మునెయ్య

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

డాక్టర్ మునెయ్య (ఆంగ్లం: K.Muneyya) వైఎస్ఆర్ జిల్లా, దొమ్మరనంద్యాల గ్రామానికి చెందిన ప్రముఖ జానపద గాయకుడు. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు ఐననూ ప్రవృత్తి రీత్యా ఈయన జానపద కళాకారుడు. రాయలసీమ నలుమూలలా తిరిగి కనుమరుగౌతున్న జానపద పాటలను సేకరించి భావి తరాలకోసం వాటిని జాగ్రత్తగా భద్రపరిచారు. వీరు పాడిన ఆ గేయాలు కడప ఆకాశవాణి కేంద్రం నుండి ప్రసారంకాబడ్డాయి. వీరు 1995 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

పాటల సేకరణ[మార్చు]

వీరు దాదాపు 10,000 పాటలను సేకరించారు. వీరు సేకరించిన వాటిలో జనాదరణ పొందిన పాటలు కొన్ని:

  • కోడి బాయె లచ్చమ్మది.. కోడి పిల్లబాయె లచ్చమ్మది
  • తుమ్మేదలున్నాయేమిరా...
  • కట్నం కట్నం అంటావేమిరో..
  • బంగారు జడ కుచ్చుల నా వదిన..
  • కోల్.. కోల్.. కోల్.. కోలాటం
  • నాంచారి...
  • కొయ్యి కొయ్యంగానే కోడికూత మానేసి కైలాసం నేను పోయినాదంటది కోడిపిల్ల...
  • చీరలు కావాలా.. రైకలు కావాలా..
  • గనిగుంతలు తిరిగాను.. చీకు చెట్లు ఎక్కాను

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మునెయ్య&oldid=2054417" నుండి వెలికితీశారు