ముప్పాళ్ళ నాగేశ్వరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

డాక్టర్ ముప్పాళ్ళ నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక రోదసీ శాస్త్రవేత్త. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

నేపధ్యం[మార్చు]

ప్రకాశం జిల్లా తర్చూరు మండలం, గోడవాడ గ్రామంలో నిరుపేద వ్యవసాయ కుటుంబంలో ఆయన జన్మించారు. తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, వీరమ్మ. ప్రాథమిక విద్యాభ్యాసం గోడవాడ గ్రామంలో సాగింది. తర్చూరులో ఉన్నత పాఠశాల‌ విద్య, చీరాల ప్రభుత్వ కళాశాలలో భౌతిక శాస్త్రంలో బీ.ఎస్సీ పూర్తి చేశారు. అనంతరం ఆంధ్రా వర్సిటీలో ఎమ్మెస్సీ ఎలక్ర్టానిక్స్‌ పూర్తి చేసి బంగారు పతకం సాధించారు. ఆ తర్వాత శ్రీ కృష్ణదేవరాయ వర్సిటీలో పీహెచ్‌డీ సాధించారు. 1982లో ఇస్రోలో చేరారు. 2007 నుంచి స్వదేశీ నావిగేషన్‌ వ్యవస్థకు ప్రాజెక్టు డైరెక్టర్‌గా.. బెంగళూరులోని ఇస్రో శాటిలైట్‌ సెంటర్‌లో తన సేవలు అందిస్తున్నారు.[1]

మూలాలు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]