ముద్దసాని దామోదర రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముద్దసాని దామోదర రెడ్డి
ముద్దసాని దామోదర రెడ్డి

పదవీ కాలం
1985-2004
నియోజకవర్గం కమలాపూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1956-07-20)1956 జూలై 20
మామిడాలపల్లి, వీణవంక మండలం, కరీంనగర్ జిల్లా, తెలంగాణ
మరణం 2012 ఏప్రిల్ 9(2012-04-09) (వయసు 55)
హైదరాబాదు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
నివాసం నకిరేకల్

ముద్దసాని దామోదర రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. తెలుగుదేశం పార్టీ తరపున కమలాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ప్రాతినిథ్యం వహించాడు. మంత్రిగా కూడా పనిచేశాడు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

దామోదర్ రెడ్డి 1956, జూలై 20న తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా, వీణవంక మండలంలోని మామిడాలపల్లి గ్రామంలో జన్మించాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

దామోదర్ రెడ్డికి మాలతిరెడ్డితో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు (కశ్యప్ రెడ్డి) ఉన్నాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

కరీంనగర్ జిల్లా కమలాపూర్ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున శాసనసభ్యుడిగా నాలుగుసార్లు ప్రాతినిథ్యం వహించాడు. నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ వ్యవస్థాపకులు, స్వర్గీయ నందమూరి తారక రామారావుల మంత్రివర్గంలో యువజన వ్యవహారాలు, పర్యాటక శాఖ, రవాణా శాఖ, సాంకేతిక మంత్రిగా పనిచేశాడు. కరీంనగర్ జిల్లాకు చెందిన హుజురాబాద్ నియోజకవర్గానికి టిడిపి ఇంచార్జిగా కూడా పనిచేశాడు.

1985లో టిడిపి నుండి పోటిచేసి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామచంద్రారెడ్డిపై 15,118 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 1989లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లింగంపల్లి వీరారెడ్డిపై 6,284 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 1994లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేతిరి సాయిరెడ్డిపై 27,317 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 1999లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎరుకల వీరేశంపై 16,092 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.

2004లో పోటిచేసి టిఆర్ఎస్ అభ్యర్థి ఈటెల రాజేందర్ చేతిలో 19,619 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 2009 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు జరిగిన ఎన్నికల్లో మహాకూటమి పొత్తులో భాగంగా కమలాపూర్ సీటును టిఆర్ఎస్ రావడంతో దామోదర్ రెడ్డి పోటీచేయలేదు. 2010లో హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గంకు జరిగిన ఉపఎన్నికలో పోటిచేసి టిఆర్ఎస్ అభ్యర్థి ఈటెల రాజేందర్ చేతిలో 79,227 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

మరణం

[మార్చు]

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముద్దసాని దామోదర రెడ్డి నిజామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (నిమ్స్) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2012, ఏప్రిల్ 9న మృతి చెందాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. Srinivas (2012-04-09). "మాజీ మంత్రి ముద్దసాని దామోదర రెడ్డి మృతి". www.telugu.oneindia.com. Archived from the original on 2021-11-10. Retrieved 2021-11-10.
  2. Webdunia. "Damodar Reddy | Died | Huzurabad Incharge | Chandrababu | మాజీ మంత్రి ముద్దసాని దామోదర రెడ్డి మృతి చెందారు!!". Webdunia. Retrieved 2021-11-10.
  3. "ముద్దసాని దామోదర రెడ్డి". Archived from the original on 2016-03-04. Retrieved 2015-06-15.
  4. "Ex-Minister Damodar Reddy dead". The Hindu (in Indian English). 2012-04-10. ISSN 0971-751X. Archived from the original on 2017-03-05. Retrieved 2021-11-10.