ముండ్లపాడు (గిద్దలూరు)
ముండ్లపాడు | |
---|---|
రెవిన్యూ గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°19′59″N 78°54′00″E / 15.333°N 78.9°ECoordinates: 15°19′59″N 78°54′00″E / 15.333°N 78.9°E ![]() | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | గిద్దలూరు మండలం ![]() |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,880 హె. (7,120 ఎ.) |
జనాభా (2011) | |
• మొత్తం | 7,781 |
• సాంద్రత | 270/కి.మీ2 (700/చ. మై.) |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 (08405 ![]() |
పిన్(PIN) | 523367 ![]() |
ముండ్లపాడు, ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్ నం. 523 367., ఎస్.ట్.డి.కోడ్ = 08405.
గ్రామ భౌగోళికం[మార్చు]
సమీప గ్రామాలు[మార్చు]
నరవ 4 కి.మీ,కంచిపల్లి 5 కి.మీ,సంజీవరావుపేట 6 కి.మీ,కొంగలవీడు 6 కి.మీ,గిద్దలూరు 7 కి.మీ.
సమీప మండలాలు[మార్చు]
తూర్పున కొమరోలు మండలం,ఉత్తరం రాచెర్ల మండలం,దక్షణం కలసపాడు మండలం,పడమర రుద్రవరం మండలం.
గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]
గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]
శ్రీ గంజి భద్రయ్య మెమోరియల్ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]
గ్రామా నికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]
తిమ్మరాజు ఓబులపతిచెరువు[మార్చు]
మొత్తం 98 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ గ్రామంలోని ఈ చెరువు, ఒకప్పుడు, ఈ గ్రామానికేగాక, కొంగళవీడు, చంరారెడ్డిపల్లె, ఎన్.బైనపల్లె గ్రామాలలోని 390 ఎకరాలకు సాగునీరు అందించేది. 1995లో కంచిపల్లి వద్ద ఈ చెరువుకు నీరందించే ఎనుమలేరు వాగు,వరద ఉద్ధృతికి కొట్టుకుపోగా, అప్పటి నుండి మరమత్తులకు నోచుకోక, ఈ ప్రాంత రైతులకు సాగునీటికి చాలా ఇబ్బందులు ఎదురైనవి. కొంతమంది వర్షాధార పంటలనే సాగు చేస్తున్నారు. [4]
ఈ చెరువులో ఐదురోజులనుండి పూడికతీత పనులు చేస్తున్నారు. ఇంతవరకు 500 ట్రాక్టర్ల మట్టిని రైతులు, పోటీలు పడి మరీ, చెరువు నుండి తరలించారు. [5]
గ్రామ పంచాయతీ[మార్చు]
శ్రీ కలువాయి వెంకటసుబ్బయ్య, ఈ గ్రామానికి సర్పంచిగా 1988 నుండి 1995 వరకూ పనిచేశారు. 2001 నుండి 2006 వరకూ ఆయన భార్య శ్రీమతి ఈశ్వరమ్మ సర్పంచిగా పనిచేశారు. మళ్ళీ 2006 నుండి 2011 వరకు శ్రీ వెంకటసుబ్బయ్య సర్పంచిగా పనిచేశారు. [2]
2013,జూలైలో ఈ గ్రామపంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో, కడియం లక్ష్మి శ్రీనివాసరావు సర్పంచిగా ఎన్నికైనారు. [7]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]
శ్రీ భవానీశంకరస్వామివారి ఆలయం (శివాలయం)[మార్చు]
ముండ్లపాడు పంచాయతీ బురుజుపల్లె అటవీ ప్రాంతంలోని పాపులవీడు శివాలయంలో, 23 జూన్-2014, సోమవారం నాడు, శివలింగం పునఃప్రతిష్ఠా మహోత్సవాలు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాలలో భాగంగా, 25వ తేదీ బుధవారం నాడు, ఆలయంలో మహాయఙం నిర్వహించెదరు. [3]
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]
శ్రీ కాలువ వెంకటసుబ్బయ్య.
శ్రీ అద్దంకి మాచర్ల కుమార్- ఈ గ్రామం.[1][1] లో వీ.ఆర్.ఓగా పనిచేయుచున్న వీరు, 69వ స్వాతంత్ర్యదినోత్సవ శుభసందర్భంగా, 15-ఆగస్టు,2015నాడు, మార్కాపురం రెవెన్యూ డివిజన్ అధికారి చేతులమీదుగా, "ఉత్తమ గ్రామ రెవెన్యూ అధికారి" పురస్కారం అందుకున్నారు. [6]
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 7,781 - పురుషుల సంఖ్య 3,938 - స్త్రీల సంఖ్య 3,843 - గృహాల సంఖ్య 2,004;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7,705.[2] ఇందులో పురుషుల సంఖ్య 3,994, మహిళల సంఖ్య 3,711, గ్రామంలో నివాస గృహాలు 1,747 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2880 హెక్టారులు.
- గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]
మూలాలు[మార్చు]
వెలుపలి లంకెలు[మార్చు]
[2] ఈనాడు ప్రకాశం; 2013,జులై-11; 4వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2014,జూన్-24; 4వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2015,మే-11; 4వపేజీ. [5] ఈనాడు ప్రకాశం; 2015,మే-17; 3వపేజీ. [6] ఈనాడు ప్రకాశం; 2015,ఆగస్టు-15; 4వపేజీ. [7] ఈనాడు ప్రకాశం; 2017,ఆగస్టు-25; 5వపేజీ.