మీర్ ఆలం మండి
మీర్ ఆలం మండి | |
ప్రదేశం | హైదరాబాదు, తెలంగాణ |
---|---|
రూపకర్త | నిజాం |
రకం | విక్టరి కాలమ్ |
మీర్ ఆలం మండి, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలో పాతబస్తీలో ఉన్న ఒక కూరగాయల మార్కెట్. దాదాపు ఐదెకరాల విస్తీర్ణంలో 200 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ మార్కెట్ లో 43 హోల్‌సేల్ దుకాణాలు, సుమారు 300 మంది వ్యాపారులు ఉన్నారు.[1]
చరిత్ర
[మార్చు]హైదరాబాదును పరిపాలించిన 3వ నిజాం సికిందర్ జా వద్ద 1804 నుండి 1808 వరకు దివానుగా పనిచేసిన మీర్ ఆలం బహదూర్ పేరు మీద మీర్ ఆలం చెరువు నిర్మించబడింది. ఆ చెరువు పక్కనే కూరగాయల తోట కూడా ఉండేది. దాన్ని మీర్ ఆలం మండి అని పిలుస్తున్నారు. 200 ఏళ్ళనాటి ఈ మార్కెట్ శిథిలావస్థకు చేరుకుంది. టిన్ షీట్లు పడిపోవడంతోపాటు కాంక్రీటు ఐడిపోయింది.
ఆధునీకరణ
[మార్చు]తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోని జీహెచ్‌ఎంసీ, కులీకుతుబ్‌షా పట్టణాభివృద్ధి సంస్థ (కుడా)లు ఈ మార్కెట్ ఆధునీకరణకు శ్రీకారం చుట్టాయి. వారసత్వ సంపద దెబ్బతినకుండా 10.50 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దానికి తగిన మరమ్మతులు, ఆధునీకరణ పనులు చేపట్టనున్నారు.[2] ఇందులో భాగంగా మార్కెట్, పరిసర ప్రాంతాల్లో దెబ్బతిన్న క్యాచ్‌పిట్ల మరమ్మతులు, కొత్త క్యాచ్‌పిట్ల ఏర్పాటు, ఎల్‌ఈడీ దీపాలు, మెరుగైన పారిశుధ్య నిర్వహణ, రహదారుల మొదలైనవి ఏర్పాటు చేయనున్నారు.[3] జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించి మార్కెట్‌ను కప్పివుంచిన టిన్ షీట్‌ల కొలతలు తీసుకొని పనులు ప్రారంభించారు.
మూలాలు
[మార్చు]- ↑ Apr 17, TNN /; 2022; Ist, 03:37 (2022-04-17). "Design Finalised For Mir Alam Mandi | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 2022-04-17. Retrieved 2022-10-21.
{{cite web}}
:|last2=
has numeric name (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ "Mir Alam Mandi to be restored at Rs 10.50 crore in Telangana". The New Indian Express. 2022-10-04. Archived from the original on 2022-10-04. Retrieved 2022-10-21.
- ↑ telugu, NT News (2022-10-20). "మీరాలం మండికి పూర్వ వైభవం". Namasthe Telangana. Archived from the original on 2022-10-20. Retrieved 2022-10-21.