మురిపిండి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మురిపిండి
(Arya) Acalypha indica Pilangsari 2019 0.jpg
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
అ. ఇండికా
Binomial name
అకాలిఫా ఇండికా
Acalypha indica.JPG
Acalypha indica W IMG 4050.jpg
Acalypha indica plant 08.JPG

మురిపిండి (ఆంగ్లం Indian Acalypha) ఒక రకమైన ఔషధ మొక్క. మురిపిండిని కుప్పింట, హరిత మంజరి మగబీర అని కూడా అంటారు.ఎకలైఫా ఇండిక పుష్పించే జాతికి చెందిన మొక్క.

లక్షణాలు[మార్చు]

దీనికి క్యట్కిన్ రకమైన పుష్పగుచ్ఛము ఉంది.

బాహ్య లక్షణాలు[మార్చు]

ఇది ఒక సాధారణ హెర్బ్.దీని ఆకులు అండాకారంలో ఉండి 75 cm పొడవు వరకు పెరుగుతాయి. పువ్వులు ఏకలింగ, ఆకుపచ్చని రంగులో ఉంటాయి.

ప్రత్యేక లక్షణాలు[మార్చు]

ఇది అనువైన వాతావరణములో ప్రపంచంలోని నూతన ప్రాంతాలకు పరిచయం చేయబడింది. ఇది చాలా చోట్ల ఒక కలుపుగా పరిచయం చెయ్యబడింది.

ఆర్ధిక ప్రాముఖ్యత[మార్చు]

పశ్చిమ, తూర్పు ఆఫ్రికాల్లో ఈ మొక్కని ఒక ఔషధ మొక్కగా ఉపయోగిస్తారు. ఈ మొక్కకి సంప్రదాయ తమిళుల సిద్ధ వైద్యంలో అత్యున్నత గౌరవము ఉంది. ఇది శరీరంలో చైతన్యం నింపుతుంది అని నమ్ముతారు.

ఉపయోగాలు[మార్చు]


  1. .వెస్ట్ ఆఫ్రికాలో ఆకులు వండుతారు, ఒక కూరగాయల వలె తింటారు.
  2. .వెస్ట్, ఈస్ట్ ఆఫ్రికాలో మొక్క ఒక ఔషధ మొక్క ఉపయోగిస్తారు.

కుప్పింట చెట్టు ?'''''?'''''?


కుప్పింట ఆకులు 9, మిరియాలు 9, కొంచం ముద్ద కర్పూరం కలిపి నూరి శనగ గింజ అంత మాత్రలు కట్టి ఉదయం , సాయంత్రం నీటితో తీసుకుంటూ పథ్యం చేస్తూ పాలు తీసుకుంటూ ఉండిన కామెర్లు హరించును

దీని ఆకు , వేరు పట్ట కలిపి కషాయం లా చేసుకుని తాగినా లేక చూర్ణం లోపలికి తీసుకున్న మొలలు నివారణ అగును.

ఆకుల పసరు పూసిన చర్మరోగాలు నయం అగును.

దీని ఆకుల పసరు గేదెవెన్నలో కలిపి ఇచ్చిన మూర్ఛరోగం నివారణ అగును.

దీని వేరుతో దంతధావనం చేసిన దంతరోగాలు నశించును.

దీని ఆకు పసరు కండ్లలో లేక ముక్కులో పిండిన పిల్లలకు వచ్చు బాలపాపచిన్నెలు నివారణ అగును.

అదే పసరు చెవిలో పిండిన చెవిపోటు నివారణ అగును.

దీని ఆకుల రసం ఒక స్పూన్ లొపలికి ఇచ్చిన వాంతులు చేయను. లొపల పేరుకున్న శ్లేష్మం బయటకి పంపును. బ్రాంకైటిస్ అనగా వగర్పు గల దగ్గు నివారణ అగును.

దీని ఆకు నూరి కట్టిన వ్రణాలు మానును .

తేలు , జెర్రి , కందిరీగ , తేనెటీగ కుట్టిన వెంటనే ఈ ఆకు వేసి కట్టు కట్టిన బాధ నివారణ అగును.

గోరుచుట్టు లేచినప్పుడు దీని ఆకు , వెల్లుల్లిపాయ , తమలపాకు కలిపి నూరి కట్టిన అది పగిలి మానిపోవును .

పుప్పిపంటికి దీని ఆకు నలిపి పుప్పిపంటిలో ఉంచిన బాధ తగ్గిపొవును.

పురుగులు పట్టిన వ్రణములకు మొక్కని నీడలో ఎండబెట్టి చూర్ణం చేసి ఆ చూర్ణం చల్లిన పురుగులు నశించి పుండ్లు మానును .

దీని చూర్ణం నస్యం వలే లొపలికి పీల్చిన మెదడులో గడ్డకట్టిన రక్తం కరుగును.

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]