మురాదు భక్షి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మురాద్ బక్ష్ [ مُراد ]
మొఘల్ సామ్రాజ్యానికి చెందిన షాజాదా
జననం1624 అక్టోబరు 8
రోహ్తాసుగఢ్ కోట, బీహార్, ఇండియా
మరణం1661 డిసెంబరు 14(1661-12-14) (వయసు 37)
గ్వాలియరు కోట, మధ్యప్రదేశు, భారతదేశం
Burial
దేశద్రోహి స్మశానవాటిక (గ్వాలియరు)
Spouseసకీనా బాను బేగం
One another wife
వంశముముహమ్మదు యర్ మీర్జా
ఇజ్జాదు బక్షి మీర్జా
దోస్తారు బాను బేగం
ఆసైషు బాను బేగం
హమ్రాజు బాను బేగం
Names
ముహమ్మదు మురాదు బక్షి
Houseతైమురిదు రాజగృహం
తండ్రిషాజహాను
తల్లిముంతాజు మహలు
మతంఇస్లాం

ముహమ్మదు మురాదు బఖ్షి(ఉర్దూ: مُحمّد مُراد بخش), (9 అక్టోబరు 1624 - 1661 డిసెంబరు 14)[1]) మొఘలు యువరాజు, మొఘలు చక్రవర్తి షాజహాను, ఎంప్రెసు ముంతాజు మహలు చిన్న కుమారుడు.[2] ఆయన 1647 సంవత్సరంలో అతని అన్నయ్య ఔరంగజేబు స్థానంలో వచ్చే వరకు ఆయన బాల్ఖుకు సుబేదారుగా పనిచేసాడు తరువాత ఆస్థానంలో ఔరంగజేబు పనిచేసాడు.

కుటుంబం

[మార్చు]

ముహమ్మదు మురాదు బక్షి 1624 అక్టోబరు 9 న బీహారు లోని రోహ్తాస్గఢ్ కోటలో చక్రవర్తి షాజహాను అతని ప్రియమైన భార్య ముంతాజు మహలు చిన్న కుమారుడిగా జన్మించాడు. మురాదు తోబుట్టువులలో ఇద్దరు రాజకీయంగా శక్తివంతమైన సోదరీమణులు, యువరాణులు: జహనారా బేగం, రోషనారా బేగం అలాగే ఆయన తండ్రి వారసుడు పెద్ద సోదరుడు, యువరాజు అయిన దారా షికో, భవిష్యత్తు మొఘలు చక్రవర్తి ఔరంగజేబులు ఆయనకు సోదరులుగా ఉన్నారు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

1638 లో మురాదు బఖ్క్షి తన పద్నాలుగేళ్ల వయసులో, షా నవాజు ఖాను సఫావి కుమార్తె సఫావిదు యువరాణి సకినా బాను బేగంను వివాహం చేసుకున్నాడు. ఆమె తన పెద్ద వదిన, ఔరంగజేబు భార్య దిల్రాసు బాను బేగం చెల్లెలు.[3]

రాజప్రతినిధి

[మార్చు]

ముల్తాను సుబాదరు (1642), బాల్ఖు (1646 ఫిబ్రవరి 16 నుండి 1646 ఆగస్టు 9 ), కాశ్మీరు (1647 ఆగస్టు 20 నుండి 1648 జూలై), దక్కను (1648 జూలై 25 నుండి 1649 సెప్టెంబరు 14), కాబూల్ (1647 జనవరి 23 నుండి 1654 వరకు), గుజరాతు (1654 మార్చి), మాల్వా రాజప్రతినిధిగా పనిచేసాడు.

కోర్టియర్లు

[మార్చు]
  • రాజా అమను ఖాను బహదూరు - 1661 మేవతులో మరణించారు
  • దరారు ఖాను - 1673 మరణించారు, మేవాతు
  • ముహమ్మదు రుస్తాం షేకు- దక్కను వద్ద 1648 లో మరణించారు.
  • ముహమ్మదు అల్లావుద్దీను షేకు- 1655 లో మరణించాడు. ఆయన రుస్తాం షేకు సోదరుడు.
  • మియా ఖాను - 1653 లో దక్కను వద్ద 1653 మరణించారు.
  • రాజుకుమారు హరిరాం సింగు - 1622–1678 (56) 1646-1651 నుండి మురాదు బక్షి డిప్యూటీ. ఆయన నాగ్పూరుకు చెందిన రాజా గజు సింగు కుమారుడు నాగ్పూరుకు చెందిన రాజా అమర సింగు సోదరుడు.
  • రాజకుమార వీరసింగు - 1636–1680 (44) నాగ్పూరుకు చెందిన అమరసింగు పెద్ద కుమారుడు.

వారసత్వ యుద్ధం

[మార్చు]
Murad Baksh, younger brother of Aurangzeb

1657 నవంబరు 30 న తన తండ్రి అనారోగ్యంతో ఉన్నట్లు వార్తల తరువాత ఆయన అహ్మదాబాదులో తనను తాను చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. అదే సంవత్సరంలో ఆయన ఆగ్రాలో షాజహానును కలవడానికి వెళ్తున్న ఒట్టోమను రాయబారి మన్జాడా హుస్సేను ఆఘాను ఆహ్వానించడానికి సూరతు నౌకాశ్రయానికి చేరుకున్నాడు. మన్జాడా హుస్సేను ఆఘా షాజహాను కుమారులు మధ్య జరిగిన యుద్ధాల గురించి తన నిరాశ చెందినట్లు పేర్కొన్నాడు.[4]

షాజహాను పెద్ద కుమారుడు దారా షిఖోను ఓడించడానికి మురాదు బక్షి ఔరంగజేబుతో చేతులు కలిపాడు. వాస్తవానికి మురాదు బఖ్షి, ఆయన సోవార్సు నేతృత్వంలో క్రూరమైన యుద్ధం చివరికి సముగరు యుద్ధంలో ఔరంగజేబుకు అనుకూలంగా యుద్ధ ఫలితాలను మార్చింది.

1658 జూలై 7 న ఆయన తన సోదరుడు ఔరంగజేబుతో ఒక గుడారంలో ఉన్నప్పుడు, ఆయన మత్తులో ఉన్నసమయంలో రహస్యంగా జైలుకు పంపబడి, 1659 జనరిలో గ్వాలియరు కోటకు బదిలీ చేయబడ్డాడు.

1661 లో దివాను మాజీ గుమస్తా అలీ నకీని హత్య చేసినందుకు ఆయన ఒక మరణశిక్ష విచారణను ఆయనకు ఎదుర్కొన్నాడు. ఆ తరువాత ఔరంగజేబు మురాద్ బక్ష్ స్థానంలో గుజరాతు సుబేదార్గా నియమించబడ్డాడు. ఇనాయతు ఖానును సూరతు కొత్త మొఘలు సైనికాధికారిగా నియమించాడు.

సైనిక విజయాలు

[మార్చు]
  • 1642 – 5,000
  • 1646 – 9,000
  • 1648 – 11,000
  • 1656 – 30,000
  • 1658 – 33,000

మరణం

[మార్చు]

1661 డిసెంబరు 14 న మూడు సంవత్సరాల జైలుజీవితం తరువాత ఆయనను గ్వాలియరు కోట వద్ద మరణశిక్షకు గురై మరణించాడు.[5][6] చివరి సోదరుడు మరణించడంతో ఔరంగజేబు " ముఘల్ సారాజ్యం "నికి వివాదరహితుడైన చక్రవర్తి అయ్యాడు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "DELHI (Mughal Empire)". Archived from the original on 1 జనవరి 2019. Retrieved 2 నవంబరు 2019.
  2. "The Indian Empire - Imperial Gazetteer of India, v. 2, p. 402". Archived from the original on 2 నవంబరు 2019. Retrieved 2 నవంబరు 2019.
  3. Waldemar, Hansen (1986). The Peacock Throne: The Drama of Mogul India. Motilal Banarsidass. p. 124.
  4. Farooqi, Naimur Rahman (1 జనవరి 1989). Mughal-Ottoman relations: a study of political & diplomatic relations between Mughal India and the Ottoman Empire, 1556-1748 (in ఇంగ్లీష్). Idarah-i Adabiyat-i Delli.
  5. The Rediscovery of India: A New Subcontinent - Ansar Hussain Khan
  6. "Sháh-Jahán-námas - The History of India". Archived from the original on 3 మార్చి 2016. Retrieved 2 నవంబరు 2019.