Jump to content

ముంబై రాజధాని ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
ముంబై రాజధాని ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంరాజధాని ఎక్స్‌ప్రెస్
స్థానికతమహారాష్ట్ర, గుజరాత్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, హర్యానా & ఢిల్లీ
తొలి సేవమే 17, 1972; 52 సంవత్సరాల క్రితం (1972-05-17)
ప్రస్తుతం నడిపేవారుపశ్చిమ రైల్వే మండలం
మార్గం
మొదలుముంబై సెంట్రల్
ఆగే స్టేషనులు6
గమ్యంన్యూఢిల్లీ రైల్వే స్టేషన్
ప్రయాణ దూరం1,384 కి.మీ. (860 మై.)
సగటు ప్రయాణ సమయం15గంటల 42నిమిషాలు
రైలు నడిచే విధంరోజూ
రైలు సంఖ్య(లు)12951 / 12952
సదుపాయాలు
శ్రేణులుఎ.సి మొదటి తరగతి,ఎ.సి రెండవ తరగతి,ఎ.సి మూడవ తరగతి
కూర్చునేందుకు సదుపాయాలులేదు
పడుకునేందుకు సదుపాయాలుకలదు
ఆహార సదుపాయాలుపాంట్రీ కార్ సౌకర్యం కలదు
చూడదగ్గ సదుపాయాలుఎల్.హెచ్.బీ కోచ్లు
సాంకేతికత
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం91.2 km/h (56.7 mph) average 130 km/h (81 mph) maximum
మార్గపటం
(New Delhi - Mumbai) Rajdhani Express route map

ముంబై రాజధాని ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు,పశ్చిమ రైల్వే మండలం ద్వారా నిర్వహిస్తున్న రైలు రాజధాని ఎక్స్‌ప్రెస్ .ఈ రైలు మహారాష్ట్ర రాష్ట్ర రాజధాని ముంబై నుండి భారతదేశ రాజధాని ఢిల్లీ ల మద్య ప్రయాణిస్తుంది.ఇది ముంబై -ఢిల్లీ మద్య ప్రయాణించే రైళ్ళలో రెండవ అత్యంత వేగవంతమయినది.[1]

చరిత్ర

[మార్చు]

ముంబై రాజధాని ఎక్స్‌ప్రెస్ ను 1972 మే 17 న ముంబై సెంట్రల్-న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ల మద్య ప్రారంభించారు.ఈ రైలును ప్రారంభించిన కొద్ధి కాలంలోనే అమిత ఆధరణ అందుకుంది.మొదతిలో ఈ రైలు వారానికి ఆరు రోజులు నడిచినప్పటికి సెప్టెంబరు 2000 వ సంవత్సరమునుండి ప్రతి రోజు నడిచే విధంగా రూపొందించారు. [2][3][4]

కోచ్ల కూర్పు

[మార్చు]

ముంబై రాజధాని ఎక్స్‌ప్రెస్ లో 1 మొదటి తరగతి ఎ.సి కోచ్,5 రెండవ తరగతి ఎ.సి కోచ్లూ,11 మూడవ తరగతి ఎ.సి కోచ్లూ,1 పాంట్రీ కార్,2 జనరేటర్ భోగీలతో కలిపి మొత్తం 20 భోగీలుంటాయి.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఇంజను
EOG ఎ5 ఎ4 ఎ3 ఎ2 ఎ1 హెచ్1 PC బి11 బి10 బి9 బి8 బి7 బి6 బి5 బి4 బి3 బి2 బి1 EOG

సర్వీస్

[మార్చు]

12951/52 నెంబరుతో ప్రయాణించే ముంబై రాజధాని ఎక్స్‌ప్రెస్ ముంబై-ఢిల్లీ లమద్య ప్రయాణించు రైళ్ళలో రెండవ అత్యంత వేగవంతమయిన రైలు.[[భారతీయ రైల్వేలలో మొదటగా ఎల్.హెచ్.బీ కోచ్లను ఉపయోగించిన రాజధాని ఎక్స్‌ప్రెస్ కూడా ముంబై రాజధాని ఎక్స్‌ప్రెస్.ఈ రైలును సెప్టెంబర్ 2000 వ సం వత్సరం వరకు వారానికి ఆరు రోజులు నడిపినప్పటికి ఆ తరువాత దీనిని ప్రతీ రోజు నడిచే విధంగా మార్చారు.ఈ రైలును ప్రారంభించిన మొదటిలో ఈ రైలు ముంబై-ఢిల్లీ లమద్య గల 1385 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించడానికి 19గంటల 5నిమిషాల సమయం తీసుకునేది.ముంబై-ఢిల్లీ లమద్య మార్గం విధ్యూతీకరణం జరిగిన తరువాత ఈ రైలువేగం గణనీయంగా పెరిగింది.ప్రస్తుతం ఈ 12951 నెంబరుతో ప్రయాణించు ముంబై రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ముంబై-ఢిల్లీ లమద్య గల 1385 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించడానికి సగటున 89కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ 15గంటల 35నిమిషాలు తీసుకుంటున్నది.12951 ప్రయాణించు ముంబై రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ఢిల్లీ-ముంబై ల మద్య ప్రయాణించడానికి 15గంటల 50నిమిషాల సమయం తీసుకుంటున్నది.ఎల్.హెచ్.బీ కోచ్ల తో ప్రయాణించడానికి పూర్వం ఈ రైలు అత్యధికంగా 120కిలో మీటర్ల వేగంతో ప్రయాణించేది.ఎల్.హెచ్.బీ కోచ్లను ప్రవేశపెట్టిన తరువాత ఈ రైలు యొక్క అత్యధక వేగాన్నీ 160కిలో మీటర్ల వరకు పెంచే అవకాశం వచ్చినప్పటికి వేగాన్నీ 130 కిలో మీటర్లగా నియంత్రించారు.అసోటి మధుర రైల్వే స్టేషన్ల మద్య ప్రయోగాత్మకంగా ఈ రైలును 140కిలో మీటర్ల వేగంతో ఒక నెల పాటు నడపడం జరిగింది.ప్రస్తుతం ఈ రైలు వేగాన్నీ ఆనంద్ విహార్-వడోదర-గోద్రా ల మద్య వేగాన్నీ 130కిలో మీటర్లకు పెంచడంతో ఈ రైలు యొక్క ప్రయాణ సమయం మరింత తగ్గింది.

ట్రాక్షన్

[మార్చు]

ముంబై రాజధాని ఎక్స్‌ప్రెస్ ప్రారంభించిన మొదటిలో ఒక WDM-2 డీజిల్ లోకో మోటివ్ ని ఉపయోగించేవారు.ముంబై-ఢిల్లీ లో మరింత వేగం కోసం రెండు WDM-2 డీజిల్ లోకో మోటివ్లను వడోదర వరకు ఉపయోగించారు.ముంబై-ఢిల్లీ మార్గం 1987వ సంవత్సరం లో పూర్తిస్థాయిలో విద్యూతీకరణ చేయబడింది.అప్పటినుండి 1995 వరకు WCAM-1 లోకోమోటివ్లను ఉపయోగించారు.ఆ తరువాత ముంబై నుండి వడోదర వరకు కళ్యాణ్ లోకోషేడ్ అధారిత WCAM-2/2P లోకోమోటివ్లను ఉపయోగించారు.2012 ఫిబ్రవరి 7 నుండి ముంబై రాజధాని ఎక్స్‌ప్రెస్ కు ఘజియాబాద్ లోకోషెడ్ అధారత WAP-7 లేదా వడోదర లోకోషెడ్ అధారిత WAP-5/WAP-7 లోకోమోటివ్లను ఉపయోగిస్తున్నారు.

ప్రయాణ సమయం

[మార్చు]

12591 నెంబరుతో ప్రయాణించు ముంబై రాజధాని ఎక్స్‌ప్రెస్ ముంబై సెంట్రల్ లో సాయంత్రం 05గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08గంటల 35నిమిషాలకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ చేరుతుంది. 12592 నెంబరుతో ప్రయాణించు ముంబై రాజధాని ఎక్స్‌ప్రెస్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ సాయంత్రం 4గంటల 25నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08గంటల 15నిమిషాలకు ముంబై సెంట్రల్ చేరుతుంది.

సంఘటనలు

[మార్చు]

ముంబై రాజధాని ఎక్స్‌ప్రెస్ లో 2011వ సంవత్సరం ఎప్రిల్, 18 మూడు కోచ్లలో మంటలు సంభవించాయి.అయితే ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "The prestigious Mumbai-New Delhi Rajdhani Express of Western Railway has completed 50 glorious years". 18 May 2022.
  2. "Speech of Shri Gulzari Lal Nanda Introducing the Railway Budget for 1970-71, on 23rd February, 1970" (PDF). Archived from the original (PDF) on 2024-04-22. Retrieved 18 September 2024.
  3. "Western Railway". wr.indianrailways.gov.in. Retrieved 2024-04-22.
  4. "50 years since maiden journey, Mumbai-Delhi Rajdhani Express set for an upgrade". Hindustan Times (in ఇంగ్లీష్). 2022-05-17. Retrieved 2024-04-22.

బయటి లింకులు

[మార్చు]