మునిగంటి పానకాలరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మునిగంటి పానకాలరావు (1882 - 1918) ప్రముఖ నటుడు, గాయకుడు మరియు వాగ్గేయకారులు.

వీరు కాకినాడలో నారాయణరావు పంతులు మరియు వెంకటరత్నమ్మ దంపతులకు జన్మించారు. అన్నయ్య గారి దగ్గర సంగీతం నేర్చుకొని కాకినాడలో ఒక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు.

వీరు మంచి నటులు కావడం వలన సంగీతానికి నటన తోడై వాటికి అందమైన శరీరం శ్రావ్యమైన కంఠం వన్నె తెచ్చాయి. వీరు ఆంధ్ర దేశంలో అనేక ముఖ్యమైన పట్టాణాలలో సంగీత సభలు చేసి ఖ్యాతిని పొందారు.

వీరు "స్వరవర్ణ సుధానిధి" మరియు "సంగీతకృతి దర్పణము" అనే ఉత్కృష్టమైన రచనలను సంగీత లోకానికి అందించారు.

వీరు 36 సంవత్సరాల యుక్త వయసులో 1918 సంవత్సరం పుష్య బహుళ పంచమి రోజున పరమపదించారు.