ముచ్చర్ల అరుణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముచ్చర్ల అరుణ
జననం (1965-09-13) 1965 సెప్టెంబరు 13 (వయసు 59)
కొత్తగూడెం, ఖమ్మం జిల్లా
వృత్తిసినీ నటి
క్రియాశీల సంవత్సరాలు1981– 1991
జీవిత భాగస్వామిజి. మోహన్

ముచ్చెర్ల అరుణ ఒక భారతీయ సినీ నటి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో పలు చిత్రాలలో నటించింది. పదేళ్ళకు పైగా సినిమా కెరీర్ లో సుమారు 70 చిత్రాలకు పైగా నటించింది. 1981లో ఈవిడ తొలి తెలుగు చిత్రం సీతాకోకచిలుక ఉత్తమ జాతీయ చిత్రంగా బంగారు నెమలి పురస్కారాన్ని అందుకున్నది. సినిమా రంగం నుంచి బయటకు వచ్చిన తర్వాత చండీగఢ్ కి చెందిన వ్యాపారవేత్తను వివాహం చేసుకుని గృహిణిగా మారించి. ఈమెకు నలుగురు ఆడపిల్లలు.

నేపధ్యము

[మార్చు]

అరుణ 1965 సెప్టెంబర్ 13న ఖమ్మం జిల్లా, కొత్త గూడెంలో జన్మించింది.[1] చదువంతా హైదరాబాదులోనే సాగింది. తండ్రి ఆదాయపన్ను శాఖలో ఆఫీసరుగా పనిచేసి మళ్ళీ వ్యవసాయం చేశాడు. ఈమెకు ఒక సోదరి, ఒక సోదరుడు ఉన్నారు.

ఈమెకు 1987లో బిజినెస్‌మ్యాన్‌ మోహన్‌గుప్తతో పెళ్ళయింది. వీరికి నలుగురు కూతుర్లు.[2]వారి పేర్లు శిఖా, యస్వీ, శోభిక, ఇంకా రియా. అరుణ సామాజిక మాధ్యమాలలో గుర్తింపు తెచ్చుకుంది.<ఈనాడు.వసుంధర.22 September 2024.

కెరీర్

[మార్చు]

మ్యూజిక్, డ్యాన్స్ అకాడమీలో ఈమెను చూసిన దర్శకుడు భారతీరాజా సినిమాలో నటించమని అడిగాడు. మొదట్లో తటపటాయించినా తర్వాత ఆ అవకాశాన్ని వదులుకోలేదు. ఆ సినిమా సీతాకోక చిలుక. ఈ సినిమా మంచి విజయం సాధించింది.

నటించిన తెలుగు చిత్రాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆ హీరోను కొట్టక తప్పలేదు!". eenadu.net. ఈనాడు. 31 July 2018. Archived from the original on 31 జూలై 2018. Retrieved 31 జూలై 2018.
  2. "సీతాకోకచిలుక హీరోయిన్‌ అరుణ ఇప్పుడు ఎక్కడుంది? ఏం చేస్తుంది?". Sakshi. 2022-02-13. Retrieved 2022-02-14.

బయటి లంకెలు

[మార్చు]