ముత్తిన హార
| ముత్తిన హార | |
|---|---|
| దస్త్రం:Muthina Haara.jpg DVD కవరు | |
| దర్శకత్వం | ఎస్.వి.రాజెంద్రసింగ్ బాబు |
| స్క్రీన్ ప్లే | ఎస్.వి.రాజెంద్రసింగ్ బాబు |
| కథ | వి.ఎం.జోషి |
| నిర్మాత | ఎస్.వి.రాజెంద్రసింగ్ బాబు |
| తారాగణం | |
| ఛాయాగ్రహణం | డి.వి.రాజారామ్ |
| కూర్పు | గౌతంరాజు |
| సంగీతం | హంసలేఖ |
నిర్మాణ సంస్థ | రోహిణి పిక్చర్స్ |
| పంపిణీదార్లు | రాజస్సు షరాఫ్ ఫిల్స్మ్ |
విడుదల తేదీ | 1990 ఆగస్టు 22 |
సినిమా నిడివి | 162 నిమిషాలు[1] |
| దేశం | భారతదేశం |
| భాష | కన్నడం |
ముత్తిన హార (ముత్యాల హారం) అనేది 1990లో రాజేంద్ర సింగ్ బాబు దర్శకత్వం వహించిన కన్నడ యుద్ధ నాటక చిత్రం . ఇందులో విష్ణువర్ధన్, సుహాసిని మణిరత్నం ప్రధాన పాత్రల్లో నటించారు. కెఎస్ అశ్వత్, కావ్య, రామ్‌కుమార్ సహాయక పాత్రల్లో నటించారు. సైనికుడి కుటుంబంపై యుద్ధం కలిగజేసే ప్రభావం గురించి ఈ చిత్రం మాట్లాడుతుంది. ఈ సినిమా ప్రధాన కథాంశంలో కొంత భాగాన్ని ఎర్నెస్ట్ హెమింగ్‌వే 1929 నవల, ఎ ఫేర్‌వెల్ టు ఆర్మ్స్ నుండి తీసుకున్నారు.[2]
కథాంశం
[మార్చు]బర్మాలో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో జవాన్‌గా పనిచేస్తున్న అచ్చప్ప, రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో గాయపడ్డాడు. లెఫ్టినెంట్ అన్నపూర్ణ అనే నర్సు అతన్ని చూసుకుంటుంది. ఆమె కూడా కర్ణాటకలోని కూర్గ్ ప్రాంతానికి చెందినది. వారు ఒకరినొకరు ప్రేమించుకుని యుద్ధం ముగిసిన తర్వాత పెళ్ళి చేసుకుంటారు. అచ్చప్ప తిరిగి ఉద్యోగానికి వెళ్తాడు. అన్నపూర్ణ ఇప్పుడు తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి తన అత్తమామల వద్ద ఉంటుంది; మామ బెల్లియప్ప హవల్దార్‌గా పదవీ విరమణ చేశాడు. అన్నపూర్ణ వీరరాజు అనే కొడుకుకు జన్మనిస్తుంది. కానీ ప్రసవ సమయంలో సమస్యల కారణంగా ఆమె ప్రాణాలను కాపాడటానికి ఆమె గర్భాశయాన్ని తొలగించాల్సి వస్తుంది. ఇక, ఆమె మరొక బిడ్డను కనే అవకాశం ఉండదు.
1952లో కొరియాలో ఉన్న అచ్చప్పను భారతదేశంలోని రాజస్థాన్ బదిలీ చేశారు. కొన్ని సంవత్సరాలుగా ఇంటి నుండి దూరంగా ఉన్నందున, అతను తన చిన్న కొడుకును చూడాలని ఆరాటపడుతూ ఉంటాడు. రాజస్థాన్ ఎడారిలో ఆయనను కలవడానికి ఆయన భార్య, కుమారుడు వెళ్తారు. అచ్చప్ప చూసేలోపే, శత్రువు చేసిన వైమానిక దాడిలో అతని కొడుకు వీరరాజు ప్రాణాలు కోల్పోతాడు. అచ్చప్ప, అన్నపూర్ణ బాధపడతారు. అన్నపూర్ణ తిరిగి సైన్యంలో నర్సుగా చేరుతుంది. ఆమె పట్టుబట్టినప్పటికీ అచ్చప్ప, బిడ్డ కోసం మరో పెళ్ళి చేసుకోవడానికి నిరాకరిస్తాడు. సంవత్సరాలు గడిచేకొద్దీ వారు ఒకరిపై ఒకరు అనురాగంతో ఉంటారు. తమ కొడుకు మరణం గురించి తమ తల్లిదండ్రులకు తెలియకుండా చూసుకుంటారు.
ఇప్పుడు మేజర్ అయిన అచ్చప్ప, డెహ్రాడూన్ ఇండియన్ మిలిటరీ అకాడమీ యువ క్యాడెట్లకు శిక్షణ ఇస్తాడు. పదేళ్లుగా అతన్ని, అతని కుటుంబాన్ని కలవకపోవడం వల్ల, అతని వృద్ధ తల్లిదండ్రులు వారిని చూడటానికి వస్తారు. అపరాధభావంతో ఉన్న అన్నపూర్ణ వారి కొడుకు మరణం గురించి వారికి వెల్లడిస్తుంది. అనారోగ్యంతో ఉన్న అచ్చప్ప తల్లి ఆ వార్త విని షాక్కు గురై మరణిస్తుంది. ఇంతలో, మరొక యుద్ధం చెలరేగింది, అచ్చప్ప తన దళంతో మంచుతో కప్పబడిన సరిహద్దు ప్రాంతానికి వెళ్తాడు. అతని దళాన్ని, అతన్ని శత్రువులు బంధించి, వారి భూభాగానికి తీసుకెళ్లి, ఒక నిర్దిష్ట సైనిక రహస్యాన్ని బహిర్గతం చేయడానికి హింసిస్తారు. అయితే, అచ్చప్ప లొంగిపోవడానికి నిరాకరించి, వాళ్ళు పెట్టే హిందను భరిస్తాడు. అతని దళంలో నాయక్ మోహన్ అనే యువ, ఆశాజనక సైనికుడు ఉన్నాడు, అచ్చప్ప అతన్ని తన కుమారుడిగా భావిస్తాడు. ఇద్దరూ తప్పించుకుని భారత భూభాగంలోకి వ్స్తారు. కాని ప్రాణాంతకంగా గాయపడతారు. అచ్చప్ప అక్కడ మరణించగా, అతని శిష్యుడు సైనిక ఆసుపత్రిలో మరణిస్తాడు. మరణించేముందు అతడు, అచ్చప్ప మరణం గురించి మేజర్ అన్నపూర్ణకు వెల్లడిస్తాడు. అచ్చప్పకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించగా, అన్నపూర్ణ తన మానసిక సంతులతను కోల్పోతుంది.
తారాగణం
[మార్చు]
- విష్ణువర్ధన్ అచ్చప్పగా
- సుహాసిని అన్నపూర్ణగా
- కె. బెల్లియప్పగా ఎస్. అశ్వత్
- రామ్‌కుమార్ నాయక్ - మోహన్
- కావ్య
- మాస్టర్ ఆనంద్, వీర్రాజుగా
- ప్రకాష్ రాజ్, సైనికుడిగా
- సిహి కహి చంద్రు
- సదాశివ బ్రహ్మావర్, చెంగప్పగా
- ముఖ్యమంత్రి చంద్రు
నిర్మాణం
[మార్చు]ఈ చిత్రం ప్రారంభోత్సవం సందర్భంగా పార్వతమ్మ రాజకుమార్ తొలి షాట్ కు క్లాప్ కొట్టింది.[3] సుహాసిని మణిరత్నం మైసూరులోని లొకేషన్కు రాకపోవడంతో, షూటింగును బెంగళూరుకు మార్చారు.[4] సినిమాను 1965 నాటిదిగా చూపించేందుకు, ఎస్. వి. రాజేంద్ర సింగ్ బాబు ఏడుగురు సహాయక దర్శకులను నియమించుకున్నాడు. బర్మా నుండి టేబుళ్ళు, కుర్చీలు తీసుకువచ్చారు. ఆసుపత్రులను బ్రిటిష్ వారివిగా కనిపించేలా చేయడానికి, బ్రిటిష్ జెండాను తయారు చేసి, యుద్ధ వ్యతిరేక ఫోటోలు, హిట్లర్ వ్యతిరేక నినాదాలను ఫోటోకాపీ చేశారు. సైనికుల పాత్రల్లో ఉన్న 500 మందికి సైనిక స్వెటర్లను తయారు చేయడానికి పది మంది టిబెటన్లు సహాయం చేశారు.[5] ఈ చిత్రం కాశ్మీర్లో 30 రోజులకు పైగా చిత్రీకరించబడింది. "సినిమా అంతటినీ భయంభయంగానే చిత్రీకరించాం" అని సింగ్ బాబు చెప్పాడు. "భారత దళాలు, వేర్పాటువాద శక్తుల మధ్య తరచుగా జరిగిన కాల్పుల కారణంగా" షెడ్యూల్ ప్రణాళిక ప్రకారం ముందుకు సాగలేదు. సుహాసినిని షూటింగ్కు హాజరు కావడానికి అనుమతించలేదు కాబట్టి సింగ్ బాబు, అప్పటి కాశ్మీర్ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాతో మాట్లాడవలసి వచ్చింది.[6] 1989 అక్టోబరు 17న షూటింగ్ సమయంలో, తన పారాచూట్ తెరుచుకోనందున విష్ణువర్ధన్ 900 అడుగుల (270 మీ) నుండి పడిపోయి, ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు.[7] చిత్రం కోసం విష్ణువర్ధన్ సైనిక దుస్తులు, మడకేరిలో సాంప్రదాయ దుస్తులు, పొగమంచు ఉన్న ప్రాంతానికి అటవీ దుస్తులు, ఉన్ని దుస్తులతో సహా అనేక విభిన్న దుస్తులను ధరించాల్సి వచ్చింది.[5] ఈ చిత్రాన్ని కొడగులోని తలాకావేరి, దాని చుట్టుపక్కల ప్రదేశాలలోను, రాజస్థాన్లోని జైసల్మేర్లోనూ చిత్రీకరించారు.[8][9] మొత్తం 120 రోజుల పాటు షూటింగు జరిగింది.[10]
సౌండ్‌ట్రాక్
[మార్చు]హంసలేఖ సంగీతం సమకూర్చాడు. అన్ని పాటలకు సాహిత్యం కూడా రాశాడు.[11] ఈ కంపోజింగ్ సెషన్లు బెంగళూరు, మైసూర్లలో జరిగాయి.[12] సింగ్ బాబు ప్రకారం, "దేవరు హోసెద" పాట సాహిత్యం ప్రకృతి లోని నాలుగు కాలాలను మానవ జీవితంలోని నాలుగు దశలతో పోల్చి చూస్తుంది. ఈ పాట పాడటానికి బాబు, హంసలేఖ ఎం. బాలమురళీకృష్ణను కలిసినప్పుడు, అతను మొదట్లో నిరాకరించాడు. పదేపదే అభ్యర్థించిన తరువాత అంగీకరించాడు.[13] బాలమురళీకృష్ణ తన స్వరంతో అసంతృప్తి చెంది పరిపూర్ణతను సాధించాలనుకోవడంతో చెన్నైలోని ప్రసాద్ స్టూడియోలో రాత్రి 9 గంటలకు మొదలైన రికార్డింగు మరుసటి రోజు ఉదయం 3 గంటలకు ముగిసింది.[13]
| క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
|---|---|---|---|---|---|---|---|---|---|
| 1. | "మడికేరి సిపాయి" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర | 4:40 | ||||||
| 2. | "కొడగినోలు బెడగినోలు" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | 5:13 | ||||||
| 3. | "సారూ సారూ మిల్ట్రీ సారూ" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర, లతా హంసలేఖ | 5:01 | ||||||
| 4. | "కొడగిన వీరా" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | 5:56 | ||||||
| 5. | "దేవరు హోసెద ప్రేమద దారా" | బాలమురళీకృష్ణ, చిత్ర | 6:01 | ||||||
| 26:51 | |||||||||
విడుదల
[మార్చు]సింగ్ బాబు ప్రకారం, ఈ చిత్రం పట్టణ ప్రాంతాల్లో బాగా ఆడింది కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఆడలేదు.[14]
పురస్కారాలు
[మార్చు]- 38వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు[15]
- 1990-91 కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు
- ఉత్తమ చిత్రం-రాజేంద్ర సింగ్ బాబు
- ఉత్తమ సహాయ నటుడు-కె. ఎస్. అశ్వత్
- ఉత్తమ సినిమాటోగ్రాఫర్-డి. వి. రాజారాం
- ఉత్తమ నటి-సుహాసిని మణిరత్నం
- ప్రధాన స్రవంతి విభాగంలో ప్రదర్శించబడింది
మూలాలు
[మార్చు]- ↑ Rajadhyaksha, Ashish; Willemen, Paul (1998) [1994]. Encyclopaedia of Indian Cinema. British Film Institute and Oxford University Press. p. 498. ISBN 0-19-563579-5.
- ↑ "Bypassing copycats, Sandalwood style". Bangalore Mirror (in ఇంగ్లీష్). 29 January 2012. Archived from the original on 29 March 2019. Retrieved 2 September 2018.
- ↑ "Bypassing copycats, Sandalwood style". Bangalore Mirror (in ఇంగ్లీష్). 29 January 2012. Archived from the original on 29 March 2019. Retrieved 2 September 2018.
- ↑ ಬಾಬು, ಎಸ್ ವಿ ರಾಜೇಂದ್ರ ಸಿಂಗ್ (19 April 2015). "ಸಿಕ್ಕು ಬಿಡಿಸಿಕೊಂಡ 'ಮುತ್ತಿನ ಹಾರ'". Prajavani (in కన్నడ). Archived from the original on 10 June 2024. Retrieved 25 June 2024.
- ↑ 5.0 5.1 ವಾರ್ತೆ, ಪ್ರಜಾವಾಣಿ (17 May 2015). "ಮುತ್ತಿನಹಾರದ ಉಡುಗೆ ತೊಡುಗೆ ಕಥನ". Prajavani (in కన్నడ). Archived from the original on 10 June 2024. Retrieved 25 June 2024.
- ↑ "With Article 370 revoked, the Kannada film industry looks at shooting in Kashmir again". The Hindu. 8 September 2019. Archived from the original on 17 December 2023. Retrieved 5 June 2024.
- ↑ "Beloved objects, people, thoughts". Bangalore Mirror. 31 December 2009. Archived from the original on 7 June 2024. Retrieved 7 June 2024.
- ↑ "Reel sites, real lights". Deccan Herald. 2 February 2016. Archived from the original on 6 June 2024. Retrieved 5 June 2024.
- ↑ "ಅಂದು ವಿಷ್ಣುವರ್ಧನ್ 'ಮುತ್ತಿನ ಹಾರ'; ಇಂದು ದರ್ಶನ್ 'ರಾಜ ವೀರ ಮದಕರಿ ನಾಯಕ'! ಏನಿದು ಕನೆಕ್ಷನ್?". Vijaya Karnataka (in కన్నడ). 25 February 2020. Archived from the original on 28 June 2024. Retrieved 28 June 2024.
- ↑ ವಾರ್ತೆ, ಪ್ರಜಾವಾಣಿ (10 May 2015). "'ಮುತ್ತಿನಹಾರ'ದ ಮೊದಲನೆ ಅಧ್ಯಾಯ". Prajavani (in కన్నడ). Archived from the original on 10 June 2024. Retrieved 25 June 2024.
- ↑ "Bypassing copycats, Sandalwood style". Bangalore Mirror (in ఇంగ్లీష్). 29 January 2012. Archived from the original on 29 March 2019. Retrieved 2 September 2018.
- ↑ "Bypassing copycats, Sandalwood style". Bangalore Mirror (in ఇంగ్లీష్). 29 January 2012. Archived from the original on 29 March 2019. Retrieved 2 September 2018.
- ↑ 13.0 13.1 "He gave masterpiece status to song from war movie". Deccan Herald. 23 November 2016. Archived from the original on 7 June 2024. Retrieved 7 June 2024.
- ↑ "Bypassing copycats, Sandalwood style". Bangalore Mirror (in ఇంగ్లీష్). 29 January 2012. Archived from the original on 29 March 2019. Retrieved 2 September 2018.
- ↑ "Bypassing copycats, Sandalwood style". Bangalore Mirror (in ఇంగ్లీష్). 29 January 2012. Archived from the original on 29 March 2019. Retrieved 2 September 2018.