Jump to content

ముఖేష్ కుమార్

వికీపీడియా నుండి
(ముఖేష్‌ కుమార్‌ నుండి దారిమార్పు చెందింది)

నందనూరి ముఖేష్ కుమార్ (జననం 16 ఏప్రిల్ 1970), భారత హాకీ క్రీడాకారుడు.

జననం

[మార్చు]

ముఖేష్ కుమార్ 1970, ఏప్రిల్ 16న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జన్మించాడు.

వృత్తిజీవితం

[మార్చు]

1992 ప్రారంభంలో పురుషుల జాతీయ జట్టుకు ఆడడం ద్వారా అంతర్జాతీయ క్రీడల్లోకి అరంగేట్రం చేశాడు. మురళి అనే మారుపేరుతో 1992లో స్పెయిన్‌లోని బార్సిలోనా ఒలంపిక్స్ నుండి వరుసగా మూడుసార్లు భారతదేశం తరపున సమ్మర్ ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించాడు. 1992లో భారతదేశం ఏడవ స్థానంలో నిలిచింది.[1] 307 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించి 80 గోల్స్ చేశాడు. 1992లో బార్సిలోనా ఒలింపిక్స్‌ పోటీలో నాలుగు గోల్స్, 1996 అట్లాంట ఒలింపిక్స్‌ పోటీలో రెండు గోల్స్, 2000 సిడ్నీ ఒలింపిక్స్‌ పోటీలో రెండు గోల్స్ చేశాడు.

అవార్డులు

[మార్చు]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

హాకీ క్రీడాకారిణి నిధి ఖుల్లార్‌ను ముఖేష్ కుమార్ వివాహం చేసుకున్నాడు. వీరికి ఎన్. యేషస్విని, అశుతోష్ కుమార్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

మూలాలు

[మార్చు]
  1. [1]
  2. sify.com
  3. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 నవంబరు 2014. Retrieved 18 July 2021.