ముంబై మెట్రో
ముంబై మెట్రో, మహారాష్ట్రలోని ముంబై నగరానికి, విశాలమైన ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతానికీ సేవలందించే వేగవంతమైన రైలు రవాణా వ్యవస్థ.
నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, రద్దీగా ఉండే ముంబై సబర్బన్ రైల్వే నెట్‌వర్క్‌కు అనుబంధంగా ఉండేలా ఈ రాపిడ్ ట్రాన్సిట్ మెట్రో వ్యవస్థను రూపొందించారు. దీనిని 15 సంవత్సరాలలో మూడు దశల్లో నిర్మిస్తున్నారు. ఇది 2026 అక్టోబరులో పూర్తయ్యే అవకాశం ఉంది. 2025 అక్టోబరు నాటికి ముంబై మెట్రో 80.43 కిలోమీటర్ల నిడివితో భారతదేశంలో మూడవ అత్యంత పొడవైన మెట్రో నెట్‌వర్కు. పూర్తయినప్పుడు, ఈ వ్యవస్థలో అధిక సామర్థ్యం గల పదహారు లైన్లు ఉంటాయి. మొత్తం 523 కిలోమీటర్ల మార్గంలో (25% భూగర్భంలో, మిగిలినది ఎత్తులో, ఒక చిన్న భాగం నేలమీదా నిర్మిస్తారు) 350 స్టేషన్ల ద్వారా ముంబై మెట్రో సేవలు అందిస్తుంది.[1]
మహారాష్ట్ర రాజధాని కావడంతో, ముంబై ప్రపంచంలోని అతిపెద్ద నగరాల్లో ఒకటి. 2011 నాటికి, మొత్తం మెట్రోపాలిటన్ ప్రాంత జనాభా 2 కోట్లకు పైచిలుకు.[2] ఏటా జనాభా పెరుగుదల రేటు 2%.[3] ప్రజా సామూహిక రవాణా వ్యవస్థకు అనుకూలంగా ముంబైలో అధిక మోడల్ వాటా (88%) ఉంది. [4] ప్రస్తుతం ఉన్న ముంబై సబర్బన్ రైల్వే రోజుకు 70 లక్షల మందికి పైగా ప్రయాణిస్తారు. బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్) బస్సు వ్యవస్థలో మరికొంతమంది ప్రయాణిస్తారు. మెట్రో స్టేషనుకు వెళ్లే, స్టేషను నుండి వచ్చే ప్రయాణీకులకు ఈ బస్సులు ఫీడర్ సేవలు అందిస్తాయి. 1980ల వరకు, ముంబైలో రవాణా పెద్ద సమస్యగా ఉండేది కాదు. ట్రామ్‌లను నిలిపివేయడం వల్ల సబర్బన్ రైల్వే నెట్‌వర్క్‌పై ఒత్తిడి పెరిగింది. 2010 నాటికి, ముంబై జనాభా రెట్టింపు అయింది. అయితే, నగరపు భౌగోళిక పరిమితులు, వేగవంతమైన జనాభా పెరుగుదల కారణంగా, రోడ్డు, రైలు మౌలిక సదుపాయాల అభివృద్ధి గత 4-5 దశాబ్దాలుగా పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా పెరగలేకపోయింది.[5] అంతేకాకుండా, ముంబై సబర్బన్ రైల్వే విస్తృతమైనప్పటికీ, వేగవంతమైన రవాణా నిర్దేశాలకు అనుగుణంగా దాన్ని నిర్మించలేదు. ముంబై మెట్రో ప్రధాన లక్ష్యం 1-2 కిలోమీటర్ల మధ్య దూరంలో ఉన్న ప్రజలకు సామూహిక వేగవంతమైన రవాణా సేవలను అందించడం, ప్రస్తుత సబర్బన్ రైలు నెట్‌వర్క్ ద్వారా అనుసంధానించబడని ప్రాంతాలకు సేవలందించడం. 2004 లో MMRDA ఆవిష్కరించిన మాస్టర్ ప్లాన్ మొత్తం 146.5 కిలోమీటర్లు. దీనిలో 32 కి.మీ. భూగర్భంలో ఉంటుంది.[6] ముంబై మెట్రోను ₹ 19,525 కోట్ల అంచనా వ్యయంతో మూడు దశల్లో నిర్మించాలని ప్రతిపాదించారు.[5] 2009 సెప్టెంబరులో ప్రతిపాదిత హుతాత్మా చౌక్ - ఘట్కోపర్‌ను హుతాత్మ చౌక్, కార్నాక్ బందర్ల మధ్యకు కుదించారు.
2011 లో, MMRDA విస్తరించిన కొలాబా-బాంద్రా-SEEPZ మెట్రో లైన్ కోసం ప్రణాళికలను ఆవిష్కరించింది. తొలి ప్రణాళికల ప్రకారం, కొలాబా నుండి బాంద్రా వరకు 20 కి.మీ.ల మెట్రో లైన్ నిర్మించాల్సి ఉంది. అయితే, MMRDA బాంద్రా దాటి ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు లైన్‌ను పొడిగించి ప్రయాణికుల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. 33.5 కి.మీ.ల కొలాబా-బాంద్రా-SEEPZ లైన్ రూ 21,000 కోట్ల వ్యయంతో నిర్మిస్తారు. ఇది నగరంలోని మొట్టమొదటి భూగర్భ మెట్రో లైన్ అవుతుంది. ఇందులో 27 స్టేషన్లుంటాయి.
నెట్‌వర్కు
[మార్చు]ముంబై మెట్రోలోని లైన్లను ప్రస్తుతం సంఖ్యల ద్వారా గుర్తిస్తున్నారు. మరిన్ని లైన్లు తెరిచిన తర్వాత వ్యవస్థ లోని అన్ని లైన్లకు రంగు-కోడింగ్ ఉంటుందని 2016 మార్చిలో MMRDA ప్రకటించింది. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం మినహా మహారాష్ట్రలో అభివృద్ధి చేస్తున్న అన్ని మెట్రో రైలు ప్రాజెక్టులను మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్మాణ నిర్వహణ చేస్తూండగా, గ్రేటర్ ముంబై ప్రాంతంలో మెట్రో వ్యవస్థను నిర్వహించడానికి ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేసారు.

| కార్యాచరణ లైన్లు | |||||||
|---|---|---|---|---|---|---|---|
| . లేదు. | లైన్ పేరు | సంఖ్య. | టెర్మినల్స్ | స్టేషన్లు | దూరం | తెరవబడిన తేదీ | |
| 1 | Blue | 1 | వెర్సోవా | ఘాట్‌కోపర్ | 12 | 11.40 | 2014 జూన్ 8 |
| 2 | Yellow | 2A | దహిసార్ (ఈస్ట్) | దహానుకార్వాడి | 9 | 9.8 | 2022 ఏప్రిల్ 2 |
| దహానుకార్వాడి | అంధేరి (వెస్ట్) | 8 | 8.8 | 2023 జనవరి 19 | |||
| 3 | Aqua | 3 | ఆరే JVLR | బాంద్రా కుర్లా కాంప్లెక్స్ | 10 | 12.69 | 2024 అక్టోబరు 7 |
| బాంద్రా కుర్లా కాంప్లెక్స్ | ఆచార్య ఆత్రే చౌక్ | 6 | 9.77 | 2025 మే 9 | |||
| ఆచార్య ఆత్రే చౌక్ | కఫ్ పరేడ్ | 11 | 10.99 | 2025 అక్టోబరు 9 | |||
| 4 | Red | 7 | దహిసార్ (ఈస్ట్) | ఆరే | 10 | 10.7 | 2022 ఏప్రిల్ 2 |
| ఆరే | గుండావాలీ | 4 | 5.8 | 2023 జనవరి 19 | |||
| 70 | 79.95 | ||||||
| నిర్మాణంలో ఉన్న లైన్లు | |||||||
| . లేదు. | లైన్ పేరు | సంఖ్య. | టెర్మినల్స్ | స్టేషన్లు | దూరం | తెరవబడిన తేదీ | |
| 1 | Yellow | 2బి | అంధేరి (వెస్ట్) | సరస్వత్ నగర్ | 6 | 23.6 | 2026 ఏప్రిల్ |
| సరస్వత్ నగర్ | డయమండ్ గార్డెన్ | 9 | 2027 డిసెంబరు | ||||
| డయమండ్ గార్డెన్ | మాండలే | 5 | 2025 డిసెంబరు | ||||
| 2 | Green | 4ఏ | గైముఖ్ | కాసర్‌వడావాలి | 2 | 2.88 | 2025 డిసెంబరు |
| 4 | కాసర్‌వడావాలి | క్యాడ్‌బరీ జంక్షన్ | 8 | 32.32 | 2025 డిసెంబరు | ||
| క్యాడ్‌బరీ జంక్షన్ | గాంధీ నగర్ (కంజూమార్గ్) | 11 | 2026 డిసెంబరు | ||||
| గాంధీ నగర్ (కంజూమార్గ్) | భక్తి పార్క్ (వడాలా) | 13 | 2027 నవంబరు | ||||
| 3 | Orange | 5 | కపూర్‌బావ్‌డి | భివాండి | 8 | 12.81 | 2027 డిసెంబరు |
| 12 | కళ్యాణ్ APMC | తలోజా | 17 | 20.75 | 2028 డిసెంబరు | ||
| 4 | Pink | 6 | స్వామి సమర్థ్ నగర్ (లోఖండ్‌వాలా) | విఖ్రోలి EEH | 13 | 14.47 | 2027 డిసెంబరు |
| 5 | Red | 7ఏ | గుండావాలీ | ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం - T2 | 2 | 3.17 | 2027 డిసెంబరు |
| 9 | సుభాష్ చంద్ర బోస్ స్టేడియమ్ | కాశీగావ్ | 4 | 11.38 | 2027 డిసెంబరు | ||
| కాశీగావ్ | దహిసార్ (ఈస్ట్) | 4 | 2025 డిసెంబరు | ||||
| 102 | 121.38 | ||||||
| ప్రతిపాదిత పంక్తులు | |||||||
| . లేదు. | లైన్ పేరు | సంఖ్య. | టెర్మినల్స్ | స్టేషన్లు | దూరం | తెరవబడిన తేదీ | |
| 1 | Green | 10 | గైముఖ్ | శివాజీ చౌక్ (మీరా రోడ్) | 8 | 9.2 | పర్యావరణ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నారు |
| 11 | భక్తి పార్క్ (వడాలా) | ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ | 15 | 18 | కొనసాగుతున్న మట్టి పరీక్ష | ||
| 2 | Orange | 5 | భివాండి | కళ్యాణ్ APMC | 9 | 10.72 | డీపీఆర్లో మార్పులు జరుగుతున్నాయి |
| 3 | Gold | 8 | ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం - T2 | నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం | 20 | 35 | డిపిఆర్ సమర్పించారు |
| 4 | Purple | 13 | శివాజీ చౌక్ (మీరా రోడ్) | విరార్ | 20 | 23 | డీపీఆర్ సిద్ధం |
| 5 | Magenta | 14 | విఖ్రోలి EEH | బద్లాపూర్ | 40 | 45 | డిపిఆర్ సమర్పించారు |
| 112 | 140.92 | ||||||
రోలింగ్ స్టాక్
[మార్చు]ముంబై మెట్రో కోసం రైళ్ళను సరఫరా చేసేందుకు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అనేక అంతర్జాతీయ రోలింగ్ స్టాక్ తయారీదార్లను సంప్రదించింది. కాంట్రాక్టు కోసం బిడ్డర్లలో కవాసాకి, ఆల్‌స్టామ్, సిమెన్స్, బొంబార్డియర్ వంటి మెట్రో-వాహన తయారీదారులు ఉన్నారు. కానీ చివరికి చైనాకు చెందిన CRRC నాన్జింగ్ పుజెన్ ₹600 కోట్ల విలువైన రోలింగ్ స్టాక్‌ను సరఫరా చేయడానికి ఎంపికైంది. [7] 2008 మేలో CSR నాన్జింగ్ మొదటి 16 రైళ్లను సరఫరా చేసింది. వీటిలో ఒక్కోదానిలో నాలుగు కార్లు ఉన్నాయి.[8] మొదటి పది రైళ్లు 2013 జనవరి నాటికి ఆపరేషనుకు సిద్ధమయ్యాయి.[9]
ఈ కోచ్‌లు అగ్ని నిరోధకమైనవి, ఎయిర్ కండిషన్ చేసినవి, శబ్దాన్ని, ప్రకంకంపనాలను తగ్గించేలా రూపొందించారు. అధిక సీటింగ్ సామర్థ్యం, నిలబడే ప్రయాణీకులకు తగినంత స్థలం ఉంటుంది. భద్రత, సౌలభ్యం కోసం LCD స్క్రీన్‌లు, 3D రూట్ మ్యాప్‌లు, ప్రథమ చికిత్స వస్తు సామగ్రి, వీల్‌చైర్ సౌకర్యాలు, అగ్నిమాపక పరికరాలు, రైలు డ్రైవర్‌తో కమ్యూనికేషనుకు వీలు కలిగించే ఇంటర్‌కామ్ వ్యవస్థలు వంటి అనేక లక్షణాలు వీటిలో ఉన్నాయి. ప్రమాద దర్యాప్తులో సహాయపడటానికి ప్రతి కోచ్‌లో బ్లాక్ బాక్స్ కూడా ఉంటుంది. నాలుగు కార్ల రైల్లో 1,100 పైచిలుకు ప్రయాణికులను తీసుకెళ్లగల సామర్థ్యం ఉంటుంది. ప్రతి పెట్టె సుమారు 3.2 metres (10 ft 6 in) వెడల్పు ఉంటుంది.[10]
2018 లో, ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ ఆక్వా లైన్ (లైన్ 3) కోసం 31 ఎనిమిది-బోగీల రైళ్లను సరఫరా చేయడానికి ఆల్‌స్టోమ్‌ను ఎంచుకుంది. ఈ రైళ్లు డ్రైవరు లేకుండా నడుస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీలోని ఆల్‌స్టోమ్ ఫ్యాక్టరీలో వీటిని నిర్మించారు.[11]
2018లో, లైన్ 3 మినహా అన్ని మెట్రో లైన్లను నిర్వహించే ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ, భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML)కి ₹3,015 కోట్ల ($427.33 మిలియన్లు) ఖర్చుతో ఎల్లో లైన్ (లైన్ 2), రెడ్ లైన్ (లైన్ 7) కోసం 63 ట్రైన్‌సెట్‌లను (378 కోచ్‌లు) సరఫరా చేయడానికి ఆర్డరు ఇచ్చింది. డ్రైవరు లేకుండా నడిచే సామర్థ్యం ఉన్న ఈ రైళ్లను బెంగళూరులోని BEML ఫ్యాక్టరీలో తయారు చేస్తారు. ఎల్లో లైన్ కోసం మొదటి రైలు 2021 జనవరి 27 న ముంబైకి చేరుకుంది. మిగిలిన రైళ్ళను 2022 వరకు సరఫరా చేస్తూనే ఉంటుంది.[12][13] 2021 జనవరి 17 న ముంబై మెట్రో కోసం ఆరు కార్ల రైళ్ళు ఉండే గ్రీన్ లైన్ (లైన్ 4) కోసం 234 డ్రైవరు లేని కోచ్‌లను సరఫరా చేయడానికి బొంబార్డియర్ సంస్థ టెండరును గెలుచుకుంది. అయితే, ప్రాజెక్టులో జరిగిన జాప్యాలు, అనిశ్చితుల కారణంగా 2022 మార్చిలో మెట్రో ఈ ఒప్పందాన్ని రద్దు చేసింది. [14] [15] 2025 ఆగస్టులో MMRDA, ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ ప్యాకేజీలో భాగంగా ఆల్‌స్టామ్ తయారు చేయబోయే గ్రీన్ లైన్ (లైన్ 4) కోసం 6 కార్ల 39 ట్రైన్‌సెట్‌లను సరఫరా చేయడానికి L&T కి కాంట్రాక్టును ఇచ్చింది. [16] డిపో లేకపోవడం, రోలింగ్ స్టాక్‌ను సేకరించడంలో జాప్యం కారణంగా, లైన్‌లోని ఒక విభాగంలో ట్రయల్స్ ప్రారంభించడానికి MMRDA ఎల్లో లైన్‌లోని మండలే డిపోలో పనిలేకుండా పడి ఉన్న ఎనిమిది రైళ్లను తాత్కాలికంగా గ్రీన్ లైన్‌కు రవాణా చేయాలని కూడా నిర్ణయించింది.[17]
విద్యుత్ సరఫరా
[మార్చు]ముంబై మెట్రో ఆల్టర్నేటింగ్ కరెంట్ (AC) పై నడుస్తుంది, ఇది సాధారణంగా ఎక్కువ శ్రమతోటి, ఖర్చుతోటీ కూడుకున్నది. MMRDA జాయింట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ దిలీప్ కవత్కర్ మాట్లాడుతూ, " నిపుణుల బృందం చేసిన అధ్యయనం తర్వాత " AC పవర్‌ను ఎంచుకున్నామని, అది "మంచి ఎంపికే" అని తేలిందనీ అన్నాడు. లైన్ 3 కోసం బిడ్డర్లు DC మోడల్‌కు అనుకూలంగా ఉన్నట్లు తెలిసింది. ACని ఉపయోగించాలనే నిర్ణయం వలన భూగర్భ మార్గ నిర్మాణ వ్యయం 15% పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే రైలు AC విద్యుత్తుతో పనిచేయడానికి పెద్ద సొరంగం తవ్వాల్సిన అవసరం ఉంటుంది.[18]
ప్రయాణీకుల సంఖ్య, ప్రభావం
[మార్చు]2025 అక్టోబరులో ఆక్వా లైన్ పూర్తిగా పనిచేయడం ప్రారంభించిన తర్వాత, ముంబై మెట్రో లైన్లలో సగటున రోజుకు 9,00,000 మంది ప్రయాణిస్తున్నరు. బ్లూ లైన్‌లో దాదాపు 4,60,000 మంది, పసుపు, ఎరుపు లైన్లలో 2,60,000 మంది, ఆక్వాలో 1,60,000 మంది రోజువారీ సగటు ప్రయాణికులు ఉన్నారు. 2019 అక్టోబరు 21 న, ముంబై మెట్రో లైన్ 1 ప్రారంభమైన 1,960 రోజుల తర్వాత (సుమారు 5 సంవత్సరాలు), ఈ వ్యవస్థలో 60 కోట్ల మంది ప్రయాణించారు. సగటున రోజువారీ ప్రయాణికుల సంఖ్య దాదాపు 4,50,000 మంది. [19] తదుపరి లైన్‌లను తెరిచిన తర్వాత, ముంబై సబర్బన్ రైల్వేపై ఒత్తిడి తగ్గింది. సబర్బన్ రైల్వే బాగా రద్దీగా, భద్రత లేకుండా పోయింది.[20] ఇంకా, పర్యావరణ అనుకూల నిర్మాణ పద్ధతులతో పాటు, పునరుత్పాదక బ్రేకింగ్ వ్యవస్థలు, ట్రాఫిక్ రద్దీని తగ్గించడం వంటి ఇంధన ఆదా పద్ధతుల ద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గించి, ముంబై మెట్రో ఘనత పొందింది.[21]
ఇంకా, ముంబై మెట్రో ఎరుపు, పసుపు లైన్లలో అదనపు ఛార్జీ లేకుండా ప్రయాణికుల కోసం ప్రత్యేక రాక్‌లను ఏర్పాటు చేసి, సైకిళ్లను అనుమతించింది.[22] అయితే, ఆక్వా లైన్‌లో, రద్దీ సమయాల్లో వాటిని అనుమతించడం లేదు. అయితే లైన్ పూర్తయిన తర్వాత దానిని అనుమతించాలని అధికారులు యోచిస్తున్నారు. బ్లూ లైన్‌లో, మడత పెట్టగల సైకిళ్లను అనుమతిస్తారు.[23]
ఇవి కూడా చూడండి
[మార్చు]- భారతదేశంలో పట్టణ రైలు రవాణా
- వేగవంతమైన రవాణా వ్యవస్థల జాబితా
- ముంబై మోనోరైలు
- హైదరాబాదు మెట్రో
- ఢిల్లీ మెట్రో
- ఢిల్లీ మీరట్ RRTS
మూలాలు
[మార్చు]- ↑ "Mumbai Metro: Route, Map, Metro Lines, Stations List and Latest Updates - Infra Info Hub" (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-11-11. Retrieved 2024-11-12.
- ↑ "Mumbai Metro: Route, Map, Metro Lines, Stations List and Latest Updates - Infra Info Hub" (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-11-11. Retrieved 2024-11-12.
- ↑ Average Annual Rate of Change Archived 10 మార్చి 2007 at the Wayback Machine.
- ↑ "Businessworld - 7 Questions You Wanted to Ask". 25 June 2009. Archived from the original on 25 June 2009. Retrieved 8 April 2024.
- ↑ 5.0 5.1 "Mmrda – Projects – Mumbai Metro Rail Project". Mmrdamumbai.org. Archived from the original on 19 March 2012. Retrieved 12 March 2014.
- ↑ "Metro Rail-I to be operational in Mumbai in 2012". The Economic Times. 5 September 2011. Archived from the original on 20 October 2012. Retrieved 24 October 2011.
- ↑ "Mumbai Metro: Route, Map, Metro Lines, Stations List and Latest Updates - Infra Info Hub" (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-11-11. Retrieved 2024-11-12.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>ట్యాగు;RGI250310అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ "Mumbai metro trains raring to run, but where are tracks?". DNAIndia. 23 January 2013. Retrieved 6 February 2013.
- ↑ "Mumbai Metro: Route, Map, Metro Lines, Stations List and Latest Updates - Infra Info Hub" (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-11-11. Retrieved 2024-11-12.
- ↑ "Mumbai Metro: Route, Map, Metro Lines, Stations List and Latest Updates - Infra Info Hub" (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-11-11. Retrieved 2024-11-12.
- ↑ "BEML receives order worth Rs 3015 crore for Mumbai Metro". Capital Market. Business Standard. 24 November 2018. Retrieved 30 November 2018.
- ↑ "BEML secures $427.33m Mumbai metro car supply contract". Railway Technology. 26 November 2018. Retrieved 30 November 2018.
- ↑ "Mumbai Metro: Route, Map, Metro Lines, Stations List and Latest Updates - Infra Info Hub" (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-11-11. Retrieved 2024-11-12.
- ↑ "Mumbai Metro: Route, Map, Metro Lines, Stations List and Latest Updates - Infra Info Hub" (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-11-11. Retrieved 2024-11-12.
- ↑ Average Annual Rate of Change Archived 10 మార్చి 2007 at the Wayback Machine.
- ↑ "Businessworld - 7 Questions You Wanted to Ask". 25 June 2009. Archived from the original on 25 June 2009. Retrieved 8 April 2024.
- ↑ "Mumbai Metro: Route, Map, Metro Lines, Stations List and Latest Updates - Infra Info Hub" (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-11-11. Retrieved 2024-11-12.
- ↑ "Mumbai Metro: Route, Map, Metro Lines, Stations List and Latest Updates - Infra Info Hub" (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-11-11. Retrieved 2024-11-12.
- ↑ "Mumbai Metro: Route, Map, Metro Lines, Stations List and Latest Updates - Infra Info Hub" (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-11-11. Retrieved 2024-11-12.
- ↑ Average Annual Rate of Change Archived 10 మార్చి 2007 at the Wayback Machine.
- ↑ "Mumbai Metro: Route, Map, Metro Lines, Stations List and Latest Updates - Infra Info Hub" (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-11-11. Retrieved 2024-11-12.
- ↑ "Mumbai Metro: Route, Map, Metro Lines, Stations List and Latest Updates - Infra Info Hub" (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-11-11. Retrieved 2024-11-12.
