మునుగోడు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం
తెలంగాణ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతెలంగాణ మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°4′48″N 79°4′48″E మార్చు
పటం

నల్గొండ జిల్లా లోని 12 శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గంలో 5 మండలాలు ఉండగా తాజాగా గట్టుప్పల్ మండలంగా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 6 మండలాలుగా కొనసాగుతుంది.

6 మండలాలు కాదు 7 మండలాలు. చౌటుప్పల్, నారాయణపురం, మునుగోడు, నాంపల్లి, చండూరు, మర్రిగూడ, గట్టుప్పల్,

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు

[మార్చు]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2023[1] 93 మునుగోడు జనరల్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పు కాంగ్రెస్ 119624 కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పు బీఆర్ఎస్ 79034
2022 93

(ఉపఎన్నిక)

మునుగోడు జనరల్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పు టీఆర్ఎస్ 97,006 కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పు బీజేపీ 86,697
2018 93 మునుగోడు జనరల్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పు కాంగ్రెసు 97239 కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పు తెరాస 74687
2014 93 మునుగోడు జనరల్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పు TRS 65496 పాల్వాయి స్రవంతి స్త్రీ IND 27441
2009 93 మునుగోడు జనరల్ ఉజ్జిని యాదగిరిరావు[2] పు CPI 57383 పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పు INC 53789
2004 293 మునుగోడు జనరల్ పల్లా వెంకట్ రెడ్డి పు CPI 55252 చిలువేరు కాశీనాథ్ పు తె.దే.పా 43967
1999 293 మునుగోడు జనరల్ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పు INC 45134 మార్కండేయ జెల్ల పు తె.దే.పా 41095
1994 293 మునుగోడు జనరల్ ఉజ్జిని నారాయణరావు పు CPI 55209 పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పు IND 23655
1989 293 మునుగోడు జనరల్ ఉజ్జిని నారాయణరావు పు CPI 51445 పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పు INC 43183
1985 293 మునుగోడు జనరల్ ఉజ్జిని నారాయణరావు పు CPI 44733 పుంగల నారాయణరావు పు INC 23950
1983 293 మునుగోడు జనరల్ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పు INC 30084 బొమ్మగాని ధర్మభిక్షం పు CPI 19773
1978 293 మునుగోడు జనరల్ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పు INC 31635 కంచర్ల రామకృష్ణారెడ్డి పు JNP 18004
1972 286 మునుగోడు జనరల్ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పు INC 24995 ఉజ్జిని నారాయణరావు పు CPI 16266
1967 286 మునుగోడు జనరల్ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పు INC 26204 ఉజ్జిని నారాయణరావు పు CPI 10582

2004 ఎన్నికలు

[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో మునుగోడు శాసనసభ నియోజకవర్గం నుండి సి.పి.ఐ పార్టీకి చెందిన పల్లా వెంకటరెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చిలువెరు కాశీనాథ్‌పై 11285 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. వెంకటరెడ్డి 55252 ఓట్లు పొందగా, కాశీనాథ్ 43967 ఓట్లు సాధించాడు.

2022 ఉప ఎన్నిక

[మార్చు]

మునుగోడు ఎమ్మెల్యేగాలో గెలిచిన రాజగోపాల్ రెడ్డి 2022 ఆగస్టు 2న కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమయింది. కేంద్ర ఎన్నికల సంఘం నవంబరు 3న ఉప ఎన్నికల పోలింగ్‌ నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అక్టోబరు 7న ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై, అక్టోబరు 14 చివరి తేదీగా, నామినేషన్ల పరిశీలనకు అక్టోబరు 15వ తేదీని గడువు ప్రకటించింది.[3] నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబరు 17వరకు గడువు ఇవ్వగా, ఈ ఉప ఎన్నికకు మొత్తం 130 మంది అభ్యర్థులు 190 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా, 47 మంది నామినేషన్లు తిరస్కరించబడగా మిగిలిన 83 మందిలో 36 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా, 47 మంది ఉప ఎన్నిక బరిలో నిలిచారు.[4] మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం నవంబరు 1న ముగిసింది.[5]

మునుగోడు నియోజకవర్గంలో 2022 ఉప ఎన్నిక నాటికీ మొత్తం 2,41,855 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,21,720 మంది పురుషులు, 1,20,128 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.[6] మునుగోడు ఉపఎన్నిక నవంబరు 3న జరగగా 93.13 శాతం పోలింగ్‌ నమోదయింది. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,41,805 ఓట్లు ఉండగా, 2,25,192 మంది తమ ఓటు హక్కు  వినియోగించుకోగా, 686 పోస్టల్‌ ఓట్లు పోలయ్యాయని ఎన్నికల అధికారులు వెల్లడించారు.[7] నవంబరు 6న జరిగిన కౌంటింగ్ లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 10,309 ఓట్ల మెజారిటీతో గెలిచాడు.[8][9]

ప్రధాన పార్టీ అభ్యర్థులు

[మార్చు]
  1. టీఆర్‌ఎస్ - కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
  2. బీజేపీ - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
  3. కాంగ్రెస్ - పాల్వాయి స్రవంతి రెడ్డి
  4. బీఎస్పీ - ఆందోజు శంకరాచారి
  5. టీజేఎస్‌ - పల్లె వినయ్‌కుమార్‌ గౌడ్[10]
ఉప ఎన్నిక 2022: మునుగోడు
పార్టీ అభ్యర్థి ఓట్లు %
టీఆర్‌ఎస్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 97,006 42.95
బీజేపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 86,697 38.38
కాంగ్రెస్ పాల్వాయి స్రవంతి రెడ్డి 23,906 10.58
నోటా పైవేవీ కాదు 482 0.21
మెజారిటీ 10309
పోలింగ్ శాతం
నమోదైన ఓటర్లు 2,41,805
పోలైన ఓట్లు 2,25,192[11]
బీజేపీ పై టీఆర్‌ఎస్ గెలిచింది[12]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  2. Sakshi (20 October 2023). "ఏక్‌బార్‌.. ఎమ్మెల్యే". Archived from the original on 24 October 2023. Retrieved 24 October 2023.
  3. "మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్ ఇదే : మునుగోడు ఉప ఎన్నికల‌ షెడ్యూల్ ఇదే." 2022. Archived from the original on 18 October 2022. Retrieved 18 October 2022.
  4. "మునుగోడు ఉప ఎన్నిక బరిలో 47మంది అభ్యర్థులు". 17 October 2022. Archived from the original on 18 October 2022. Retrieved 18 October 2022.
  5. "మునుగోడులో ప్రచారం బంద్.. ఇప్పటివరకూ ఎన్ని కోట్లు పట్టుబడ్డాయో తెలిస్తే." 1 November 2022. Retrieved 1 November 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  6. Namasthe Telangana (2 November 2022). "మునుగోడు ఉపఎన్నిక.. పోలింగ్‌కు సర్వంసిద్ధం". Archived from the original on 2 November 2022. Retrieved 2 November 2022.
  7. Eenadu (4 November 2022). "ఓటుకు పోటెత్తారు". Archived from the original on 4 November 2022. Retrieved 4 November 2022.
  8. 10TV Telugu (6 November 2022). "'మునుగోడు'లో టీఆర్ఎస్ గెలుపు.. రెండో స్థానంలో బీజేపీ.. డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్". Archived from the original on 6 November 2022. Retrieved 6 November 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  9. Andhra Jyothy (7 November 2022). "గెలవడమే పదివేలు". Archived from the original on 7 November 2022. Retrieved 7 November 2022.
  10. Andhra Jyothy (18 October 2022). "చిన్న పార్టీలతో పెద్ద సవాల్‌!" (in ఇంగ్లీష్). Archived from the original on 18 October 2022. Retrieved 18 October 2022.
  11. "Election Commission of India". 7 November 2022. Archived from the original on 7 November 2022. Retrieved 7 November 2022.
  12. "Munugode bypoll: తెరాస విజయహాసం". EENADU. 2022-11-07. Archived from the original on 2022-11-07. Retrieved 2022-11-07.

ఇవి కూడా చూడండి

[మార్చు]