ముజ్తాబా హుస్సేన్
| ముజ్తాబా హుస్సేన్ | |
|---|---|
| జననం | 1936 జూలై 15 హైదరాబాదు, హైదరాబాదు రాష్ట్రం, బ్రిటిష్ రాజ్ |
| మరణం | 2020 మే 27 (వయసు: 83) హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం |
| వృత్తి | రచయత |
| ప్రసిద్ధి | ఉర్దూ వ్యంగ్యం |
| బంధువులు | ఇబ్రహీం జలీస్ (సోదరుడు) |
ముజ్తాబా హుస్సేన్ (1936 జూలై 15 - 2020 మే 27), ఉర్దూ సాహిత్యంలో భారతీయ రచయిత.[1]
ప్రారంభ జీవితం
[మార్చు]హుస్సేన్ 1936 జూలై 15న తెలంగాణలోని హైదరాబాదులో జన్మించాడు.[2] ఆయన సోదరుడు ఇబ్రహీం జలీస్ కూడా హాస్యరచయిత, భారతదేశ విభజన తర్వాత పాకిస్తాన్‌కు వలస వెళ్లాడు.
కెరీర్
[మార్చు]హుస్సేన్ అనేక పుస్తకాలు, 15 హాస్య సంపుటాలు ప్రచురించాడు, వాటిలో చాలా వరకు హిందీ, ఇంగ్లీష్, ఇతర భాషలలోకి అనువదించబడ్డాయి.[3] అప్నే యాద్ మే, ఒక స్వీయచరిత్రాత్మక వ్యంగ్యం, ఉర్దూ కే షెహర్ ఉర్దూ కే లాగ్, బెహర్ హాల్, సఫర్ లఖ్త్ లఖ్త్, మేరా కాలమ్ ఆయన కొన్ని ముఖ్యమైన రచనలు.[4][5][6][7] ఆయన జీవిత వృత్తాంతాన్ని న్యూ ఢిల్లీలోని ఎడ్యుకేషనల్ పబ్లిషింగ్ హౌస్ ముజ్తాబా హుస్సేన్ జైసా దేఖా జైసా పాయా అనే పేరుతో ఒక పుస్తకంగా ప్రచురించింది, ఆయన రచనలపై ముజ్తాబా హుసేన్ ఐనోన్ కే బీచ్ అనే మరో పుస్తకాన్ని కూడా వారు ప్రచురించారు.[8][9] ఉర్దూ భాషా భారతీయ దినపత్రిక అయిన సియాసత్ డైలీ, హుస్సేన్ పై ప్రత్యేక వెబ్సైట్ ను ప్రారంభించింది, ఇక్కడ ఆయన రచనల మొత్తం 6500 పేజీలకు పైగా 25 పుస్తకాలు చదవడానికి అందుబాటులో ఉన్నాయి.[10]
గుర్తింపు
[మార్చు]2007లో, ఉర్దూ సాహిత్యానికి ఆయన చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం ఆయనకు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ ప్రదానం చేసింది.[11]
అయితే, భారతదేశం కొత్తగా సవరించిన పౌరసత్వ చట్టం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ద్వేషం, నిరసనల వాతావరణాన్ని పేర్కొంటూ 2019లో ఆయన పద్మశ్రీ అవార్డును తిరిగి ఇచ్చాడు.[12]
మరణం
[మార్చు]ముజ్తాబా హుస్సేన్ 2020 మే 27న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మరణించాడు.[13]
మూలాలు
[మార్చు]- ↑ "Mujtaba Hussain – A humorist par excellence". The Hindu. 1 April 2013. Retrieved 15 January 2016.
- ↑ Nizami, Zafar Ahmad. "Mujtaba Hussain". Qalmi khāke, Mashoor Shakhsiyat Ka Jame Taaruf [Pen Sketches: Brief Biographical Sketches of Famous Personalities] (in ఉర్దూ). Jogabai, New Delhi: Institute of Objective Studies. pp. 131–132.
- ↑ "A Reading of Urdu Satire". Hindi Urdu Flagship. 2016. Retrieved 15 January 2016.
- ↑ Mujtab Hussain (2011). Urdu ke sheher urdu ke log. ISBN 978-8182238220.
- ↑ Mujtaba Hussain (2011). Behar hal. ISBN 978-8182238572.
- ↑ Mujtaba Hussain (2011). Safar lakht lakht. ISBN 978-8182238930.
- ↑ Mujtaba Hussain (2011). Mera Column. ISBN 978-8182239128.
- ↑ G. Kaur (2013). Mujtaba hussain jaisa dekha jaisa paya. Educational Publishing House.
- ↑ Srivastava M. L. (2013). Mujtaba Hussain Ainon ke Beech. Educational Publishing House. ISBN 978-93-5073-118-5.
- ↑ "Siasat website on Mujtaba Hussain's writings". Siasat. 11 August 2015. Retrieved 15 January 2016.
- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2016. Archived from the original (PDF) on 19 అక్టోబర్ 2017. Retrieved 3 January 2016.
{{cite web}}: Check date values in:|archive-date=(help) - ↑ "Noted Urdu writer Padma Shri Mujtaba Hussain passes away". The New Indian Express. 27 May 2020. Retrieved 29 May 2020.
- ↑ "Urdu author, satirist Mujtaba Hussain passes away in Hyderabad". Telangana Today. Retrieved 27 May 2020.