ముద్దంశెట్టి హనుమంతరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ముద్దంశెట్టి హనుమంతరావు సుప్రసిద్ధ, ప్రఖ్యాత కథా, నవలా రచయిత, నాటక ప్రయోక్త, చిత్రకారుడు, నటుడు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఇతడు 1928 డిసెంబరు నెలలో శ్రీకాకుళం జిల్లా, కలివరం గ్రామంలో జన్మించాడు[1]. రంగులరాజు, ప్రముఖ చిత్రకారుడు వడ్డాది పాపయ్య వద్ద చిత్రలేఖనాన్ని అభ్యసించి ఎన్నో చిత్రాలు వేశాడు. ఉద్యోగరీత్యా ఖరగ్‌పూర్ రైల్వే శాఖలో పనిచేసి పదవీ విరమణ అనంతరం విశాఖపట్నంలో స్థిరపడ్డాడు. ఎస్.ఎస్‌.ఎల్‌.సి. చదువుతుండగానే నాటకాలయందు ఆసక్తి చూపి శ్రీకృష్ణ తులాభారంలో కృష్ణుడి పాత్ర ధరించి మెప్పించాడు. రైల్వే ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తూనే సమాజపు పోకడలపై స్పందిస్తూ విచిత్రజీవులు, శ్రీకారం, కథ కంచికి, అంతా మోసం, దెయ్యం మొదలైన నాటికలు, నాటకాల్లో పాత్రలు ధరించడంతో పాటు కొన్నింటికి దర్శకత్వం కూడా వహించాడు. ప్రవాసాంధ్ర నాటక కళా పరిషత్తు, ఆంధ్ర విజ్ఞాన సమితి స్థాపించి కోల్‌కతా, భిలాస్‌పూర్, భిలాయ్, జంషెడ్‌పూర్, గెద్దనాపల్లి, రాయగడ, శ్రీకాకుళం, బరంపురం, గరివిడి తదితర ప్రాంతాల్లో పర్యటించి నాటక ప్రదర్శనలు ఇస్తూ న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ నాటక రంగాన ప్రత్యేక స్థానాన్ని పొంది గురుతర బాధ్యతలు నిర్వహించాడు. ఇతని ఆత్మీయత కథ హిందీలోకి అనువదించబడింది. కొత్తబట్ట కథ ఆంగ్లంలో వచ్చింది. సమకాలీన భారతీయ సాహిత్యం అనే సంస్థ 1992లో ఆత్మీయత కథను అపనాపన్ పేరుతో ప్రచురించింది. 1994లో ప్రశాంత్‌కుమార్ మహంతి ఇదే కథను ఒరియాలోకి అనువదించారు. ఆ తరువాత బెంగాలీలోకి కూడా తర్జుమా చేయబడింది. శిక్ష అనే నవల ఒరియా భాషలో వచ్చింది. తన సాహితీ జీవితంలో లెక్కకు మించిన అవార్డులు, రివార్డులు స్వీకరించాడు. మార్చి 14, 1990లో మద్రాసు తెలుగు అకాడమీ అవార్డు, 27 ఆగస్టు 2000లో ఢిల్లీ తెలుగు అకాడమీ, కూరెళ్ల ట్రస్టు పురస్కారం, బొబ్బిలి వారి విజ్ఞాన వర్ధని పురస్కారం ఇతని కీర్తికిరీటంలో కలికితురాయిల్లా నిలిచాయి. రావూజీ నేతృత్వంలోని అమ్మ సంస్కృతి సంస్థాన్ ప్రదర్శించిన 93 నిరంతర నాటక ప్రదర్శనలకు ముద్దంశెట్టి ప్రత్యేక ఆహ్వానితుడు. విశాఖ సాహితి ఉపాధ్యక్షుడిగా సేవలందించాడు. ఇతడు తన డెబ్భై తొమ్మిదవ ఏట 12 మే 2005 న మరణించాడు. ముద్దంశెట్టి హనుమంతరావు నవలలు, పూర్తి సాహిత్యంపై ఏప్రిల్ 2001లో కె.పరిపూర్ణ అనే పరిశోధకురాలు పరిశోధన చేసి డాక్టరేట్ పొందింది.

రచనలు

[మార్చు]

ఇతడు తన సాహితీ జైత్రయాత్రను 1950 ప్రాంతంలో ప్రారంభించి కడ దాకా సాగించిన సాహితీ సేవలో 650 కథలు, 50 నవలలు, 20 రేడియో కథానికలు, 10 టెలీఫిల్ముల కథలు రచించాడు.

నవలలు

[మార్చు]
 1. పాడులోకం
 2. ఇది త్యాగంకాదు [2]
 3. వారసులు
 4. అనర్థం
 5. దైవఘటన
 6. అగుపించని అంకుశం
 7. పసిడి మనసు
 8. చైతన్యపథం
 9. కక్ష
 10. మంచికి వారసులు
 11. మళ్లీ వసంతం
 12. వ్యామోహం
 13. వాసు చదువు
 14. పరంధామయ్య

నాటకాలు, నాటికలు

[మార్చు]
 1. నిమిత్తమాత్రులు[3]
 2. ఆలుమగలు

కథా సంపుటాలు

[మార్చు]
 1. కథావాహిని-14 [4]
 2. అతకని ఆంతర్యాలు
 3. కల కరిగింది
 4. పారిజాతం
 5. ముద్దంశెట్టి హనుమంతరావు కథలు
 6. సహనశీలి

కథలు

[మార్చు]

ఇతని కథలు[5] తెలుగు సంక్రాంతి, ఆంధ్రపత్రిక,రచన,ఆంధ్రజ్యోతి,ప్రియదత్త,సాహితి,ఆంధ్రప్రభ,యువ,ఉదయం, తెలుగు స్వతంత్ర,ఇండియా టుడే, ఈనాడు, ప్రతిభ, మందాకిని,ప్రగతి, విశాలాంధ్ర,చుక్కాని,స్వాతి,చతుర,జయశ్రీ, దేవదత్తం, సుప్రభాతం,జ్యోతి,వసుధ,స్నేహ,విపుల,పల్లకి,కానుక,జయమ్‌,సోవియట్ భూమి,కోకిల,జయకేతన,కళాసాగర్,ఆంధ్రప్రదేశ్,స్మిత,సూర్యప్రభ తదితర పత్రికలలో ప్రచురింపబడ్డాయి. వాటిలో కొన్ని కథలు:

 1. ?
 2. అంతరార్థం
 3. అంతర్మథనం
 4. అందంలో విషం
 5. అతకని ఆంతర్యాలు
 6. అతి తెలివి
 7. అనుకోని అదృష్టం
 8. అనూరాధ
 9. అపరాజిత...
 10. అపార్థం
 11. అపోహ
 12. అభిమానధనుడు
 13. అమానుషం
 14. అమృతహృదయుడు
 15. అమ్మాయి అదృష్టం
 16. అవగాహన
 17. అస్త్రం
 18. అస్వతంత్రులు
 19. ఆంతర్యం
 20. ఆంతర్యాలు
 21. ఆఖరి తప్పు
 22. ఆగంతకుడు
 23. ఆడదే అలిగిన నాడు
 24. ఆడవాళ్ళూ మీరు మారాలి
 25. ఆత్మగౌరవం
 26. ఆత్మీయత
 27. ఆదిలోనే హంసపాదు
 28. ఆమె తీర్పు
 29. ఆవేశాలు
 30. ఆశ
 31. ఆశయాలు ఆవేశాలు
 32. ఇదీ త్యాగమే
 33. ఇల్లాలి నిర్ణయం
 34. ఉన్నతుడు
 35. ఉషోదయం
 36. ఊహించని ...
 37. ఎదురుదెబ్బలు
 38. ఎవరు బాధ్యులు?
 39. ఎవరు...
 40. ఓడిపోయిన నిజం
 41. కంచే చేను మేస్తే...?
 42. కక్ష
 43. కనువిప్పు
 44. కన్నీటికథ
 45. కర్తవ్యం
 46. కల కరిగింది
 47. కలగామిగిలిన తలపు
 48. కలహప్రియుడు
 49. కళ్లుతెరు
 50. కళ్ళుతెరిచింది
 51. కవచం
 52. కొత్తకోడలు
 53. కొత్తబట్టలు
 54. గతిలేని తాంబూలాలు
 55. గృహప్రవేశం
 56. గెలుపు
 57. చప్పట్లు
 58. చాతుర్యం
 59. చిగిరించిన జీవితం
 60. చిన్నమనసు
 61. చీకటి తెరలు
 62. చెడిపోయిన జగ్గయ్య
 63. చైతన్యపధం
 64. జాగృతి
 65. జానకి విజయం
 66. జారిన తరుణం మళ్లీరాదు
 67. జీవచ్ఛవాలు
 68. జ్వాల
 69. తండ్రి మనసు
 70. తనదాకా వస్తే..?
 71. తప్పిన పతనం
 72. తప్పిపోయిన నరకం
 73. తప్పునాదేనండి
 74. తప్పులేని శిక్ష
 75. తస్మాత్ జాగ్రత్త
 76. తిరుగుబాటు
 77. తీపివిషం
 78. తీరని కోరిక
 79. తీరనివాంఛలు
 80. తృప్తి
 81. తెరవని తలుపులు
 82. తెలవారింది
 83. తేనెపూసిన కత్తి
 84. దగాపడిన సత్యం
 85. దొంగకాని దొంగ
 86. దొంగలు
 87. దొరగారి అల్పాహారం
 88. దోపిడి
 89. ద్రోహి
 90. నమ్మని నిజం
 91. నిజమైన డాక్టరు
 92. నిన్ను దూరం చేసుకోలేను
 93. నిప్పులాంటి నిజం
 94. నీతిలేని కథ
 95. నీలి తెర
 96. నూర్రూపాయల నోటు
 97. నైజం
 98. నొసటి రాత
 99. న్యాయమెక్కడుంది?
 100. పంతం
 101. పగ
 102. పరాజిత
 103. పరిష్కారం
 104. పరువుదక్కింది
 105. పర్యవసానం
 106. పాపం పార్వతమ్మ
 107. పాపం రంగడు
 108. పారిజాతం
 109. పూర్వ పరిచయం
 110. పెంచిన ప్రేమ
 111. పెద్దమనసు
 112. పెద్దరికం
 113. పొమ్మనలేక...
 114. ప్రతీకార వాంఛ
 115. ప్రతీకారం
 116. ప్రాప్తి
 117. ప్రేరణ
 118. ఫొటో
 119. బలహీనత
 120. బాధ్యత
 121. బాబోయ్ వేషం వెయ్యను!
 122. బుట్టబొమ్మల గాంభీర్యం
 123. బుద్దొచ్చింది
 124. బుద్ధి చెప్పింది
 125. భంగపడిన ఆశయం
 126. భయం
 127. భేదోపాయం
 128. మంచిమాట నేర్చుకో
 129. మంచీచెడూ
 130. మధ్యవర్తిత్వం
 131. మనసు విలువ
 132. మనసున్న మగువ
 133. మనసుమారింది
 134. మనస్తత్వాలు
 135. మమకారం
 136. మమత
 137. మరవలేని మంచితనం
 138. మర్యాదస్తులు
 139. మళ్లీవెలుగు వచ్చింది
 140. మాటలు చేతలు
 141. మానవ నైజం
 142. మానవత
 143. మార్పు
 144. మార్పు కావాలా?
 145. మీరే ఆలోచించండి
 146. ముందు చూపు
 147. ముష్టిభోగం
 148. యోగంలేదు
 149. రహస్యం
 150. రాక్షసప్రవృత్తి
 151. లక్ష్యం...
 152. వర్షంకురిసిన రోజు
 153. వారసత్వం
 154. వాసు చదువు
 155. విచక్షణ
 156. విజేత
 157. విముక్తి
 158. విరుగుడు
 159. విరుద్ధఫలితాలు
 160. విలువలు
 161. విశాల...
 162. విశాలహృదయం
 163. వెక్కిరించిన సానుభూతి
 164. వెన్నుపోటు
 165. వెలుగు చూడని నిజం
 166. వెలుగుబాట
 167. వ్యక్తిత్వం
 168. వ్యర్ధత్యాగం
 169. శత్రువు
 170. శేషప్రశ్న
 171. షాక్
 172. షాన్
 173. సంసారిరాజు
 174. సద్వినియోగం
 175. సమానాంతరరేఖలు
 176. సరళరేఖ
 177. సరికొత్త...
 178. సహన శీలి
 179. సహనానికి సరిహద్దు
 180. సహృదయ సౌందర్యం
 181. సహృదయులు
 182. స్వార్ధపరుడు
 183. స్వార్ధము
 184. స్వేచ్ఛ
 185. హమ్మయ్య

మూలాలు

[మార్చు]
 1. అడపా రామకృష్ణ (2014-02-14). "కథల మేటి... ముద్దంశెట్టి". ఆంధ్రభూమి దినపత్రిక. Retrieved 10 July 2015.[permanent dead link]
 2. ముద్దంశెట్టి హనుమంతరావు (1966). ఇది త్యాగంకాదు. విజయవాడ: నవజ్యోతి పబ్లికేషన్స్. Retrieved 10 July 2015.
 3. ముద్దంశెట్టి హనుమంతరావు (1960-05-01). నిమిత్తమాత్రులు. విజయవాడ: ఆదర్శ గ్రంథమండలి. Retrieved 10 July 2015.
 4. ముద్దంశెట్టి హనుమంతరావు (1955). కథావాహిని 14. విజయవాడ: ఆదర్శ గ్రంథమండలి. Retrieved 10 July 2015.
 5. ముద్దంశెట్టి హనుమంతరావు. "రచయిత: ముద్దంశెట్టి హనుమంతరావు కథలు". కథానిలయం. కాళీపట్నం రామారావు. Archived from the original on 10 మార్చి 2016. Retrieved 10 July 2015.