ముద్దా విశ్వనాథం
Appearance
ముద్దా విశ్వనాథం | |
---|---|
జననం | ముద్దా విశ్వనాథం 1904 పిఠాపురం |
ఇతర పేర్లు | దామూ |
వృత్తి | పాత్రికేయుడు,రచయిత, అనువాదకుడు |
ప్రసిద్ధి | ఛాయ, తూలిక |
మతం | హిందూ |
తండ్రి | సోమప్ప శాస్త్రి |
ముద్దా విశ్వనాథం చందమామ, ఆనందవాణి, ప్రజామిత్ర వంటి పత్రికలలో సంపాదకుడిగా పనిచేశాడు. ఇతడు మంచి రచయిత కూడా. ఇతని తండ్రి పేరు సోమప్పశాస్త్రి. ఇతడు కవితాసమితి సభ్యుడు. ఇతడు 1904వ సంవత్సరంలో తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో జన్మించాడు. [1] "గౌరాంగ చరిత్రము" వ్రాసిన కూచి నరసింహం పంతులు ఇతనికి మేనమామ.
రచనలు
[మార్చు]- ఛాయ (రేడియోనాటికలు) [2]
- తూలిక (కథాసంపుటం) [3]
- జన్మభూమి (నాటికలు) [4]
- ఆత్మజ్యోతి (టాల్‌స్టాయి రచనకు అనువాదం)
- శుభోదయము (టాల్‌స్టాయి రచనకు అనువాదం)
- ఆనంద సామ్రాజ్యము (టాల్‌స్టాయి రచనకు అనువాదం)
- రామనామం
- ప్రేమాంజలి (టాల్‌స్టాయి రచనకు అనువాదం)
- సంధ్య (టాల్‌స్టాయి రచనకు అనువాదం)
- మాలిక (కథాసంపుటం)
- చిత్రసీమ (టాల్‌స్టాయి రచనకు అనువాదం)
- మాయలోకం (తొమ్మిది జీవిత తరంగాలు)
- దేవదూత (టాల్‌స్టాయి రచనకు అనువాదం)
మూలాలు
[మార్చు]- ↑ Whos Who Of Indian Writers (1 ed.). న్యూఢిల్లీ: సాహిత్య అకాడమీ. p. 403. Retrieved 26 January 2022.
- ↑ ముద్దా, విశ్వనాథం (ఆగస్టు 1956). ఛాయ (2 ed.). రాజమండ్రి: విశ్వసాహిత్యమాల. Retrieved 15 January 2015.
- ↑ ముద్దా, విశ్వనాథం (1934). తూలిక. Retrieved 15 January 2015.
- ↑ ముద్దా, విశ్వనాథం (1954). జన్మభూమి (3 ed.). తాడేపల్లిగూడెం: జయనికేతన్. Retrieved 15 January 2015.