మురుగన్ ఆరు నిలయాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Six Abodes of Murugan
Arupadaiveedu
Painting of Murugan, c. 1930.
Painting of Murugan, c. 1930.
భౌగోళికం
దేశంIndia
రాష్ట్రంTamil Nadu
ప్రదేశంThiruparankundram, Tiruchendur, Pazhani, Swamimalai, Thiruthani, Pazhamudircholai
సంస్కృతి
దైవంMurugan (Kartikeya)
ముఖ్యమైన పర్వాలు
వాస్తుశైలి
నిర్మాణ శైలులుTamil architecture
దేవాలయాల సంఖ్య6

మురుగన్ ఆరు నివాసాలు, ఇవి దక్షిణ భారతదేశం, తమిళనాడు రాష్ట్రంలో హిందూ దేవత మురుగన్‌కు అంకితం చేయబడిన ఆరు దేవాలయాలు. వీటిని వివిధ దేవాలయాలలో కందస్వామి, కార్తికేయ, స్కంద, వడివేల అని కూడా పిలుస్తారు. మురుగన్ ఈ ఆరు పవిత్ర నివాసాలు గురించి తమిళ సంగం సాహిత్యం, నక్కీరర్ రచించిన తిరుమురుగత్రుపడై, అరుణగిరినాథర్ రచించిన తిరుప్పుగలో ప్రస్తావించబడ్డాయి. తిరుపరంకుండ్రం, తిరుచెందూర్, పళని, స్వామిమలై, తిరుత్తణి, పజముదిర్చోలై అనే ఆరు నివాసాలు ఉదహరించడ్డాయి.

పురాణ కథనం[మార్చు]

స్కాంద పురాణం తమిళ పునరావృతమైన కంద పురాణంలో మురుగన్ పురాణం వివరించబడింది. పురాణ కథనం ప్రకారం, రాక్షసుడైన శూరపద్మన్ ఒకసారి దేవతలను స్వర్గం నుండి తరిమికొడతాడు. దేవతలు ఆ తరువాత విష్ణువు, బ్రహ్మల సహాయం కోరతారు. వారు శివుని తపస్సు నుండి భంగం కలిగించి, పార్వతితో ప్రేమలో పడటానికి కామదేవుడికి ఆపనిని అప్పగిస్తారు. ఆ జంట తరువాత మురుగన్‌కు జన్మనిచ్చింది. మురుగన్ యుద్ధంలో శూరపద్మను చంపి, దేవతలకు స్వర్గాన్ని పునరుద్ధరిస్తాడు. మురుగన్ యుద్ధానికి ముందు దేవతల నాయకుడుగా అభిషేకించబడ్డాడు. మురుగన్ వల్లీ దేవతను ప్రేమతో వివాహం చేసుకున్నాడు. తిరుచెందూరులో జరిగిన యుద్ధం తర్వాత దైవాయనైని వివాహం చేసుకున్నాడు.[1]

తమిళ సాహిత్యంలో, ఐదు రకాల భూమి గురించి వివరించబడింది.అవి కురింజి (పర్వత ప్రాంతం), ముల్లై (అటవీ ప్రాంతం), మారుతం (వ్యవసాయ ప్రాంతం), నీతాల్ (తీర ప్రాంతం), పాలై (ఎడారి ప్రాంతం). సంగం సాహిత్యంలో వివిధ దేవతలు ఈ ప్రాంతాలకు పోషక దేవతలుగా పేర్కొనబడ్డారు. ఈ గ్రంథాల ప్రకారం కురింజి ప్రాంతానికి మురుగన్ ఆరాధ్యదైవం.[2]

మతపరమైన ప్రాముఖ్యత[మార్చు]

 అరుణగిరినాథర్ తిరువణ్ణామలైలో జన్మించిన 15వ శతాబ్దపు తమిళ కవి. ప్రాంతీయ సంప్రదాయం ప్రకారం, అతను తన ప్రారంభ సంవత్సరాలను అల్లర్లతో మహిళలను మోసగించే వ్యక్తిగా గడిపాడు. తన ఆరోగ్యం క్షీణించిన తరువాత, అతను అన్నామలైయార్ ఆలయం ఉత్తర గోపురంపై నుండి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు, కానీ మురుగన్ దేవుని దయతో అతడు రక్షించబడ్డాడు [3] అప్పటి నుండి అతను మంచి భక్తుడుగా మారాడు. అతను మురుగన్‌ను కీర్తిస్తూ తమిళ శ్లోకాలను కూర్పు చేసాడు. వాటిలో అత్యంత ముఖ్యమైంది తిరుప్పుగ .[4][5] అరుణగిరినాథర్ వివిధ మురుగన్ ఆలయాలను సందర్శించి తిరువణ్ణామలైకి తిరుగు ప్రయాణంలో పళనిని దర్శించుకుని స్వామినాథ స్వామిని కీర్తించాడు.[6] తిరుపరంకుండ్రం ఆరు నివాసాలలో మొదటిదిగా పరిగణించబడుతుంది. మురుగన్‌కు బదులుగా వేల్ అనే దివ్యమైన ఈటెకు అభిషేకం నిర్వహించబడే ఏకైక ఆలయం ఇది.[7] పళని మురుగన్ అత్యంత ప్రముఖ నివాసంగా పరిగణించబడుతుంది.[8]

అభ్యాసాలు[మార్చు]

ఆరు దేవాలయాలలోని ప్రధాన సంప్రదాయాలలో ఒకటి, పళని దేవతను అనుకరిస్తూ తమ వెంట్రుకలను విస్మరిస్తానని ప్రతిజ్ఞ చేసే భక్తులు ఇక్కడ క్షవరం చేయుంచుకోవటం ఆచారం. మరొక విషయం, ఆలయాన్ని రోజంతా మూసివేయడానికి ముందు, రాత్రిపూట గంధపు జిగురుతో విగ్రహం తలపై పీఠాధిపతి అభిషేకం చేయడం విశేషం. దానివలన రాత్రిపూట ఔషధ గుణాలు వంటబడతాయని చెప్పబడింది. రక్కల చందనం వలె దానిని భక్తులకు పంపిణీ చేస్తారు.[9] సాధారణంగా అనుసరించే ఆరాధన పద్ధతిలో భక్తులు సాంప్రదాయ దుస్తులను ధరించి, కొండమాదిరి రూపంతో మెరుస్తున్న కాగితంతో తళతళ మెరిసేవిధంగా పూలతో అలంకరించబడిన కావిడిని కాలినడకన కొండపైకి తీసుకువెళ్లడం ఇక్కడ ఆనవాయితీగా ఉంది.[10]

ఆరు నిలయాలు జాబితా[మార్చు]

మందిరం అసలు పేరు (తమిళం) స్థానం చిత్రం వివరణ
అరుల్మిగు సుబ్రమణ్య స్వామి ఆలయం, తిరుపరంకుండ్రం தென்பரங்குன்றம் తిరుపరంకుండ్రం,

మధురై జిల్లా

మురుగన్ ఇంద్రుడి దత్తపుత్రిక దేవనైని వివాహం చేసుకున్నట్లు చెప్పబడే ఒక కొండపై మధురై శివార్లలో ఉంది. నక్కీరార్ ఈ మందిరంలో మురుగన్‌ను పూజించినట్లు భావిస్తారు. ఇక్కడ శివుడిని పరంగిరినాథర్‌గా పూజించినట్లు చెబుతారు. ఇది ఆరుపదవీధుల్లో మొదటిది.
అరుల్మిగు సుబ్రమణ్య స్వామి ఆలయం, తిరుచెందూర్ திருச்சீரலைவாய் తిరుచెందూర్, తూత్తుకుడి జిల్లా
గంధమాదన పర్వతం లేదా సంతానమలై (చెప్పుల పర్వతం) అవశేషాల మధ్య తూత్తుకుడి సమీపంలోని సముద్ర తీరంలో ఉంది. శివుడిని ఆరాధించడం ద్వారా మురుగన్ అసుర సూరపద్మపై నిర్ణయాత్మక విజయం సాధించిన ప్రదేశాన్ని ఈ ఆలయం స్మృతి చేస్తుంది.
అరుల్మిగు దండాయుతపాణి స్వామి దేవాలయం, పళని திருவாவினன்குடி పళని, దిండిగల్ జిల్లా
దిండిగల్ జిల్లాలో పళని కొండపైన ఒక మురుగన్ ఆలయం కూడా ఉంది, ఇక్కడ 'దండాయుతపాణి' ప్రధాన దైవం, ధ్యాన స్థితిలో, తన చేతుల్లో ('పాణి') ఆయుధంగా ('అయుత') దండను ధరించి ఉన్నాడు. దివ్య ఫలం విషయంలో తన కుటుంబంతో గొడవపడిన తర్వాత మురుగన్ నివాసం ఉండే ప్రదేశం ఇది.
అరుల్మిగు స్వామినాథ స్వామి ఆలయం, స్వామిమలై திருவேரகம் స్వామిమలై, తంజావూరు జిల్లా
కుంభకోణం నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం కృత్రిమ కొండపై నిర్మించబడింది. మురుగ ప్రణవ మంత్రం " ఓం " సారాంశాన్ని తన తండ్రి శివుడికి వివరించిన సంఘటనను ఈ ఆలయం జ్ఞాపకం చేస్తుంది.
అరుల్మిగు సుబ్రమణ్య స్వామి ఆలయం, తిరుత్తణి குன்றுதோறாடல் తిరుత్తణి, తిరువళ్లూరు జిల్లా
చెన్నైకి సమీపంలో ఉన్న మురుగన్ అసురులతో యుద్ధం చేసిన తర్వాత తన అంతర్గత శాంతిని తిరిగి పొందాడని, ఇక్కడ వల్లిని వివాహం చేసుకున్నాడని చెబుతారు.
అరుల్మిగు సోలైమలై మురుగన్ ఆలయం, పజముదిర్చోలై சோலைமலை పజముదిర్చోలై, మధురై జిల్లా
మదురై శివార్లలో "నూపురా గంగై" అని పిలువబడే పవిత్ర ప్రవాహంతో ఒక కొండపై ఉంది. మురుగన్ తన భార్య దేవనై వల్లితో ఇక్కడ కనిపిస్తాడు.

మూలాలు[మార్చు]

  1. "Arupadaiveedu". The Hindu. 12 November 2010. Archived from the original on 20 November 2010. Retrieved 3 December 2016.
  2. "Worship of Murugan". Archived from the original on 26 January 2010. Retrieved 26 January 2010.
  3. V.K., Subramanian (2007). 101 Mystics of India. New Delhi: Abhinav Publications. p. 109. ISBN 978-81-7017-471-4.
  4. Aiyar, P.V.Jagadisa (1982), South Indian Shrines: Illustrated, New Delhi: Asian Educational Services, pp. 191–203, ISBN 81-206-0151-3, archived from the original on 21 December 2016, retrieved 4 December 2016
  5. Zvelebil, Kamil (1975), Tamil literature, Volume 2, Part 1, Netherlands: E.J. Brill, Leiden, p. 217, ISBN 90-04-04190-7, archived from the original on 21 December 2016, retrieved 4 December 2016
  6. Zvelebil 1991, p. 53
  7. "Arupadai Veedu - Famous Murugan Temples". Dharisanam (in ఇంగ్లీష్). Retrieved 2020-07-02.
  8. Economic Reforms and Small Scale Industries. Concept Publishing Company. 2009. p. 25. ISBN 9788180694493.
  9. Clothey, Fred W.. "Pilgrimage Centers in the Tamil Cultus of Murukan". Oxford University Press.
  10. Mohamed, N.P.. "N.P. Mohamed in Conversation with A.J. Thomas". Sahitya Akademi.

వెలుపలి లంకెలు[మార్చు]