ముఅజ్జిన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ముఅజ్జిన్ :

Jean-Léon Gérôme. మస్జిద్ పైభాగాన మీనార్ పై నిలబడి అజాన్ ఇస్తున్న ఒక ముఅజ్జిన్ (1879)
An Ottoman Muezzin proclaims the Adhan after their victory during the Siege of Esztergom (1543).

'ముఅజ్జిన్ (/[invalid input: 'icon']mˈɛzɪn/; మూస:Lang-tr from అరబ్బీ: మూస:Script/Arabic‎, mu’aḏḏin), లేదా ముజీమ్, సాధారణంగా పల్లెటూరి ప్రాంతాలలో "మౌజన్" అని సంబోధిస్తారు. ఈ ముఅజ్జిన్ మసీదు యందు, ప్రార్థనా సమయాన, ప్రార్థనల కొరకు ముస్లింలను సాంప్రదాయ బద్ధంగా పిలిచేవాడు. ఈ ముఅజ్జిన్ అంత ప్రముఖుడు గాకపోయిననూ, ముస్లిం సమాజం నమాజు సమయాలను ఇతని పిలుపు (అజాన్) ఆధారంగా తెలుసుకుంటారు. అజాన్ (ఆంగ్లం : Adhan (Athaan)) (అరబ్బీ : أَذَان) అనునది, ఇస్లామీయ ప్రార్థనల పిలుపు లేదా ప్రకటన. ఈ ప్రకటనను చిన్న మసీదుల్లో నయితే భవనం పక్కతలుపు దగ్గరనుండి పెద్ద మసీదుల్లోనయితే స్తంభంపైనుండి ముఅజ్జిన్ బిగ్గరగా అందరికీ వినబడేలా అరుస్తాడు. ముఅజ్జిన్ అంటే అరిచేవాడు లేదా పిలిచేవాడు. కొంతమంది ముఅజ్జిన్ లు అజాన్ ను రాగయుక్తంగా శ్రావ్యంగా పాడుతారు కూడా.

చారిత్రకంగా ముఅజ్జిన్ మీనార్ పై నిలబడి అజాన్ ఇస్తాడు. దీని ద్వారా, మస్జిద్ చుట్టు ప్రాంతాలలో ఉన్నవారికి ఈ అజాన్ (పిలుపు) వినబడుతుంది. నేటి కాలంలో లౌడ్ స్పీకర్లు వచ్చాయి, వీటి ద్వారా అజాన్ పిలుపు ఇవ్వబడుచున్నది, మస్జిద్ చుట్టుప్రక్కలవారికి, మస్జిద్ కు దూరంగా వున్నవారికినూ ఈ వినిపించడం ఉద్దేశం.

విశదీకరణ[మార్చు]

ఒక సాంప్రదాయిక ముఅజ్జిన్ కు కావలసిన అర్హతలు;

  • మంచి నడవడిక వున్నవాడు.
  • అజాన్ నైపుణ్యాలు తెలిసిన వాడు.
  • యితడు ముల్లా కాకపోయినా సమాజంలో ఆడరింపబడుతాడు.
  • ఖిబ్లా వైపు తిరిగి అజాన్ ఇస్తాడు.
  • అలాగే నమాజు సమయాన లేదా ఖుత్బా ప్రసంగా సమయానికి ముందు, ఇమాంకు ముందు గాని లేదా మింబర్కు ముందు నిలబడి, అజాన్, ఇకామా పలుకుతాడు.
  • అజాన్ ను రాగాయుక్తన్గాను, శ్రావ్యంగానూ పలుకేవాడు.

చరిత్ర[మార్చు]

ముఅజ్జిన్ ల చరిత్ర ముహమ్మద్ ప్రవక్త గారి కాలం నుండే కానవస్తుంది. మొట్టమొదటి ముఅజ్జిన్ బిలాల్ ఇబ్న్ రిబా, ఇతడినే "బిలాల్ ఎ హబషి" అని, బిలాలె హబషి అనీ అంటారు. ఇతను ప్రవక్త గారి కాలంలో మస్జిద్ ఎ నబవి (ప్రవక్త గారి మస్జిద్) నుండి, వీధులలో అజాన్ పిలుపు ఇచ్చేవాడు. ముహమ్మద్ ప్రవక్త గారే ఇతనికి ఖిబ్లా వైపు తిరిగి అజాన్ ఇవ్వమని ఆజ్ఞాపించారు.

ప్రఖ్యాతి గాంచిన ముఅజ్జిన్ లు[మార్చు]

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  • David A. King (1996). "On the Role of the Muezzin and the Muwaqqit in Medieval Islamic Society". Tradition, transmission, transformation: Proceedings of two conferences on pre-modern science held at the University of Oklahoma. Brill: 285–346. ISBN 90-04-10119-5.

బయటి లింకులు[మార్చు]