 5 సెప్టెంబరు 2019 (UTC)
చదువరి గారికి, బాగుంది, ఇంకొంచె మెరుగు చేశాను
"తెలుగు టైపులో తప్పులు కంప్యూటర్ తానంతటదే సరిచేసే పద్ధతి కొరకు, విండోస్ కంప్యూటరులో ఈ పద్ధతిని వాడవచ్చు. విండోస్‌తో సహా కంప్యూటరు ఏదైనా సరే, మీ క్రోమ్ బ్రౌజరులో ఈ పద్ధతిని వాడవచ్చు."
ఎలా వుందంటారు?--అర్జున (చర్చ) 04:43, 6 సెప్టెంబరు 2019 (UTC)
"తెలుగు టైపులో తప్పులు కంప్యూటర్ తానంతటదే సరిచేసే పద్ధతి కొరకు మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
అర్జున గారూ, "సరిచేసే పద్ధతి" అనేది సరిగ్గా లేదు. ఏదో తప్పు జరిగితే సరిచేస్తుంది అన్నట్టుగా ఉంది. దాన్ని మార్చాలి.__చదువరి (చర్చరచనలు) 04:15, 13 సెప్టెంబరు 2019 (UTC)

──────────── చదువరి గారికి, నేను అర్ధం చేసుకున్నదాని బట్టి ఆ వాక్యం సరిగా వుంది. మీకు అర్ధమైనదాని ప్రకారం మెరుగైనదేదైనా ప్రతిపాదించండి. --అర్జున (చర్చ) 05:17, 13 సెప్టెంబరు 2019 (UTC)

అర్జున గారూ, నాకు అర్థమైనది నేను చెప్పాను. మెరుగు అనుకున్నది ఈసరికే ప్రతిపాదించాను.__చదువరి (చర్చరచనలు) 05:25, 13 సెప్టెంబరు 2019 (UTC)
చదువరి గారికి, మీ స్పందనకు ధన్యవాదాలు, నా చివరి సవరణ తెలుగు టైపు అంటే సాధారణంగా తప్పులు జరుగుతాయేమోనన్న అభిప్రాయం ఉండేవారికి మరింత ధైర్యమిచ్చేదిగా వుంటుందని అనుకున్నాను. సరే ఇతర సభ్యులు, నిర్వాహకులు ( వీవెన్,

రాజశేఖర్, వాడుకరి:విశ్వనాధ్.బి.కె., చంద్ర కాంత రావు, రవిచంద్ర, t.sujatha, కె.వెంకట రమణ, రహ్మానుద్దీన్, పవన్ సంతోష్, ప్రణయ్ రాజ్, స్వరలాసిక, యర్రా రామారావు) స్పందనను బట్టి చివరి నిర్ణయం చేస్తాను.--అర్జున (చర్చ) 06:23, 14 సెప్టెంబరు 2019 (UTC)

ప్రతిపాదనలపై స్పందన[మార్చు]

అనామిక వాడుకరులకు తెలుగు టైపు గురించి తెలుగు వికీపీడియా పేజీలో పై భాగాన కనబడే ప్రకటన ప్రతిపాదనలలో మీకు ఇష్టమైన దాని క్రింద సంతకం చేయండి. ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 06:33, 14 సెప్టెంబరు 2019 (UTC)

ప్రతిపాదన 1: "తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మద్దతు

<పైన # తో సంతకం చేర్చండి>

  1.   ఇది బావుంది. ఎందుకంటే - తప్పులు తానంతట తానే సరిజేసే - అంటే నకారాత్మకంగా ధ్వనిస్తోంది. అంతకన్నా సులువు అన్న పదం బావుంది. --పవన్ సంతోష్ (చర్చ) 02:16, 15 సెప్టెంబరు 2019 (UTC)

ప్రతిపాదన 2: "తెలుగు టైపులో తప్పులు కంప్యూటర్ తానంతటదే సరిచేసే పద్ధతి కొరకు మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మద్దతు

<పైన # తో సంతకం చేర్చండి>

ఇతరాలు, వ్యాఖ్యలు

<పైన # తో వ్యాఖ్య చేర్చి సంతకం చేర్చండి>