ముద్దుల కొడుకు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముద్దుల కొడుకు
(1979 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం వి.బి.రాజేంద్రప్రసాద్
నిర్మాణం వి.బి.రాజేంద్ర ప్రసాద్
కథ రాజశ్రీ
చిత్రానువాదం రాజశ్రీ
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు ,
జయసుధ,
శ్రీదేవి,
భాను ప్రకాష్
సంగీతం కె.వి.మహదేవన్
సంభాషణలు సత్యానంద్
ఛాయాగ్రహణం పి.ఎస్.సెల్వరాజ్
కూర్పు ఎ. సంజీవి
నిర్మాణ సంస్థ జగపతి ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

ముద్దుల కొడుకు 1979 లో వచ్చిన శృంగార చిత్రం. జగపతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై విబి రాజేంద్ర ప్రసాద్ [1] నిర్మించి, దర్శకత్వం వహించాడు.[2] ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి, జయసుధ నటించారు. కెవి మహదేవన్ సంగీతం సమకూర్చారు.[3][4]

కథ[మార్చు]

గోపి (అక్కినేని నాగేశ్వరరావు) జీవితాన్ని ఉల్లాసంగా గడిపే యువకుడు. అతను బాధ్యతలు తెలియనందున అతని తండ్రి జమీందార్ రాబహదూర్ రంగారావు (గుమ్మడి) వారి ఎస్టేట్ నిర్వహణను చేపట్టమని కోరతాడు. ఎస్టేటుకు వెళ్ళే దారిలో గోపికి ఒక అందమైన అమ్మాయి రాధ (శ్రీదేవి) తో పరిచయం ఏర్పడుతుంది. పరిస్థితులు అతన్ని ఆమె ముందు డ్రైవర్‌గా నిలబెడతాయి. వారు ప్రేమలో పడతారు. గోపి రహస్యంగా రాధను ఆలయంలో పెళ్ళి చేసుకుంటాడు. దాని గురించి తెలుసుకొని, జమీందారు అక్కడికి వస్తాడు. అప్పుడు రాధకు కూడా నిజం తెలుస్తుంది. గోపి తనను మోసం చేసినట్లు భావిస్తుంది. అదే రాత్రి, ఆమె ఇంటికి నిప్పు పెట్టి రాధాను చంపెయ్యాలని జమీందారు తన అనుచరులను ఆదేశిస్తాడు. గోపి ఆమె చనిపోయిందని భావిస్తాడు. కానీ అదృష్టవశాత్తూ, ఆమె తప్పించుకుని తన సోదరి శాంతి (జయసుధ) వద్దకు చేరుకుంటుంది. ఆ సమయానికి, రాధ గర్భవతి. అక్కడ, దుఃఖంలో ఉన్న గోపి తాగుబోతు అవుతాడు. జమీందారు కూడా తాను చేసినకి పశ్చాత్తాప పడతాడు. అదృష్టానికి, రాధ గోపి సన్నిహితుడు డాక్టర్ మురళి (మురళి మోహన్) ఆసుపత్రిలో ఒక పండంటి అబ్బాయికి జన్మనిచ్చి మరణిస్తుంది. చనిపోయే ముందు, ఆమె ఆ పిల్లవాడిని గోపి వారసునిగా చేయమని శాంతి నుండి ఒక మాట తీసుకుంటుంది. తన కలను నెరవేరుస్తుందని శాంతి వాగ్దానం చేస్తుంది. తరువాత, మురళి సహాయంతో శాంతి వారి ఇంట్లో పనిమనిషిగా చేరుతుంది. సంవత్సరాలు గడిచిపోతాయి, బాలుడు (మాస్టర్ హరీష్) పెరుగుతాడు, అందరి ప్రేమను, ఆప్యాయతను పొందుతాడు, ఆ తరువాత, శాంతి తన గుర్తింపును వెల్లడిస్తుంది. గోపి హృదయం ఆనందంతో ఉప్పొంగుతుంది. శాంతి గోపీని దుర్గుణాల నుండి బయట పడేస్తుంది. గోపి శాంతిని ప్రేమించి ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. కానీ అప్పటికే నిశ్చితార్థం జరిగిందని శాంతి నిరాకరించింది. కొంతకాలం తర్వాత, టిబి కారణంగా శాంతి మరణానికి దగ్గరగా ఉందనే వాస్తవాన్ని గోపి గ్రహిస్తాడు. చివరికి, గోపి తన మూత్రపిండాన్ని దానం చేసి ఆమెను రక్షిస్తాడు. చివరగా గోపి శాంతిల పెళ్ళితో సినిమా ముగుస్తుంది.

నటవర్గం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

పాటలు[మార్చు]

ఎస్. పాట పేరు గాయకులు పొడవు
1 "ఓలోలే నీ సోకు" ఎస్పీ బాలు, పి.సుశీల 4:15
2 "చిటపట చినుకుల మేళం" ఎస్పీ బాలు, పి.సుశీల 4:25
3 "చీకటి వెలుగుల" ఎస్పీ బాలు, పి.సుశీల 4:24
4 "ఒక్కసారి మందు కొట్టు" ఎస్పీ బాలు, పి.సుశీల 4:50
5 "దగాలు చేసి దిగాలు" ఎస్పీ బాలు, పి.సుశీల 4:02
6 "ఎధలో రగిలే జ్వాలా" ఎస్పీ బాలు 4:09

మూలాలు[మార్చు]

  1. "Muddula Koduku (Direction)".
  2. "Muddula Koduku (Banner)".
  3. "Muddula Koduku (Cast & Crew)". Archived from the original on 2021-03-07. Retrieved 2020-08-21.
  4. "Muddula Koduku (Review)". Archived from the original on 2021-02-28. Retrieved 2020-08-21.