Jump to content

మీనా సింగ్ (రాజకీయ నాయకురాలు)

వికీపీడియా నుండి
మీనా సింగ్

పదవీ కాలం
2020 ఏప్రిల్ 21 – 2023 డిసెంబరు 25

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2008
నియోజకవర్గం మన్పూర్
పదవీ కాలం
2003 – 2008
నియోజకవర్గం నౌరోజాబాద్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయురాలు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం బెల్సారా గ్రామం, ఉమరియా జిల్లా

మీనా సింగ్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె మధ్యప్రదేశ్ శాసనసభకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై షెడ్యూల్డ్ కులాలు/షెడ్యూల్డ్ తెగల సంక్షేమ శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టింది.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

మీనా సింగ్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2003 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో నౌరోజాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి జ్ఞానవంతి సింగ్‌పై 20978 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[2] ఆమె 2008 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో మన్పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి జ్ఞానవంతి సింగ్‌పై 17,704 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[3]

మీనా సింగ్ 2013 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి జ్ఞానవంతి సింగ్‌పై 43,628 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[4] మీనా సింగ్ 2018 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో మన్పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి జ్ఞానవంతి సింగ్‌పై 18,655 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[5] 2020 ఏప్రిల్ 21 నుండి 2023 డిసెంబరు 25 వరకు షెడ్యూల్డ్ కులాలు/షెడ్యూల్డ్ తెగల సంక్షేమ శాఖ మంత్రిగా పని చేసింది.[1]

మీనా సింగ్ 2023 మధ్యప్రదేశ్ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి తిలక్ రాజ్ సింగ్‌పై 25,265 ఓట్ల మెజారిటీతో ఐదవసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[6][7]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "After Running Solo Show for Almost a Month, Shivraj Gets Mini Cabinet of 5 Ministers Amid Pandemic". News18.com. 21 April 2020. Retrieved 8 April 2021.
  2. "Statistical Report on General Election, 2003 to the Legislative Assembly of Madhya Pradesh". Election Commission of India. Retrieved 22 December 2021.
  3. "Madhya Pradesh Vidhan Sabha General Elections - 2008 (in Hindi)" (PDF). Chief Electoral Officer, Madhya Pradesh website. Retrieved 7 March 2011.
  4. CEO Madhyapradesh (2013). "Madhya Pradesh Assembly Election Results 2013 Complete Winners List" (PDF). Archived from the original (PDF) on 17 February 2023. Retrieved 17 February 2023.
  5. India Today (12 December 2018). "Madhya Pradesh election results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2023. Retrieved 17 February 2023.
  6. "Madhya Pradesh Election Results 2023 - Manpur". Election Commission of India. 3 December 2023. Archived from the original on 4 March 2025. Retrieved 4 March 2025.
  7. "Manpur Constituency Election Results 2023" (in ఇంగ్లీష్). The Times of India. 3 December 2023. Archived from the original on 4 March 2025. Retrieved 4 March 2025.