Jump to content

ముచ్చర్ల దినకర్

వికీపీడియా నుండి
ముచ్చర్ల దినకర్ రావు
ముచ్చర్ల దినకర్


వ్యక్తిగత వివరాలు

జననం 1974 ఏప్రిల్ 14
నాగర్‌కర్నూల్, నాగర్ కర్నూల్ జిల్లా
జాతీయత  భారతీయుడు
తల్లిదండ్రులు ముచ్చర్ల రంగారావు, సునంధణాదేవి
జీవిత భాగస్వామి గీతా దేవి
నివాసం ఇంటి నెం.14–385/1/డి, హౌసింగ్ బోర్డు, బిసి కాలనీ, నాగర్‌కర్నూల్ టౌన్ & జిల్లా- 509209.
మతం హిందూ

ముచ్చర్ల దినకర్ రావు తెలంగాణకు చెందిన కవి, రచయిత, చరిత్రకారుడు & పాత్రికేయుడు. ఆయన రచించిన 'మన ప్రజాపాలన' పుస్తకాన్ని 2025లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించాడు.[1]

ఆయనను 2025 జూన్ 30న తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సలహాదారుల కమిటీ సభ్యుడిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ రాష్ట్రంలో 2023లో జరిగిన శాసనసభ ఎన్నికలలో & 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో మీడియా సర్టిఫికెషన్  & మానిటరింగ్ కమిటీ (MCMC) సభ్యుడిగా దినకర్ పని చేశాడు.

వృత్తి జీవితం

[మార్చు]

ముచ్చర్ల దినకర్ 1997 నుండి నాగర్ కర్నూల్ పట్టణంలో ఆంధ్రభూమి, నమస్తే తెలంగాణతో పాటు పలు పత్రికల్లో పనిచేస్తూనే స్థానిక చరిత్ర, సంస్కృతి తెలంగాణ సంప్రదాయాలను వర్తమాన సమాజానికి అందించే ప్రయత్నంలో భాగంగా ప్రప్రథమంగా కవితాకళానిధి కపిలవాయి లింగమూర్తి జీవనచిత్రం రూపొందించి 2012 మే 3న హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఆవిష్కరించారు. ఈ డాక్యుమెంటరికి 2011 సంవత్సరానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తమ ద్వితీయ నంది ఆవార్డు దక్కింది. 2013లో పెబ్బేరు వాస్తవ్యులైన డా. శ్రీ నారాయణ రెడ్డి సమకాలీకులు డా॥వల్లపురెడ్డి బుచ్చారెడ్డి గారి మీద వారి సంపద్వంతమైన తెలుగు భాషా సాహిత్యాన్ని తెలియచెప్పేందుకు డాక్యుమెంటరి రూపొందించి సాహితి రంగంలో వారి కృషిని భవిష్యత్ తరాల కోసం రూపొందించాడు. ఆ

ఆయన ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా 100 సం.ల చరిత్రను భవిషత్తు తరానికి తెలపడం కోసం జిల్లా అంతా దాదాపు వేల కిలో మీటర్లు ప్రయాణం చేసి పాలమూరు దర్శనం పేరిట వీడియో డాక్యుమెంటరీని రూపొందించాడు. ముచ్చర్ల దినకర్ సాహిత్యంపై మక్కువతో మిత్రులతో కలిసి వెన్నెల సాహిత్య అకాడమి, కంజీర సాహిత్య సంస్కృతిక వేదికలను ఏర్పాటు చేసి ఆ సంస్థల ద్వారా దాదాపు 18 పుస్తకాలు, 3 డాక్యుమెంటరీలతో పాటు అడియో క్యాసెట్ ను రూపొందించారు.

  • 2015 – తెలకపల్లి రామచంద్రశాస్త్రి జీవితం సాహిత్యం సంబరాజు రవిప్రకాష్
  • 2015 - తెలంగాణలో తొలిరామాయణ బతుకమ్మ పాట బుక్కసిద్ధాంతి
  • 2016 - చెంచు మహాసభ - దేశపతి శ్రీనివాస్, ముచ్చర్ల దినకర్ రావు
  • 2016 - పాలమూరుజిల్లా ఆత్మకథలు, జీవిత చరిత్రలు - సంబరాజు రవిప్రకాష్ రావు
  • 2017 - నాగర కందనూలు కథ కపిలవాయి లింగమూర్తి
  • 2017 - జనశంకరుడు - వనపట్ల సుబ్బయ్య
  • 2017 - తెలంగాణ తేనె పలుకు - వనపట్ల సుబ్బయ్య
  • 2017 – సంతకం కవిత్వం - ప్రతాప్ కౌటిల్య
  • 2017 – ఎరుక దీర్ఘకవిత - గుడిపల్లి నిరంజన్
  • 2017 - పెరుమాళ్ల శతకం - రాజారత్నం
  • 2017 విశ్వబాల శతకం - రాజరత్నం
  • 2018 - మాదిగ మహాయోగి దున్నఇద్దాస్ - విశ్వనాథం
  • 2023 - కేసరి సముద్రం బుద్ధుడు - వనపట్ల సుబ్బయ్య, వెంకట్ పవార్
  • 2016 – భజేకృష్ణవేణీమ్ కష్ణానది స్తుతి అడియో క్యాసెట్ - తెల్కపల్లి రామచంద్రాశాస్త్రి
  • 2025 - మన ప్రజాపాలన ప్రగతి వైపుకు తెలంగాణ పయనం - ముచ్చర్ల దినకర్
  • 2025 - దినకర్ వ్యాసాలు ముద్రితంలో ఉన్నది
  • 2025 - తిక్కన వాక్య - సంబరాజు రవిప్రకాష్
  • 2025 – వరధన రామాయణం వాక్య - సంబరాజు రవిప్రకాష్

ముచ్చర్ల దినకర్ నాగర్ కర్నూల్ కేంద్రంగా సాగిన మలిదశ తెలంగాణ ఉద్యమ ముందుభాగాన ఉండి పోరాడాడు. ఉప్పెనలా ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమంలో తానో కెరటమై "బలిదానాలు వద్దు - బతికి సాదిద్దాం" అనే నినాదంతో నిర్వహించిన సభ కందనూలు చరిత్రలో తన స్థానాన్ని లిఖించుకున్నది. ఆయన పాత్రికేయుడు, దర్శకుడు, నిర్మాత,వీడియోగ్రాఫర్ సంపాదకుడు, రచయిత ఇలా అనేక పాత్రల్లోకి ఒదిగిపోయి ఒప్పించి మెప్పించిన ప్రతిభాశాలి.

డాక్యుమెంటరీలు

[మార్చు]

అవార్డులు

[మార్చు]
  • 2011 -ఉత్తమ నంది అవార్డు రాష్ట్రస్థాయి
  • 2016 -ఉత్తమ జర్నలిస్టు అవార్డు
  • 2018 -సాహిత్య సేవారత్న రాష్ట్రస్థాయి పురస్కారం
  • 2021 -39వ ప్రపంచ వారసత్వ దినోత్సవ రాష్ట్రస్థాయి పురస్కారం

మూలాలు

[మార్చు]
  1. "మన ప్రజా పాలన పుస్తకాన్ని ఆవిష్కరించిన." Swetchadaily. 12 September 2025. Archived from the original on 19 September 2025. Retrieved 19 September 2025.