మీనా (1973 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు సినిమా నటి మీనా గురించి మీనా వ్యాసం చూడండి.

మీనా
(1973 తెలుగు సినిమా)
Meena (1973) Poster Design.jpg
సినిమా పోస్టర్
దర్శకత్వం విజయనిర్మల
తారాగణం కృష్ణ, విజయనిర్మల, చంద్రకళ
సంగీతం రమేష్ నాయుడు
నిర్మాణ సంస్థ విజయకృష్ణ ఫిల్మ్స్
భాష తెలుగు

మీనా 1973, డిసెంబర్ 28న విడుదల అయిన తెలుగు సినిమా. ఇది యద్దనపూడి సులోచనారాణి రాసిన మీనా (నవల) ఆధారంగా నిర్మించబడింది. విజయకృష్ణ ఫిలింస్ పతాకం కింద పి.వి. రమణయ్య, జి.పి. మల్లయ్య లు నిర్మించిన ఈ సినిమాకు విజయ నిర్మల దర్శకత్వం వహించింది. ఈ సినిమాలోని పాటలను ఆచార్య ఆత్రేయ, ఆరుద్ర, దాశరధి లు రచించారు. ఈ సినిమాకు రమేష్ నాయుడు సంగీనాన్నందించాడు. [1]

నటీనటులు[మార్చు]

  • ఘట్టమనేని కృష్ణ
  • విజయనిర్మల
  • కొంగర జగ్గయ్య
  • గుమ్మడి వెంకటేశ్వరరావు
  • అల్లు రామలింగయ్య
  • సాక్షి రంగారావు
  • రామమోహన్
  • చంద్రకళ
  • ఎస్.వరలక్ష్మి
  • సూర్యకాంతం
  • ఛాయాదేవి
  • రమాప్రభ
  • నిర్మలమ్మ
  • సత్తిబాబు
  • రేలంగి వెంకటరామయ్య
  • మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి

సాంకేతిక వర్గం[మార్చు]

  • కథ: యద్దనపూడి సులోచనా రాణి
  • స్క్రీన్ ప్లే: విజయ నిర్మల
  • సాహిత్యం: దాశరథి, ఆత్రేయ, ఆరుద్ర
  • సంగీతం: రమేష్ నాయుడు
  • ప్లే బ్యాక్: ఎస్.పి. బాలసుబ్రహ్మణం, పి. సుశీల, ఎల్.ఆర్ అంజలి, రఘురాం, విజయ నిర్మల
  • నిర్మాతలు: పీవీ రమణయ్య, జీపీ మల్లయ్య
  • దర్శకత్వం: విజయ నిర్మల

పాటలు[మార్చు]

పాట రచయిత సంగీతం గాయకులు
శ్రీరామ నామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి ఆరుద్ర రమేష్ నాయుడు పి.సుశీల
మల్లెతీగ వంటిది మగువ జీవితం చల్లని పందిరివుంటే అల్లుకుపోయేను దాశరథి రమేష్ నాయుడు పి.సుశీల
పెళ్ళంటే నూరేళ్ళపంట అది పండాలీ కోరుకున్న వారి ఇంట రమేష్ నాయుడు బాలు

మూలాలు[మార్చు]

  1. "Meena (1973)". Indiancine.ma. Retrieved 2023-01-22.

ఆధారాలు[మార్చు]

  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.