ముక్తార్ అనీస్
| ముక్తార్ అనీస్ | |||
| |||
| పదవీ కాలం 1996 – 1998 | |||
| ముందు | జనార్దన్ ప్రసాద్ మిశ్రా | ||
|---|---|---|---|
| తరువాత | జనార్దన్ ప్రసాద్ మిశ్రా | ||
| నియోజకవర్గం | సీతాపూర్ | ||
| పదవీ కాలం 1977 – 1996 | |||
| నియోజకవర్గం | బెహతా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1943 జూన్ 8 తంబౌర్ , యునైటెడ్ ప్రావిన్స్ , బ్రిటిష్ ఇండియా | ||
| మరణం | 2021 March 30 (వయసు: 77) లక్నో , ఉత్తర ప్రదేశ్ , భారతదేశం | ||
| రాజకీయ పార్టీ | సమాజ్‌వాది పార్టీ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | సంయుక్త సోషలిస్ట్ పార్టీ | ||
| జీవిత భాగస్వామి | అజీజ్ జహ్రా | ||
ముఖ్తార్ అనిస్ (8 జూన్ 1943 – 30 మార్చి 2021) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేసి 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సీతాపూర్ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]ముక్తార్ అనీస్ జనతా పార్టీ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1977, 1980 & 1989 ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో బెహతా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై 1977 నుండి 78 వరకు పశుసంవర్ధక శాఖకు డిప్యూటీ మంత్రిగా, 1978 నుండి 80 వరకు హోం గార్డ్ & సివిల్ డిఫెన్స్ రాష్ట్ర మంత్రిగా 1989లో ఆరోగ్యం & కుటుంబ నియంత్రణ & ఆరోగ్య విద్య శాఖ మంత్రిగా పని చేశాడు.
ముక్తార్ అనీస్ 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సీతాపూర్ నియోజకవర్గం ఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి జనార్దన్ ప్రసాద్ మిశ్రాపై 10046 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‍సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1998 లోక్‌సభ ఎన్నికలలో ఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి 168055 ఓట్లతో మూడోస్థానంలో నిలిచాడు.
మరణం
[మార్చు]ముక్తార్ అనీస్ నాడీ సంబంధిత రుగ్మతతో బాధపడుతూ ఆరోగ్యం క్షీణించడంతో లక్నోలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2021 మార్చి 30 మరణించాడు.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ "Sitapur Lok Sabha Election Result - Parliamentary Constituency". Result University. 25 June 2025. Archived from the original on 25 June 2025. Retrieved 25 June 2025.
- ↑ "सीतापुर के सपा नेता व पूर्व मंत्री मुख्तार अनीस का निधन, कहे जाते थे गांजर के गांधी". Jagran. 31 March 2021. Archived from the original on 25 June 2025. Retrieved 25 June 2025.
- ↑ "नहीं रहे गांजर के 'गांधी' पूर्व मंत्री मुख्तार अनीस". Jagran. 31 March 2021. Archived from the original on 25 June 2025. Retrieved 25 June 2025.