ముప్పిడి జగ్గరాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ముప్పిడి జగ్గరాజు :(1885 - 1938) స్త్రీ పాత్రపోషణలో అందెవేసినచేయి.[1] కాకినాడ సంగీతం అబ్బాయి కంపెనీలో మల్లమ్మ, యశోధర, లీలావతి, చంద్రమతి పాత్రలను పోషించారు. 1902లో రాజమండ్రి లో హిందూ థియేటర్ కంపెనీలో వేణీసంహారం, గయోపాఖ్యానం నాటకాల్లో స్త్రీ పాత్రల్ని ధరించారు. 1906లో స్థాపించిన మానేపల్లి కంపెనీలో అంబడిపూడి కోటయ్య ప్రక్కన సారంగధర లో రత్నాంగి, చిత్రనళీయం లో దమయంతి పాత్రలు, కృత్తివెంటి నాగేశ్వర్ రావు, సత్యవోలు గున్నేశ్వర రావుల నాటకసమాజం లో ప్రముఖ స్త్రీ పాత్రలు ధరించారు. 1913 నుండి 1921 వరకు రాజమండ్రి చింతా వారి థియేటర్ లో నిడసనమెట్టు కొండలరావు, బ్రహ్మజోశ్యుల సుబ్బారావుల సరసన చంద్రమతి, రత్నాగి, కౌసల్య, దమయంతి, లీలావతి, మైనావతి, సీత పాత్రలను ధరించారు. 1922లో బ్రహ్మజోశ్యుల సుబ్బారావు, వెల్లంకి వెంకటేశ్వర్లు, నిడసనమెట్టు కొండలరావు గార్లతో కలిసి వేణుగోపాల విలాస నాటక సభను స్థాపించారు.

మూలాలు[మార్చు]

  1. తెలుగు నాటక ప్రస్థానం - సూర్య పత్రిక[permanent dead link]