మీరా శంకర్
మీరా శంకర్ | |
|---|---|
2010లో అమెరికా–భారత్ పీపుల్ టు పీపుల్ కాన్ఫరెన్స్‌లో మీరా శంకర్ | |
మీరా యాదవ్ 1950 అక్టోబరు 9 | |
| వృత్తి | దౌత్యవేత్త |
| అమెరికాలో భారత రాయబారి | |
| In office 2009–2011 | |
| అంతకు ముందు వారు | రోనెన్ సేన్ |
| తరువాత వారు | నిరుపమా రావు |
మీరా శంకర్ (జన్మనామం: యాదవ్) 26 ఏప్రిల్ 2009 నుండి 2011 వరకు భారతదేశం తరఫున యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో రాయబారిగా సేవలందించారు.[1] ఆమె 26 ఏప్రిల్ 2009న బాధ్యతలు స్వీకరించి,[2] 2011 వరకు ఆ పదవిలో కొనసాగారు.
ఆమె యునైటెడ్ స్టేట్స్‌లో భారతదేశానికి రెండవ మహిళా రాయబారి. మొదటిగా ఆ పదవిని నిర్వహించినది విజయలక్ష్మీ నెహ్రూ పండిట్. ఆమె తరువాత 1 ఆగస్టు 2011న నిరుపమా రావు ఆ బాధ్యతలు స్వీకరించారు.
శంకర్ 1973 బ్యాచ్‌కు చెందిన అధికారిణి. ఆమె 1991 నుండి 1995 వరకు వాషింగ్టన్, డి.సి.లో సేవలందించారు. ఆమె ముందు రాయబారి రోనెన్ సేన్ ఉన్నారు.
ప్రారంభ జీవితం, వృత్తి
[మార్చు]మీరా శంకర్ నైనిటాల్ లోని సెయింట్ మేరీస్ కాన్వెంట్ పాఠశాలలో చదువుకున్నారు. తరువాత షిమ్లా లోని సెయింట్ బీడ్స్ కాలేజీలో పట్టభద్రురాలై, 1973లో భారత విదేశీ సేవలో చేరారు.
ఆమె 1985 నుండి 1991 వరకు భారత ప్రధాన మంత్రి కార్యాలయంలో డైరెక్టర్‌గా పనిచేశారు. అనంతరం 1991 నుండి 1995 వరకు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖలో పనిచేశారు.
తరువాత విదేశాంగ మంత్రిత్వ శాఖలో పనిచేస్తూ, సార్క్, నేపాల్, భూటాన్ దేశాలతో సంబంధాలపై పనిచేసే విభాగాలను ఆమె నేతృత్వం వహించారు.
2009కి ముందు, ఆమె జర్మనీలోని బెర్లిన్ నగరంలో భారతదేశ రాయబారిగా పనిచేశారు.
శంకర్, జి. శంకర్ బజ్‌పాయ్ తరువాత రెండు దశాబ్దాలకుపైగా కాలం తరువాత వాషింగ్టన్‌లో నియమితులైన తొలి సేవలో ఉన్న దౌత్యవేత్త. 2003లో ఆమె అదనపు కార్యదర్శి (Additional Secretary) హోదాను పొందారు. ఈ హోదాలో ఆమె ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ భద్రతకు సంబంధించిన బాధ్యతలను నిర్వహించారు.
ఇతర కార్యకలాపాలు
[మార్చు]శంకర్ డోయిచ్ బ్యాంక్ కు చెందిన ఆల్‌ప్రెడ్ హెర్ హాసన్ గెసెల్ల్ షాప్ట్ ట్రస్టీల బోర్డులో సభ్యురాలిగా ఉన్నారు.[3]
2012లో, భారతీయ కాంగ్లొమెరేట్ సంస్థ ఐటీసీ డైరెక్టర్ల బోర్డులో సభ్యురాలిగా చేరిన తొలి మహిళగా నిలిచారు.[4]
వ్యక్తిగత జీవితం
[మార్చు]శంకర్ 1973 బ్యాచ్‌కు చెందిన IAS అధికారి అజయ్ శంకర్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ప్రియా అనే ఒక కుమార్తె ఉంది.[5]
వివాదాలు
[మార్చు]2010 డిసెంబర్‌లో జాక్సన్–ఎవర్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శంకర్‌పై భద్రతా తనిఖీల భాగంగా శరీర తనిఖీ (pat-down) నిర్వహించబడిన ఘటన వార్తల్లో నిలిచింది. దీంతో అమెరికా విమానాశ్రయాలలో భారత ప్రముఖుల తనిఖీలు జాబితాలో ఆమె కూడా చేరారు.
ఈ సంఘటన భారతదేశం నుండి దౌత్యపరమైన నిరసనలకు దారితీసింది.[6]
ఇంకా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Meera shankar. "Meera shankar". Retrieved 2012-10-14.
- ↑ "Welcome to Embassy of India, Washington D C, USA". Indian Embassy, Washington. Archived from the original on 15 April 2015. Retrieved 2015-04-14.
- ↑ Board of Trustees Archived 20 ఆగస్టు 2018 at the Wayback Machine Alfred Herrhausen Gesellschaft of డోయిచ్ బ్యాంక్.
- ↑ Mukherjee, Writankar (4 August 2012). "ITC inducts Meera Shankar in its board as the first women ever". The Times Of India. Archived from the original on 13 August 2014. Retrieved 7 August 2017.
- ↑ Scott, Gail (28 March 2011). "Private Indian Couple Dedicates Careers to Public Service". Washington Diplomat. Retrieved 7 August 2017.
- ↑ "After pat-down, US pats Meera". The Economic Times. 11 December 2010. Archived from the original on 14 March 2016. Retrieved 13 March 2016.
బాహ్య లింకులు
[మార్చు]- వీడియో: అమెరికా–భారత్ సంబంధాలపై రాయబారి మీరా శంకర్ ప్రసంగం Asia Society, న్యూయార్క్, ఫిబ్రవరి 19, 2010