మీనల్ దఖావే భోసలే
This article needs more links to other articles to help integrate it into the encyclopedia. (ఏప్రిల్ 2025) |
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
మీనల్ దఖావే భోసలే భారతదేశానిని చెందిన వైరాలజిస్ట్. ఆమె ఒక బిడ్డకు జన్మనివ్వటానికి కేవలం కొద్ది గంటల ముందు, దేశీయంగా కరోనావైరస్ టెస్టింగ్ (పరీక్ష పరికరం) ను తయారు చేసి అందించింది[1]. ఆమె పుణెలోని మైల్యాబ్స్ డిస్కవరీ సొల్యూషన్స్ కంపెనీలో పరిశోధన, అభివృది విభాగం అధిపతిగా పనిచేస్తుంది. తాను నిండు గర్భిణినని తెలిసినా, దేశానికి సేవ చేయడమే తొలి కర్తవ్యంగా భావించింది. నాలుగు నెలల్లో జరగాల్సిన కిట్ అభివృద్ధి ప్రక్రియను 6 వారాల్లో పూర్తిచేసింది. 2020 ఏప్రిల్ 18న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ) పరిశీలన కోసం కిట్‌ను పంపింది. ఆ మరునాడే ఆమె ఆడ శిశువుకు జన్మనిచ్చింది. మిగతా అనుమతులన్నీ లభించడంతో మైల్యాబ్స్‌కు చెందిన కరోనా కిట్ 2020 మార్చి 26న మార్కెట్లోకొచ్చింది. [2]. ఫ్లూ లక్షణాలు గల రోగులకు కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్ ఉందా, లేదా అనేది నిర్ధారించటానికి మరింత ఎక్కువ మందికి పరీక్షలు చేయవచ్చుననే ఆశలను ఇది పెంచింది. ఒక్కో టెస్టు కిట్ ధర 1,200 రూపాయలు. దానితోపాటుగా ఒక్కో టెస్టు కిట్ తో 100 సాంపిల్స్ ని టెస్టు చేయవచ్చు[3][4].
జీవిత విశేషాలు
[మార్చు]ఆమె 1988 నవంబరు 8 న భారతదేశంలోని మహారాష్ట్రకు చెందిన పూణేలో జన్మించింది. ఆమె పూణేలోని అహిల్యదేవి హైస్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించింది. తదుపరి చదువుల కోసం పూణే విశ్వవిద్యాలయంలో చేరింది. 2009 లో, ఆమె నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో పనిచేయడం ప్రారంభించింది. 2014 లో ఆమె మైలాబ్ లైఫ్ సొల్యూషన్స్‌లో చేరింది. అక్కడ ఆమె ఆర్ అండ్ డి ల్యాబ్ అధిపతిగా పనిచేస్తోంది.[5]
వ్యక్తిగత జీవితం
[మార్చు]మినల్ దఖవే భోస్లే 2017 మే 31న ప్రవీణ్ భోంస్లేను వివాహం చేసుకుంది. పూణే ఆధారిత సంస్థకు పరిశోధన & అభివృద్ధి చీఫ్‌గా కృషిచేసిన ఆమె గూర్చి 2020 మార్చి 28 న బి.బి.సిలో "కరోనావైరస్: భారతదేశం యొక్క మొదటి టెస్టింగ్ కిట్ వెనుక ఉన్న మహిళ" పేరుతో ఒక కథనం ప్రచురితమైంది.[6]
మూలాలు
[మార్చు]- ↑ పాండే, గీతా (2020-03-29). "కరోనావైరస్: తొలి మేడిన్ ఇండియా టెస్టింగ్ కిట్ తయారు చేసిన భారతీయ శాస్త్రవేత్త". BBC News తెలుగు. Retrieved 2020-04-05.
- ↑ "త్యాగమూర్తివమ్మా!!". www.andhrajyothy.com. Retrieved 2020-04-05.
- ↑ "బిడ్డ డెలివరీకన్నా ముందే కరోనా టెస్టు కిట్ ను దేశానికి డెలివరీ చేసిన సైంటిస్ట్". Asianet News Network Pvt Ltd. Retrieved 2020-04-05.
- ↑ "నిండు గర్భిణీ.. అయినా ఆరువారాల్లో." (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-04-05.[permanent dead link]
- ↑ wikiandbio (2020-03-29). "Meenal Dakhawe Bhosle Biography,age,networth, education" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-04-05.[permanent dead link]
- ↑ Pandey, Geeta (2020-03-28). "'I delivered test kit project, then delivered my baby'". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2020-04-05.
బాహ్య లంకెలు
[మార్చు]- All articles with dead external links
- CS1 బ్రిటిష్ ఇంగ్లీష్-language sources (en-gb)
- Articles with too few wikilinks from ఏప్రిల్ 2025
- All articles with too few wikilinks
- Articles covered by WikiProject Wikify from ఏప్రిల్ 2025
- All articles covered by WikiProject Wikify
- అనాథ పేజీలు
- అన్ని అనాథ పేజీలు
- Pages using age template with invalid date
- 1988 జననాలు
- జీవిస్తున్న ప్రజలు
- మహిళా వైద్యులు
- భారతీయ వైద్యులు
- మహారాష్ట్ర వ్యక్తులు
- భారతదేశ ఆవిష్కర్తలు