ముద్దరాజు రామన్న

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ముద్దరాజు రామన్న తెలుగు రచయిత, కవి.

జీవిత విశేషాలు[మార్చు]

అతను నందవరీక నియోగి బ్రాహ్మణుడు. అతని తండ్రి గణపయామాత్యుడు. అతను 16వ శతాబ్దము వాడని తెలియుచున్నది. మనకు లభ్యమౌతున్న నాలుగు తరంగాలలో ఈయన తాతంభట్టు ఒరవడినే కొనసాగిస్తూ ప్రతి సూత్రానికి ఉదాహరణలిచ్చాడు. అయితే, ఈయన ఉదాహరణల కోసం ఎక్కువగా కవిత్రయం రాసిన మహాభారతం మీదే ఆధారపడడం విశేషం.[1]

రచనలు[మార్చు]

అతను కవిజనసంజీవని అనే లక్షణ గ్రంథము రచించెను. అతడు రాఘవపాండవీయమున కు వ్యాఖ్యానమునుగూడ వ్రాసెను. ఈకవి "శ్రీమన్మదనగోపాలకృపాకటాక్ష సంప్రాప్తసారసారస్వత సంపదానంద" యని గద్యమునందు వ్రాసికొన్నను లక్షణగ్రంథమును బట్టి కవిత్వపటుత్వనిర్ణయము చేయబూనుట యుచితముకాదు. ఇతడించుమించుగా లింగమగుంట తిమ్మకవితోడి సమకాలికు డగుటచే నీకవి లోక సంజీవనినుండి యతడు తన సులక్షణసారములో నేమియు గైకొనలేదు.[2]

మూలాలు[మార్చు]

  1. "తెలుగు వ్యాకరణాల పరిచయం – Page 2 – ఈమాట" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-07-04.
  2. "ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము/ముద్దరాజు రామన్న - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2020-07-04.