మీర్‌పేట్-జిల్లెలగూడ
మీర్‌పేట్-జిల్లెలగూడ | |
---|---|
Coordinates: 17°19′N 78°31′E / 17.32°N 78.52°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Type | నగరపాలక సంస్థ |
• Body | మీర్‌పేట నగరపాలక సంస్థ |
విస్తీర్ణం | |
• Total | 4.2 కి.మీ2 (1.6 చ. మై) |
జనాభా (2011)[1] | |
• Total | 66,982 |
• జనసాంద్రత | 16,000/కి.మీ2 (41,000/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 500097 (మీర్‌పేట) 500079 (జిల్లెలగూడ) |
టెలిఫోన్ కోడ్ | 040 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | మహేశ్వరం శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ |
మీర్‌పేట్-జిల్లెలగూడ అనేది తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర పరిసర ప్రాంతం, రంగారెడ్డి జిల్లాలోని ఒక నగరపాలక సంస్థ.[2][3] మీర్‌పేట్, జిల్లెలగూడ మున్సిపాలిటీల విలీనంతో మీర్‌పేట నగరపాలక సంస్థ ఏర్పడింది.[3]
వ్యుత్పత్తి శాస్త్రం
[మార్చు]కుతుబ్ షాహీ రాజవంశ ఐదవ రాజైన ముహమ్మద్ కులీ కుతుబ్ షా దగ్గర ప్రధానమంత్రిగా పనిచేసిన మీర్ మూమిన్ అస్టర్‌బాడి నిర్మించిన మీర్ మోమిన్ మసీదు కారణంగా ఈ ప్రాంతానికి మీర్‌పేట అనే పేరు వచ్చింది.
గణాంకాలు
[మార్చు]2001 భారత జనాభా లెక్కల ప్రకారం, [4] మీర్‌పేటలో 12,940 జనాభా ఉంది. జనాభాలో పురుషులు 51% మంది, స్త్రీలు 49% మంది ఉన్నారు. మీర్‌పేట్ సగటు అక్షరాస్యత రేటు 63% కాగా, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. పురుషుల అక్షరాస్యత 71% గా, స్త్రీల అక్షరాస్యత 54%గా ఉంది. మీర్‌పేట జనాభాలో 12% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.
2011 జనాభా లెక్కల ప్రకారం, మీర్‌పేట్-జిల్లెలగూడలో 66,982 జనాభా ఉంది. ఇందులో 34,009 మంది పురుషులు, 32,973 మంది స్త్రీలు ఉన్నారు. ఇక్కడి మొత్తం కుటుంబాల సంఖ్య దాదాపు 18,000.
పరిపాలన
[మార్చు]2016 ఏప్రిల్ 11న గ్రామ పంచాయతీలను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా మీర్‌పేట్ మున్సిపాలిటీ, జిల్లెలగూడ మున్సిపాలిటీలు వేర్వేరుగా ఏర్పడ్డాయి. గతంలో మీర్‌పేట్ గ్రామపంచాయతీ జిల్లెల్‌గూడ గ్రామపంచాయతీలో భాగంగా ఉండేది, తర్వాత పరిపాలనాపరంగా వేరు చేయబడింది.[5]
2019లో రెండు మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పోరేషన్‌గా విలీనం చేయబడ్డాయి.[3]
రవాణా
[మార్చు]తెంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్రాంతం నుండి హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. దిల్ సుఖ్ నగర్, మిధాని బస్ డిపోల నుండి బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇక్కడికి సమీపంలోని మలక్‌పేటలో ఎంఎంటిఎస్, ఎల్బీ నగర్‌లో మెట్రో స్టేషన్లు ఉన్నాయి.
దేవాలయాలు
[మార్చు]500 సంవత్సరాల నాటి మత్స్య అవతార కళ్యాణ వేంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Basic Information". Meerpet Corporation. Archived from the original on 2020-07-02. Retrieved 2022-12-09.
- ↑ "District Census Handbook – Rangareddy" (PDF). Census of India. The Registrar General & Census Commissioner. pp. 14, 58. Retrieved 2022-12-09.
- ↑ 3.0 3.1 3.2 "Telangana Election Commissioner directs officials to be prepared for municipal polls". The New Indian Express. Retrieved 2022-12-09.
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2022-12-09.
- ↑ "Five New Civic Bodies Carved out". The New Indian Express. 12 April 2016. Archived from the original on 2016-04-24. Retrieved 2022-12-09.