మురళీ మనోహర్ జోషి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మురళీ మనోహర్ జోషి
डॉ. मुरली मनोहर जोशी
మురళీ మనోహర్ జోషి


కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
పదవీ కాలం
మే 19, 1998 – మే 22, 2004
ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి
ముందు ఎస్. ఆర్. బొమ్మాయి
తరువాత అర్జున్ సింగ్

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ
పదవీ కాలం
మే 16, 1996 – జూన్ 1, 1996
ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి
ముందు శంకరరావు చవాన్
తరువాత హెచ్ డి. దేవేగౌడ

కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
పదవీ కాలం
మే 19 1999 – మే 22 2004
ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి
తరువాత అమిత్ సిబల్

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
మే 16 2014 – మే 23 2019
ముందు శ్రీప్రకాష్ జైస్వాల్
తరువాత సత్యదేవ్ పచౌరి
నియోజకవర్గం కాన్పూర్
పదవీ కాలం
మే 16 2009 - మే 16 2014
ముందు రాజేష్ కుమార్
తరువాత నరేంద్రమోదీ
నియోజకవర్గం వారణాసి నియోజకవర్గం
పదవీ కాలం
1996-2004
ముందు సరోజ్ దుబే
తరువాత రేవతి రామన్ సింగ్
నియోజకవర్గం అలహాబాద్
పదవీ కాలం
1977–1980
ముందు నరేంద్ర సింగ్ బిష్ట్
తరువాత హరీష్
నియోజకవర్గం ఆల్మోరా

రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలం
జులై 5 1992 – మే 11 1996
పదవీ కాలం
జులై 5 2004 – మే 16 2009
Constituency ఉత్తరప్రదేశ్

వ్యక్తిగత వివరాలు

జననం (1934-01-05) 1934 జనవరి 5 (వయసు 90)
Almora, United Provinces, British India
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి తార్లా జోషి
పూర్వ విద్యార్థి అలహాబాద్ విశ్వవిద్యాలము
సంతకం మురళీ మనోహర్ జోషి's signature

మురళీ మనోహర్ జోషి (జననం: జనవరి 5, 1934) ఈయన భారతీయ రాజకీయ నాయకుడు.[1] ఈయన పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత.[2]ఈయన భారతీయ జనతా పార్టీ లో కీలక సభ్యుడిగా ఉన్నాడు.

తొలినాళ్ళ జీవితం[మార్చు]

ఈయన 1934, జనవరి 5న ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్మోరా లోని కుమావున్ హిల్స్ అనే ప్రాంతంలో జన్మించాడు. ఈయన తన ప్రాథమిక విద్యను చంద్పూర్, జిల్లా బిజ్నోర్, అల్మోరాలో పూర్తిచేసాడు. ఈయన మీరట్ కళాశాలలో బి.ఎస్.సి. విద్యను, అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి ఎమ్.ఎస్.సి. ని పూర్తిచేసాడు. ఈయన అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి డాక్టోరల్ థీసిస్ యొక్క అంశంపై డాక్టరేట్ తీసుకున్నాడు. ఈయన తన పి.హెచ్.డిని అలహాబాద్ విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్రంలో బోధించడం ప్రారంభించాడు.[3]

రాజకీయ జీవితం[మార్చు]

ఈయన తన చిన్న వయసులో ఆర్‌ఎస్‌ఎస్‌తో సంప్రదించి, 1953–54లో ఆవు రక్షణ ఉద్యమంలో పాల్గొన్నాడు. 1955 లో ఉత్తరప్రదేశ్ కి చెందిన కుంబ్ కిసాన్ ఆండోలన్‌లో పాల్గొని, భూమి ఆదాయ అంచనాను సగానికి తగ్గించాలని కోరాడు. భారతదేశంలో అత్యవసర కాలంలో (1975-1977), జోషి 26 జూన్ 1975 నుండి 1977 లోక్ సభ ఎన్నికల వరకు జైలులో ఉన్నాడు. ఈ ఎన్నికల్లో అల్మోరా నుండి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు. భారత చరిత్రలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జనతా పార్టీ (అప్పటి తన పార్టీని కూడా కలిగి) అధికారంలోకి వచ్చినప్పుడు ఈయన జనతా పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. ఆ తరువాత 1980 లో జనతా పార్టీ పేరు భారతీయ జనతా పార్టీ లేదా బిజెపిగా మార్చారు. ఈయన మొదట కేంద్ర కార్యాలయాన్నికి ప్రధాన కార్యదర్శిగా, ఆ తరువాత పార్టీ కోశాధికారి నియమించబడ్డాడు. ఈయన బీహార్, బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలకు బీజేపీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. ఆ తరువాత, అటల్ బిహారీ వాజ్‌పేయి ఆధ్వర్యంలో బిజెపి భారతదేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు, ఈ మంత్రివర్గంలో మానవ వనరుల అభివృద్ధి మంత్రిగా పనిచేశాడు. ఈయన బీజేపీ అభ్యర్థిగా వారణాసి నియోజకవర్గం నుండి 15 వ లోక్‌సభకు ఎన్నికైయ్యాడు. ఈయన 1996 లో 13 రోజుల పాటు ప్రభుత్వానికి హోంమంత్రిగా పనిచేశాడు. 2009 లో బీజేపీ మానిఫెస్టో ప్రిపరేషన్ బోర్డు ఛైర్మన్‌గా నియమితులయ్యాడు. వారణాసి నుండి సిట్టింగ్ ఎంపిగా ఉన్న ఈయన 2014 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీకి ఆ సీటు కోసం వదులుకున్నాడు. కానీ కాన్పూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి 2.23 లక్షల ఓట్ల తేడాతో గెలిచాడు.

మరిన్ని విశేషాలు[మార్చు]

ఈయన భారతీయ జనతా పార్టీ (బిజెపి) లో సభ్యుడు. ఈయన బిజెపి ముఖ్య నాయకులలో ఒకరిగా ఉన్నారు. ఈయన 1991, 1993 మధ్య భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఈయన కాన్పూర్ పార్లమెంటరీ నియోజకవర్గానికి మాజీ పార్లమెంటు సభ్యుడు. ఈయన అలహాబాద్ విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్ర ప్రొఫెసర్ గా పనిచేశాడు. ఈయనకు భారత ప్రభుత్వం 2017 లో రెండవ అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి పద్మవిభూషణ్‌ పురస్కారంతో ఈయనను సత్కరించింది.

మూలాలు[మార్చు]

  1. "List of Padma awardees 2017". The Hindu. January 25, 2017.
  2. Debashish Mukerji (15 November 1998). "Our students don know India's problems (Interview with Murli Manohar Joshi)". The Week. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 2019-12-05.
  3. "Archived copy". Archived from the original on 26 జూన్ 2011. Retrieved 5 డిసెంబరు 2019.{{cite web}}: CS1 maint: archived copy as title (link)

వెలుపలి లంకెలు[మార్చు]