మీర్ నజాఫ్ అలీ ఖాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మీర్ నజాఫ్ అలీ ఖాన్, హైదరాబాదు రాజ్య చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మనవడు. ప్రస్తుతం ఇతడు హైదరాబాదు మాజీ సింహాసనం వరుసలో 36వ స్థానంలో ఉన్నాడు. నిజాం ట్రస్టుతోపాటు చివరి నిజాంకు సంబంధించిన అనేక ట్రస్టులను నిర్వహిస్తున్నాడు.[1][2][3]

నిజాం కుటుంబ ప్రాతినిధ్యం[మార్చు]

"హైదరాబాద్ ఫండ్స్ కేసు"లో తమ తరపున ప్రాతినిధ్యం వహించడానికి నిజాం వారసులు ఇతనిని ఎన్నుకున్నారు. చివరి నిజాంకు చెందిన £35 మిలియన్ (2019 లో విలువ) గురించిన ఈ కేసు, ప్రస్తుతం నాట్‌ వెస్ట్ బ్యాంకులో ఉంది.[4][5] పాకిస్తాన్ వాదనను ఏకకాలంలో తోసిపుచ్చడంతో, 2019 అక్టోబరులో రిపబ్లిక్ ఆఫ్ ఇండియా, నిజాం వారసులకు అనుకూలంగా లండన్‌లో ఈ కేసు నిర్ణయించబడింది.[6]

ప్రెస్ సమావేశాలు[మార్చు]

తెలంగాణ రాష్ట్ర పోలీసులకు అభినందన[మార్చు]

2018 సెప్టెంబరు నెలలో నిజాం మ్యూజియం నుండి దొంగిలించబడిన వస్తువులను దొంగతనం జరిగిన వారంలోనే పోలీసులు స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను పట్టుకున్నందుకు నిజాం ఫ్యామిలీ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున తెలంగాణ రాష్ట్ర పోలీసులను నవాబ్ నజాఫ్ అలీ ఖాన్ అభినందించాడు. అతను పేర్కొన్నాడు [7]

"మా ప్రియమైన తాతకు చెందిన దొంగిలించబడిన వస్తువులు స్వాధీనం చేసుకున్నందుకు మాకు మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది.”

మూలాలు[మార్చు]

  1. "Nizam's heir goes by Blue Book, wants market rate for acquired land - Times of India". The Times of India. Retrieved 2018-09-16.
  2. "Last Hyderabad Nizam's Heirs Demand 277 Acres Royal Property In Aurangabad". NDTV.com. Retrieved 2018-09-16.
  3. "Nizam's grandson basks in grandpa's glory". The Hans India (in ఇంగ్లీష్). Retrieved 2018-09-16.
  4. "Nizam's descendants implead in Hyderabad funds case" (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-03-07. Retrieved 2018-09-16.
  5. "Lost glory". theweek.in. Retrieved 2018-09-16.
  6. "Indian prince's descendants can claim fortune from NatWest after 70 years". the Guardian. 2 October 2019.
  7. "Nizam Welfare Association thanks cops". Telangana Today.