ముప్పలనేని శివ
ముప్పలనేని శివ | |
---|---|
![]() | |
జననం | ముప్పలనేని శివ 25 నవంబరు 1968 |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | దర్శకుడు |
ముప్పలనేని శివ ఒక ప్రముఖ సినీ దర్శకుడు. తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థలైన సురేష్ ప్రొడక్షన్స్, స్రవంతి మూవీస్, సూపర్ గుడ్ ఫిలింస్, రామకృష్ణ సినీ స్టూడియోస్ లతో సినిమాలు చేశాడు.[1][2]
జీవిత విశేషాలు
[మార్చు]ముప్పలనేని శివ గుంటూరు జిల్లా, బాపట్లలో 1968, నవంబరు 25 న జన్మించాడు. తన స్వస్థలమైన నరసాయ పాళెంలో పమిడి అంకమ్మ ఉన్నత పాఠశాలలో చదివాడు. బాపట్లలోని ఆర్ట్స్ అండ్ సైన్సు కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. కాలేజీ రోజుల్లో పెయింటింగ్ లో అభినివేశం ఉండేది. ఆధునిక చిత్రకళలో రాష్ట్ర స్థాయి పురస్కారాలు కూడా అందుకున్నాడు.
కెరీర్
[మార్చు]ప్రారంభంలో శివ ఎ.కోదండరామిరెడ్డి, ముత్యాల సుబ్బయ్య, పరుచూరి సోదరులతో కలిసి పనిచేశాడు. కోదండరామిరెడ్డి దగ్గర సుమారు 20 సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. ఆ సమయంలో అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, కమల్ హాసన్, శ్రీదేవి వంటి వారితో పనిచేశాడు. 1994 లో కృష్ణతో కలిసి ఘరానా అల్లుడు అనే సినిమా చేశాడు. తర్వాత 1995లో వచ్చిన తాజ్ మహల్ సినిమాతో మంచి గుర్తింపు పొందాడు.
సినిమాలు
[మార్చు]వ.సం | సంవత్సరం | సినిమా |
---|---|---|
1 | 1994 | ఘరానా అల్లుడు |
2 | 1995 | తాజ్ మహల్ |
3 | 1997 | కోరుకున్న ప్రియుడు |
4 | 1997 | ప్రియా ఓ ప్రియా |
5 | 1998 | గిల్లి కజ్జాలు |
6 | 1998 | శుభలేఖలు |
7 | 1999 | స్పీడ్ డాన్సర్ |
8 | 1999 | రాజా (1999 సినిమా) |
9 | 2000 | మా పెళ్ళికి రండి |
10 | 2000 | పోస్ట్ మ్యాన్ |
11 | 2001 | అమ్మాయి కోసం |
12 | 2002 | నీ ప్రేమకై |
13 | 2002 | సందడే సందడి |
14 | 2004 | దోస్త్ |
15 | 2005 | సంక్రాంతి |
16 | 2006 | రాజాబాబు |
17 | 2007 | అల్లరే అల్లరి |
18 | 2009 | లైఫ్ స్టైల్ |
19 | 2016 | శ్రీశ్రీ |
మూలాలు
[మార్చు]- ↑ "Muppalaneni Shiva". blogspot.in. 22 November 2011. Archived from the original on 4 నవంబరు 2014. Retrieved 11 February 2013.
- ↑ "Muppalaneni Shiva Filmography". telugucolours.com. Retrieved 11 February 2013.